banner

Sunday, 11 November 2012

ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 23 జిల్లాలు, వాటిలో 1120[1](1123[2]) మండలాలు, మరియూ 20538[1](28936[2]) గ్రామ పంచాయితీలు ఉన్నాయి.1956 లో 20 జిల్లాలతో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడింది.తరువాత 1970 లో ప్రకాశం జిల్లా, 1978లో రంగారెడ్డి జిల్లా, 1979 లో విజయనగరం జిల్లా ఏర్పడ్డాయి.ప్రస్తుతం 23 జిల్లాలున్నాయి.


ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు is located in Andhra Pradesh
అనంతపురం
,
ఆదిలాబాదు
కరీంనగర్
కర్నూలు
కృష్ణా(మచిలీపట్నం)
ఖమ్మం
గుంటూరు
చిత్తూరు
తూ.గోదావరి(కాకినాడ)
నల్గొండ
నిజామాబాదు
ప.గోదావరి(ఏలూరు)
ప్రకాశం(ఒంగోలు)
మహబూబ్ నగర్
మెదక్(సంగారెడ్డి)
రంగారెడ్డి(హైదరాబాదు)
వరంగల్
విజయనగరం
విశాఖపట్నం
వైఎస్ఆర్
శ్రీకాకుళం
శ్రీ.పొ.శ్రీ.నెల్లూరు(నెల్లూరు)
హైదరాబాదు
ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు(ముఖ్యపట్టణాలు)
జిల్లా పేరుజనాభా కోడు[2]PMGSY కోడు [2]మండలాల సంఖ్య[1][2]గ్రామాల సంఖ్య[1]
ఆదిలాబాదు జిల్లా1AP0156866
అనంతపురం జిల్లా22AP02631005
చిత్తూరు జిల్లా23AP03661399
వైఎస్ఆర్ జిల్లా20AP0451822
తూర్పు గోదావరి జిల్లా14AP05571011
గుంటూరు జిల్లా17AP0658 (57[2])1016
హైదరాబాదు జిల్లా6AP23160[1]
కరీంనగర్ జిల్లా3AP15451194
ఖమ్మం జిల్లా10AP0846776
కృష్ణా జిల్లా16AP0950972
కర్నూలు జిల్లా21AP1054899
మహబూబ్ నగర్ జిల్లా7AP11641327
మెదక్ జిల్లా4AP12451160
నల్గొండ జిల్లా8AP13591143
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా19AP1446976
నిజామాబాదు జిల్లా2AP1536718
ప్రకాశం జిల్లా18AP16560[1](1157[2])
రంగారెడ్డి జిల్లా5AP1733 (37[2])768
శ్రీకాకుళం జిల్లా11AP18381107
విశాఖపట్నం జిల్లా13AP1942 (43[2])659
విజయనగరం జిల్లా12AP2034935
వరంగల్ జిల్లా9AP2151 (50[2])1014
పశ్చిమ గోదావరి జిల్లా15AP2246896

నల్గొండ జిల్లా

View of నల్గొండ, Indiaనల్గొండను చూపిస్తున్న పటము


అక్షాంశరేఖాంశాలు: 17.0579.27
కాలాంశంభాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం14,240 కి.మీ² (5,498 చ.మై)
ముఖ్య పట్టణమునల్గొండ
ప్రాంతంతెలంగాణ
జనాభా
• జనసాంద్రత
• మగ
• ఆడ
• అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
34,83,648 (2011)
• 245/కి.మీ² (635/చ.మై)
• 1758061
• 1725587
• 57.84(2001)
• 70.19
• 45.07
నల్గొండ లేదా నల్లగొండ దక్షిణ భారత దేశములోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము నందలి ఒక ముఖ్య నగరము మరియు 
అదే పేరుగల జిల్లాకు రాజధాని. పూర్వము నల్గొండకు నీలగిరి అని పేరు ఉండేది. నల్గొండ జిల్లాకు ఉత్తరాన 
మెదక్ జిల్లామరియు వరంగల్ జిల్లా, దక్షిణాన గుంటూరు జిల్లా మరియు పాక్షికముగా మహబూబ్ నగర్ జిల్లా , 
తూర్పున ఖమ్మం జిల్లా మరియు కృష్ణా జిల్లాలు, పశ్చిమాన రంగారెడ్డి మరియు మహబూబ్ నగర్ జిల్లా లు 
సరిహద్దులు. ఉద్యమాల పురుటిగడ్డగా పేర్కొనే నల్గొండ జిల్లాలో ఎందరో దేశభక్తులు, స్వాతంత్ర్యసమరయోధులు, 
నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించిన పోరాటయోధులు జన్మించారు. రజాకార్లను ఎదిరించిన కోదాటి నారాయణరావు[1]
, ప్రముఖ గాంధేయవాది రావినారాయణరావు, స్వాతంత్ర్య సమరయోధుడు పులిజాల రంగారావు, ఆర్యసమాజ
 ప్రముఖుడు నూతి విశ్వామిత్ర, కమ్యూనిస్టు యోధుడు బొమ్మగాని ధర్మభిక్షం, రజాకార్ల దురాగతాలను ఎదిరించిన 
మహిళ ఆరుట్ల కమలాదేవి, నిజాం వ్యతిరేక పోరాట యోధుడు కాసాని నారాయణలు ఈ జిల్లాకు చెందినవారే.

జిల్లా చరిత్ర

శాతవాహనుల కాలంలో నీలగిరిగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతమే కాలక్రమంలో నందికొండగా, నల్లగొండగా మారింది. నల్లగొండ జిల్లా పోరాటాలకు ప్రసిద్ది, ఉద్యమాల ఖిల్లాగా ఈ జిల్లాకు పేరు. ప్రపంచ చరిత్రలో 
స్థానం సంపాదించిన వీర తెలంగాణ సాయిధ రైతాంగ పోరాటానికి జిల్లా ఆయివుపట్టు.

భౌగోళిక స్వరూపం

జిల్లాలోని రెండు ముఖ్య సాగునీటి ప్రాజెక్టులు: నాగార్జునసాగర్ ప్రాజెక్టు మరియు ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు.

    నదులు

    • కృష్ణా నది
    • మూసీ నది
    • ఆలేరు
    • పెద్దవాగు
    • దిండి
    • పాలేరు

    ఆర్ధిక స్థితి గతులు

    రాష్త్రంలోనే ముఖ్యమైన మార్కెటింగ్ యార్డ్ సూర్యాపేటలో కలదు. సున్నపురాయి నిల్వలు అత్యధికంగా ఉన్న జిల్లా కావడంతో సిమెంట్ ఉత్పాదనలో ఈ జిల్లా అసియాలోనే ప్రథమ స్థానంలో ఉంది.

    డివిజన్లు లేదా మండలాలు, నియోజక వర్గాలు

    భౌగోళికంగా నల్గొండ జిల్లాను 59 రెవిన్యూ మండలాలుగా విభజించినారు[2]. ఈ క్రింద మండలము ముందు ఉన్న సంఖ్య అంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించిన మండల సంఖ్య(Mandal Code).


    దస్త్రం:Nalgonda.jpg



    1. బొమ్మలరామారం
    2. తుర్కపల్లి
    3. రాజాపేట
    4. యాదగిరి గుట్ట
    5. ఆలేరు
    6. గుండాల
    7. తిరుమలగిరి
    8. తుంగతుర్తి
    9. నూతనకల్లు
    10. ఆత్మకూరు(S)
    11. జాజిరెడ్డిగూడెం
    12. శాలిగౌరారం
    13. మోతుకూరు
    14. ఆత్మకూరు(M)
    15. వలిగొండ
    16. భువనగిరి
    17. బీబీనగర్
    18. పోచంపల్లి
    19. చౌటుప్పల్
    20. రామన్నపేట
    21. చిట్యాల
    22. నార్కెట్‌పల్లి
    23. కట్టంగూర్
    24. నకిరేకల్
    25. కేతేపల్లి
    26. సూర్యాపేట
    27. చివ్వెంల
    28. మోతే
    29. నడిగూడెం
    30. మునగాల
    31. పెన్‌పహాడ్‌
    32. వేములపల్లి
    33. తిప్పర్తి
    34. నల్గొండ మండలం
    35. మునుగోడు
    36. నారాయణపూర్
    37. మర్రిగూడ
    38. చండూరు
    39. కనగల్
    40. నిడమానూరు
    41. త్రిపురారం
    42. మిర్యాలగూడ
    43. గరిడేపల్లి
    44. చిలుకూరు
    45. కోదాడ
    46. మేళ్లచెరువు
    47. హుజూర్‌నగర్
    48. మట్టంపల్లి
    49. నేరేడుచర్ల
    50. దామరచర్ల
    51. అనుముల
    52. పెద్దవూర
    53. పెద్దఅడిశర్లపల్లి
    54. గుర్రమ్‌పోడ్‌
    55. నాంపల్లి
    56. చింతపల్లి
    57. దేవరకొండ
    58. గుండ్లపల్లి
    59. చందంపేట






  • రెవిన్యూ డివిజన్లు (4): నల్గొండ, సూర్యాపేట, మిర్యాలగూడ, భువనగిరి
  • లోక్‌సభ స్థానాలు (2): భువనగిరి, నల్గొండ
  • శాసనసభ స్థానాలు (12): సూర్యాపేట, ఆలేరు, దేవరకొండ, తుంగతుర్తి, కోదాడ, మిర్యాలగూడ,
  • హుజూర్ నగర్, నకిరేకల్, నల్గొండ, నాగార్జునసాగర్, భువనగిరి, మునుగోడు.

  • జనాభా లెక్కలు

    1981 నాటి జనాబా లెక్కల ప్రకారం నల్గొండ జిల్లా జనాబా, 22,79,658, స్త్రీ, పురుషుల నిష్పత్తి
    970:1000, అక్షరాస్యత 18.95 శాతం.(మూలం: అంధ్రప్రదేశ్ దర్శిని 1985)
    2011 జనాభా గణాంకాల ప్రకారం జిల్లా జనాభా 34,83,648. మగ వారు 17,58,061 కాగా ఆడవారు 17,25,587. 2001 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత 57.84 శాతం నమోదైంది. పురుషులలో 70.19శాతం స్త్రీలలో 45.07.

    ఆకర్షణలు


    యాదగిరి గుట్టలోని లక్ష్మీ నరసింహ దేవస్థాన
    యాదగిరి గుట్టలోని లక్ష్మీ నరసింహ దేవస్థానం
    బహుళార్థసాధక ప్రాజెక్టుకు సరైన నిర్వచనం చెప్పగల నాగార్జున సాగర్ ఈ జిల్లాకు ప్రధాన ఆకర్షణ. మానవ నిర్మిత ఆనకట్టలలో ఆసియాలోనే ఇది అతిపెద్దది. క్రీ.శ. 2వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో నివసించిన బౌద్ధమతాచార్యుడైన ఆచార్య నాగార్జునుని పేరుతో నిర్మించిన ఈ ప్రాజెక్టును 1955 లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రారంభించాడు. జలాశయం మధ్యలోని నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకూ కృష్ణా నది పొడవునా 3568 చ.కి.మీ. విస్తీర్ణంలో వ్యాపించిన రిజర్వు అడవి దేశంలో వన్యమృగ సంరక్షణ కేంద్రాలన్నింటికంటే పెద్దది. జిల్లాలోని యాదగిరి గుట్ట, తెలంగాణాలోని పర్వత ప్రాంత దేవాలయాల్లో ఎంతో పేరుపొందింది. ఇక్కడి లక్ష్మీనరసింహస్వామి గుడి అన్ని ప్రాంతాలవారికి దర్శనీయ పుణ్యక్షేత్రం. దేవాలయ నిర్మాణ రీతి ప్రాచీన ఆధునిక సంప్రదాయాల కలగలుపుగా ఉంటుంది. ఏటా రథోత్సవం జరుగుతుంది. ఫాల్గుణ మాసంలో బ్రహ్మోత్సవం, పెళ్ళిళ్ళు విరివిగా జరిగే ప్రదేశం. జిల్లాలోని ఆలేరుకు సుమారు ఆరుకిలోమీటర్ల దూరంలోని కొలనుపాక జైన మతానుయాయులకు ఒక పవిత్ర యాత్రాస్థలం. ప్రస్తుతం ఇక్కడ శ్వేతాంబర శాఖకు చెందిన ఒక జైన దేవాలయం నిత్య పూజారాధనతో విలసిల్లుతోంది. కాకతీయుల నాటి ప్రసిద్ది చెందిన శివాలయాలు సూర్యాపీట మండలం లోని పిల్లలమర్రి గ్రామంలో కలవు. వాడపల్లి తీర్ధం ఈ జిల్లాలో అతి పెద్ద శైవ క్షేత్రము.శివరాత్రి నాడు పుణ్యస్నానాలు అచరించడానికి ప్రజలు అధిక సంఖ్యలో వస్తారు. ఇది కృష్ణా ,మూసీ మరియు అంతర్వేది సంగమం.
    బుద్ధుడి శిల్పం
    హైదరాబాదుకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగార్జునసాగర్ ప్రధాన పర్యాటకకేంద్రం. ఈ చారిత్రాత్మ ప్రదేశానికి ఈ పేరు బౌద్ధసన్యాసి నార్జునుడి కారణంగా వచ్చింది. ఈ ప్రదేశంలో పండితుడైన ఆచార్య నాగార్జునుడు విద్యాకేంద్రాన్ని స్థాపించాడు. ప్రస్థుతం ఇక్కడ నాగార్జునసాగర్ ఆనకట్ట నిర్మించబడి ఉంది. నాగార్జున సాగర్ ఆనకట్ట ప్రపంచంలో పొడవైన మానవ నిర్మిత ఆనకట్టగా ప్రసిద్ధిగాంచింది. నాగార్జునసాగర్ ఆనకట్ట కింద 10 లక్షల కంటే అధికమైన ఎకరాల సాగుబడి జరుగుతుంది.
    ఈ ఆనకట్ట నిర్మించే సమయంలో త్రవ్వకాలలో బౌద్ధసంస్కృతికి చెందిన శిధిలాల పురాతన అవశేషాలు బయటపడ్డాయి. వెలికితీసిన పురాతన అవశేషాలను సుందరమైన నాగార్జున కొండ మీద బధ్రపరిచారు. ఈ కొండ మానవ నిర్మిత సరస్సుకు కేంద్రంలో ఉన్నది. పవిత్రమైన బౌద్ధస్థూప అవశేష మిగులు భాగాలను స్థూప, విహారాలు, ఒక విశ్వవిద్యాలయం మరియు పవిత్రమైన బలిపీఠం జాగ్రత్తగా రిజర్వాయర్‌కు తూర్పు భాగంలో ఉన్నాయి.
    నాగార్జున కొండ
    మానవ నిర్మిత సరస్సు మద్య మనోహరమైన ద్వీపం ఉంది. నాగార్జున కొండ త్రవ్వాకాలలో 2వ 3వ శతాబ్ధానికి చెందిన బౌద్ధసంస్కృతిక స్థూపం బయటపడ్డాయి. ఈ కొండను చేరటానికి విజయపురి వద్ద ఉన్న జెట్టి అనేప్రదేశంలో బోటు సేవలు లభ్యం ఔతాయి.
    129 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాదు విమానాశ్రయం నుండి ఇక్కడకు వాయుమార్గంలో ప్రదేశానికి చేరవచ్చు. రైలు మార్గంలో ఇక్కడకు 29 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాచర్ల నుండి చేరవచ్చు.
    యాదగిరిగుట్ట
    మహర్షి ఋష్యశృంగుని కుమారుడైన యాదగిరి అనే సన్యాసి వలన ఈ కొండకు ఈ పేరు వచ్చింది. యాదర్షి ఇక్కడ ఉన్న ఒక గుహలో ఆంజనేయుడి అనుగ్రహంతో నరసింహుని గురించి తపమాచరించాడు. ఈ కొండ నల్గొండ లోని భువనగిరి మరియు రాయగిరి మద్యలో ఉన్నది. యాదర్షి ఘాఢతపస్సుకు మెచ్చి నరసింహుడు ఐదు రూపాలలో సాక్షాత్కరించాడు. జ్వాలానరసింహ, యోగానంద నరసింహ, గంఢభేరుండ నరసింహ, ఉగ్ర నరసింహ మరియు లక్ష్మీ నరసింహ అనేవి ఆ ఐదు రూపాలు. ఇలా ప్రత్యక్షమైన నరసింహ రూపాలు ఈ కొండలలో స్వయంభువులుగా వెలసి భక్తుల పూజలు అందుకుకుంటున్నాడు. అందుకనే ఇది పంచ నరసింహ క్షేత్రం అయింది. పురాణ కధనం ప్రకారం యాదర్షికి మొదట జ్వాలా నరసింహుడిగా ప్రత్యక్షమైన జ్వాలా నరసింహరూపాన్ని దర్శించే శక్తి లేని యాదర్షి కోరిక మీద నరసింహుడు తరువాత యోగనరసింహుడిగా దర్శనమిచ్చాడు. యాదర్షి అంతటితో సంతోషపడక లక్ష్మీ సహితంగా దర్శనమివ్వమని కోరడంతో ఓడిలో లక్ష్మీసహితంగా లక్ష్మీనరసింహుడై దర్శనమిచ్చాడు. లక్ష్మీనరసింహుడు ఆళ్వారుల పూజలు అందుకుంటున్నాడు. ఊగ్రనరసింహుడి ఉగ్రతను తగ్గించడానికి గరుత్మంతుడు గండభేరుండ పక్షి రూపంలో స్వామికి ముందు నిలిచి స్వామి ఉగ్రతను తగ్గిస్తుంటాడు. ఈ శిలను దాటి వంగుతూ వెళ్ళి స్వామిని దర్శించాలి. ఈ క్షేత్రానికి పాలకుడు ఆంజనేయుడు. యాదర్షి స్వామిని ఈ ప్రదేశాన్ని తనపేరుతో పిలవాలని కోరాడు. అందుకే ఇది యాదగిరి గుట్ట అయింది. చాలాకాలం నుండి ఇక్కడ లక్ష్మీనరసింహుడు భక్తుల పూజలు అందుకుంటున్నాడు.
    చంద్రవంక జలపాతము
    ఎత్తిపోతల జలపాతముకు దిగువగా 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుందరమైన కొండచరియలలో చంద్రవంక జలపాతము ఉంది. ఈ జలపాతము పచ్చని కొండల నుండి 21.3 మీటర్ల నుండి కింద ఒక మడుగులోకి పడుతూ ఉంటుంది. ఈ జలపాతాన్ని తరచూ పర్యాటకులు దర్శిస్తుంటారు.
    ఈ సుందర జలపాతము 60 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్న చంద్రవంకానది నుండి ప్రవహించే జలాల వలన ఏర్పడింది. ఈ జలపాతం నాగార్జున కొండకు 21 కిలోమీటర్ల దూరంలో తూర్పున ఉంది. అక్కడ ధ్యానంచేసిన ఒక యతీశ్వరుడి వలన ఈ జలపాతానికి ఈ పేరు వచ్చింది. ఈ ప్రాంతంలో కొన్ని కొండ గుహాలయాలు ఉన్నాయి. ఈ ప్రాంతం వారు ఇక్కడి దైవాలను పూజిస్తూ ఉంటారు. ఈ ప్రాంతం రహదారి మార్గంలో హైదరాబాదు నుండి 150 కిలో మీటర్ల దూరంలో ఉంది విజయపురి సమీపంలో ఉంది.
    నందికొండ
    నందికొండ అంటే క్రిష్ణా నదీ తీరంలో ఉన్న చిన్న పల్లెటూరు. ఇది మిరియాలగూడకు 64.37 కిలో మీటర్ల దూరంలో ఉంది. చాలా ప్రముఖమైన ఈ నిర్మాణం ఇక్ష్వాకు వంశానికి చెందిన వారి చేత నిర్మించబడిన కోట. దృఢమైన గోడలు, కందకము, ద్వారాలు మరియు బురుజులు కలిగిన ఈ కోటలో ఒక దీర్ఘచతురస్రాకార రంగస్థలం (స్టేడియం)ఉంది.
    పోచంపల్లి
    1950 లో ఆచార్యా వినోభాభావే ఇక్కడి నుండి తన ఉద్యమాన్ని ఆరంభించాడు. ఇది బోంగిర్ నుండి 14.48 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే బీబీనగర్ నుండి 9.66 కిలోమీటర్ల దూరంలో ఉంది.
    పిల్లలమర్రి
    ఇక్కడ అద్భుతమైన చిత్రాలు, సున్నితంగా చెక్కబడిన స్థంభాలు కలిగిన పురాతన కాకతీయ ఆలయాలు ఉన్నాయి. ఈ చారిత్రాత్మక ప్రదేశం ప్రసిద్ధ కవి అయిన పిల్లల మర్రి పిన వీరభద్రుని పుట్టిన ప్రదేశం.
    కొలనుపాక
    ఇది హైదరాబాదు నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది చాలా చారిత్రక ప్రసిద్ధమైనది. ఇది 93.24 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఒకప్పుడు సమృద్ధి కలిగి ఉన్న ప్రదేశం. పాత కోట యొక్క శిధిలాలు ఇప్పటికీ మిగిలి ఉన్నాయి. ఒకప్పుడు ఎ.డి. 11వ శతాబ్ధం ఇది కల్యాణి చాళుక్యులకు రెండవ కోటగా ఉన్నప్పుడు అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది.
    ఇంకా కొన్ని ప్రముఖ ప్రాంతాలు : రాచకొండ, గాజుల కొండ, ఏలేశ్వరం, ఫణిగిరి,భోంగిర్ ఫోర్ట్,మటంపల్లి,వడపల్లి,పంగల్,సుంకిశాల,

    నాగార్జున సాగర్ 


             భువనగిరి

                                bÍ«¿£¼]\T


    పోచంపల్లి









                                                                                                                                     
                                                          <ûesÁ¿=+&ƒ
    ƒ

    ఆదిలాబాదు జిల్లా



    ఆదిలాబాదు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఒక జిల్లా. [1] [2]దీని ముఖ్యపట్టణం ఆదిలాబాదు. బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షా పేరు మీద ఈ పట్టణానికి ఈపేరు స్థిరపడింది. అంతకు ముందు అదిలాబాదును ఎడ్లవాడ అని పిల్చేవారు. రాష్ట్ర ఆదాయంలో 20% కలిగి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సంపన్న జిల్లాలలో ఇదిఒకటి.


    ఆదిలాబాదు
    ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
    View of ఆదిలాబాదు, India
    ఆదిలాబాదును చూపిస్తున్న పటము
    ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని గుర్తిస్తున్న భారతదేశ పటము
    Location of ఆదిలాబాదు
     ఆదిలాబాదు 
    అక్షాంశరేఖాంశాలు: 19.6652278.525124
    కాలాంశంభాప్రాకా (గ్రీ.కా+5:30)
    విస్తీర్ణం16,128 కి.మీ² (6,227 చ.మై)
    ముఖ్య పట్టణముఆదిలాబాదు
    ప్రాంతంతెలంగాణా
    జనాభా
    • జనసాంద్రత
    • మగ
    • ఆడ
    • అక్షరాస్యత శాతం
    • మగ
    • ఆడ
    27,37,738 (2011)
    • 170/కి.మీ² (440/చ.మై)
    • 1366964
    • 1370774
    • 61.55 (2001)
    • 71.22
    • 51.99


    జిల్లా పేరు వెనుక చరిత్ర

    అదిలాబాదు జిల్లాకు ఈ పేరు ఎలా వచ్చిందన్న విషయంలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. 
    ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు పాలించిన బీజపూరు సుల్తాను అయిన మొహమ్మద్ అదిల్ షాహ్
     పేరు మీద వచ్చింది.[3] మొహమ్మద్ అదిల్ షాహ్ తన ఆర్ధిక మంత్రి సేవలకు మెచ్చి
     ఆదిలాబాదు జిల్లా ప్రాంతాన్ని జాగీరుగా బహూకరించాడు. ఆర్ధికమంత్రి మొహమ్మద్
     అదిల్ షాహ్ మీద కృతజ్ఞత చూపిస్తూ ఇక్కడ ఒక గ్రామాన్ని నిర్మించి దానికి ఆదిల్ షా బాద్ 
    అని నామకరణం చేసాడు
    క్రమంగా అది ఆదిలాబాదుగా అభివృద్ధి చెందింది. మరో కధనం ప్రకారం ఈ ప్రాంతంలో ఒకప్పుడు 
    ఎద్దుల సంత జరిగేదనిఆ కారణంగా ఇది ఎదులాపురం అని పిలువబడేదని ముగలాయ్ పాలనా
     కాలంలో అది ఆదిలాబాదుగా మారిందన్నది భావించబడుతున్నది.

    జిల్లా చరిత్ర

    చారిత్రకంగా అదిలాబాదు జిల్లా పలు సంస్కృతులకు పుట్టిల్లు. దక్షిణభారతదేశ 
    సరిహద్దులలో ఉపస్థితమై ఉన్న కారణంగా ఇది ఉత్తరభారతదేశ సామ్రాజ్యాధినేతలైన 
    ముగలాయిలు, మౌర్యులు, దక్షిణ భారతదేశ సామ్రాజ్యాధినేతలైన శాతవాహనులు 
    మరియు చాళుక్యులు పాలించారు. ప్రస్థుతం ఈ జిల్లా ప్రజలలో పొరుగున ఉన్న
     మరాఠీ సంప్రదాయం రాష్ట్ర తెలుగు సంప్రదాయంతో గుర్తించ తగినంతగా కలిసి ఉంటుంది. 
    ఏది ఏమైనప్పటికీ, ఈ జిల్లాలో, పలు సంస్కృతులకి చెందిన వారైన బెంగాలి, మళయాళీ 
    మరియు గుజరాతీలు,పరస్పర సహకార జీవనం సాగిస్తున్నారు.

    భౌగోళిక స్వరూపం


    ఆదిలాబాదు జిల్లాకు ఉత్తరంలో మహారాష్ట్రంలోని యవత్మాల్ జిల్లా, చంద్రాపూర్ జిల్లాలు ఉన్నాయి. తూర్పున చంద్రాపూర్ జిల్లా ఉంది, దక్షిణాన నిజామాబాద్ జిల్లా, పశ్చిమంలో నాందేడ్ జిల్లాలు ఉన్నాయి. నదులుపరంగా దక్షిణాన గోదావరి నది, తుర్పున ప్రాణహిత నది, ఉత్తరంలో వార్ధా నది, పెల్ గంగా ఉన్నాయి. జిల్లా వైశాల్యం 16203.8 చదరపు కిలోమీటర్లు. వైశాల్యం పరంగా రాష్ట్రంలో ఐదవ స్థానంలో ఉంది. జిల్లాలో 40 శాతం ఉండే అడవులు క్రమంగా క్షీణిస్తున్నాయి. జిల్లాలో 75% భూభాగం ఉష్ణమండల తేమతోకూడిన అడవులతో నిండి ఉంది. ఇది ఆంద్రప్రదేశ్ లోని అటవీప్రాంతం కలిగిన జిల్లాలలో రెండవ స్థానంలో ఉంది. అదిలాబాదు జిల్లాలో కుంతల జలపాతాలు, సహ్యాద్రి కొండలు మరియూ సత్మాల కొండలు అనేక సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. 600 మిలియన్ టన్నుల మేలిరకం సున్నపురాయి నిల్వలు జిల్లాలో ఉన్నాయి. పింగాణి పాత్రలు, సానిటరీ పైపులు, ఇటుకలు, బెంగుళూరు పెంకుల తయారీకి పనికి వచ్చే బంకమన్ను విస్తారంగా లభిస్తుంది. ఈ జిల్లాలోని ప్రధాన నదులు ప్రాణహిత, పెన్‌గంగ మరియు వార్థా.


    ఆర్ధిక స్థితిగతులు


    వ్యవసాయం

    వ్యవసాయం
    ఆదిలాబాదు జిల్లాలో అధికంగా సాగుచేయబడే ఆహారపు పంట జొన్నలు, వడ్లు, మొక్కజొన్నలు, కందులు, మినుములు, సోయాబీన్, ఇతర పప్పులు, మిరపకాయలు, గోధుమలు, చెరకు. వాణిజ్యపంటలు పత్తి, పసుపు. నిర్మల్, లక్షింపేట్, ఖానాపూర్ సమీప మండలాలలో నీటిపారుదల వసతులు లభ్యం ఔతున్న కారణంగా వ్యవసాయం ఎక్కువగా చేస్తున్నారు. 3.5% భూమిలో సాగుచేయబడే ఉద్యానవన సాగుబడి వలన విదేశీమారకం వంటి ఆదాయం మరియు ఉపాధి లభిస్తుంది. సాధారణ వర్షపాత ప్రాంతం అలాగే నీటిపారుదల వసతులు స్వల్పంగా కలిగిన ఎగువ భూములలో ఉద్యానవన సాగుబడికి అనుకూలంగా ఉండి కూరగాయలు, పండ్లు, కూరగాయలు అలాగే సుగంద ద్రవ్యాలు, పూలు వంటి పంటలు కూడా పండుతున్నాయి.
    పట్టుపురుగుల పెంపకం కూడా జిల్లాకు కొంత ఆదాయం సమకూరుస్తుంది. పట్టుపురుగుల పెంపకం కొరకు 1000 ఎకరాలలో మలబరీ చెట్లు పెంచబడుతున్నాయి. జిల్లాలో పట్టుపురుగుల పెంపకం కొరకు అనుకూల వాతావరణం ఉంది కనుక పట్టుపురుగుల పెంపకం అబివృద్ధికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
    ప్రభుత్వ ప్రణాళిక కారణంగా జిల్లాలో పెంపుడు జంతువుల పెంపకం వలన ఆదాయం మరియు ఉపాధి లభిస్తుంది. జిల్లాలోఆవులు, బర్రెలు, గొర్రెలు, కోళ్ళు పెంచబడుతున్నాయి. జిల్లాలో భూపరిస్థితి పెంపుడు జంతువుల పెంపకానికి అనుకులంగా ఉంది. జిల్లాలో 87 పశువుల ఆసుపత్రులు ఉన్నాయి. ఆదిలాబాదు జిల్లాలో ఉన్న పచ్చిక నిండిన కొండ ప్రాంతాలు గొర్రెలు, మేకలు పెంచడానికి అనుకూలంగా ఉంది.


    పరిశ్రమలు


    ఆదిలాబాదు జిల్లాలో బియ్యపు మిల్లులు, నూనె శుద్ధి కర్మాగారాలు, మొక్కజొన్న పిండి, శక్తినిచ్చే 
    ఆహరపదార్థాలు, మినపప్పు మిల్లులు, సుగంధద్రవ్య పొడులు, బేకరీలు, ఐస్ క్రీం, అల్లం ముద్ద, సేమ్యా, 
    మిరపకాయల కారం, నూడుళ్లు, బిస్కత్తులు, కాగితపు రుమాళ్ల తయారీ, ఊరగాయలు, అప్పడాలు,
     వేరుశనగ బర్ఫీ, పశుగ్రాసం, వ్యవసాయం, వ్యవసాయ సంభంధిత పరిశ్రమలు జిల్లాలో ఉపాధి కల్పిస్తున్నాయి. 
    ముడి మరియు నాణ్యత పెంచబడిన తోలు, తోలు సంచులు, తోలు చెప్పులు, తోలు వస్తువులు తయారీ ఉపాధిని
     కలిగిస్తున్నాయి. చేనేత వస్త్రాలు, అల్లికలు, పాఠశాల సమవస్త్రాలు, ఉపయోగానికి సిద్ధమైన దుస్తులు, స్క్రీన్ ప్రింటింగ్, వస్త్ర పరిశ్రమ సంభంధిత పరిశ్రమలున్నాయి. ప్లాస్టిక్ సంచులు, ఎలెక్ట్రానిక్ పరికరములు, గాజులు పూసలు,టైర్లు తయారీ పరిశ్రమలున్నాయి. సిమెంటి ఇటుకలు, మట్టి ఇటుకల తయారీ పరిశ్రమలు కూడావున్నాయి.బ్లాక్ & వైట్ ఫెనిలిజ్, బట్టలుతుకు పొడి తయారీ చేస్తున్నారు. పుస్తకాలు, ఆభినందన పత్రికలు, వివాహ పత్రికలు తయారు చేస్తున్నారు. శుద్ధనీరు తయారీ, డేటా ప్రొసెసింగ్, అల్యూమినియం పాత్రలు, ఫర్నీచర్, సైబర్ కేప్స్, యంత్రాలు మరమ్మత్తు పనులు వంటివికూడా వున్నాయి.


    పరిపాలనా విభాగాలు, నియోజక వర్గాలు


    ఆదిలాబాదు జిల్లాలోని ఐదు డివిజన్లుగా 52 రెవిన్యూ మండలాలుగా విభజించినారు[4]. డివిజన్లు పేర్లు ఆదిలాబాదు, నిర్మల్, ఉట్నూర్, ఆసిఫాబాద్, మంచిర్యాల్.

    ఆదిలాబాదు జిల్లా మండలాలు

    1.తలమడుగు
    2.తాంసీ
    3.ఆదిలాబాదు
    4.జైనథ్
    5.బేల
    6.నార్నూర్‌
    7.ఇంద్రవెల్లి
    8.గుడిహథ్నూర్
    9.ఇచ్చోడ
    10.బజార్‌హథ్నూర్‌
    11.బోథ్
    12.నేరెడిగొండ
    13.సారంగాపూర్‌
    14.కుంటాల
    15.కుభీర్‌
    16.భైంసా
    17.తానూర్‌
    18.ముధోల్
    19.లోకేశ్వరం
    20.దిలావర్ పూర్
    21.నిర్మల్
    22.లక్ష్మణ్‌చాందా
    23.మామడ
    24.ఖానాపూర్
    25.కడెం
    26.ఉట్నూరు
    27.జైనూర్
    28.కెరమెరి
    29.సిర్పూర్ పట్టణం
    30.జన్నారం
    31.దండేపల్లి
    32.లక్సెట్టిపేట
    33.మంచిర్యాల
    34.మందమర్రి
    35.కాశీపేట్‌
    36.తిర్యాని
    37.ఆసిఫాబాద్‌
    38.వాంకిడి
    39.కాగజ్‌నగర్‌
    40.రెబ్బెన
    41.తాండూరు
    42.బెల్లంపల్లి
    43.నెన్నెల్‌
    44.భీమిని
    45.సిర్పూర్ గ్రామీణ
    46.కౌతల
    47.బెజ్జూర్‌
    48.దహేగావ్‌
    49.వేమన్‌పల్లి
    50.కోటపల్లి
    51.చెన్నూర్‌
    52.జైపూర్‌


    ఆదిలాబాదు లోక్‌సభ స్థానం : ప్రస్తుత ప్రతినిధి: రమేష్ రాథొద్
    శాసనసభ స్థానాలు (10):

    స్థానంప్రతినిధి
    సిర్పూర్కె. సమ్మయ్య, తెరాస
    చెన్నూర్నల్లాల ఓదెయ్య, తెరాస
    బెల్లంపల్లిజి. మల్లేష్, సీపీఐ
    మంచిర్యాలఅరవింద రెడ్డి , తెరాస
    ఆసిఫాబాద్అత్రం సక్కు, కాంగ్రెస్
    ఖానాపూర్సుమన్ రాథోడ్ , తెదేపా
    ఆదిలాబాదుజోగు రామన్న - తెరాస,
    బోధ్జి. నగేష్, తెదేపా
    నిర్మల్మహేశ్వర రెడ్డి , కాంగ్రెస్
    ముధోల్వేణు గోపాల చారి , తెదేపా


    స్థానిక స్వపరిపాలన


    జిల్లాలో 1743 గ్రామాలు 866 గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో మరియు పట్టణ ప్రాంతాలకొరకు 
    ఏడు పురపాలక సంఘాలున్నాయి. పురపాలక సంఘాల పేర్లు: ఆదిలాబాదు, మంచిర్యాల్,,బెల్లంపల్లి,
    మందమర్రి.నిర్మల్,భైంసా, కాగజ్‌నగర్

    రవాణా వ్యవస్థ


    2003లో విభాలుగా విభజించిన రైల్వేశాఖలో దక్షిణమద్య రైల్వే లోని హైదరాబాదు 
    విభాగానికి చెందిన ముద్ఖేదు స్టేషన్ అదిలాబాదులో ఉంది. హైదరాబాదు రైల్వేశాఖను 
    రెండు భాగాలుగా విభజించిన తరువాత అదిలాబాదు నాందేడ్ విభాగంలో చేరుతుంది. 
    ఇక్కడి నుండి హైదరాబాదు, నిజామాబాదు, నాందేడు, విజయవాడ, నెల్లూరు, రేణిగుంట,
     తిరుపతి, పాట్నా, నాగపూరు, నాసిక్, ముంబాయి, వరంగల్, ఖమ్మం, తెనాలి, ఒంగోలు, 
    ఔరంగాబాదు, మన్మద్, గుల్బర్గా, బీదర్, బీజపుర్, షోలాపూరు మొదలైన ఊర్లకు హైదరాబాదు
     ద్వారా నేరు రైళ్ళు ఉన్నాయి.క్రిష్ణా ఎక్స్ ప్రెస్ అదిలాబాదు కు ఒక ప్రధాన రైలు.దేశంలోనే అతి పొడవైన జాతీయ రహదారి 7 అదిలాబాదు జిల్లా వాసుల రహదారి
     ప్రయాణాలను సులభతరం చేస్తూ ఉంది. ఇది మిగిలిన మిగిలిన భారతదేశాన్ని
     అనేక రహదారి మార్గాలతో కలుపుతూ జిల్లావాసుల రహదారి ప్రయాణాలకు సహకరిస్తుంది. 
    ఇక్కడ వాయుమార్గం 1948లో జరిగిన పోలీస్ ఏక్షన్ భారతీయ వాయు సేనలచేత నాశనం
     చేయబడింది. అతిసమీపంలో ఉన్న విమానశ్రయం నాగపూరులో ఉన్నా హైదరాబాదు 
    విమానాశ్రయం మరింత ఉపయోగకరమైనది.



    జనాభా లెక్కలు

    1981 జనాబా లెక్కల ప్రకారం ఈ జిల్లా జనాబా... 16,39,003, వీరిలో స్త్రీ పురుషుల నిష్పత్తి
    990:1000, అక్షరాశ్యత: 18.97 శాతం. (మూలం: ఆంధ్రప్రదేశ్ దర్శిని. 1985)
    2011 జనాభాగణాంకాలను అనుసరించి అదిలాబాదు జిల్లా జనసంఖ్య 1,39,103. వీరిలో పురుషులు 51%, స్త్రీలు 49%. అదిలాబాదు సరాసరి అక్షరాస్యత 80.51%. ఇది జాతీయ అక్షరాస్యతకు అధికమైనది. పురుషుల అక్షరాస్యత 88.18%. స్త్రీల అక్షరాస్యత 72.73%. ఆరు సంవత్సరాలకంటే తక్కువ వయసు ఉన్నా వారి శాతం 14%. అధికారిక భాష తెలుగును,ఎక్కువ మంది మాట్లాడుతారు. ఇక్కడ వాడుకలో ఉన్న ఇతర భాషలు ఉర్ధూ మరియు మరాఠీ. జిల్లాలో అత్యధికులు హిందూ మతానికి చెందిన వారు. ముస్లిముల సంఖ్య గుర్తించతగిన స్థాయిలో ఉంది.

    సంస్కృతి


    ఆదిలాబాదు జిల్లాలో అడవులు అధికంగా ఉన్నాయి కనుక ఇక్కడ గిరిజన సంస్కృతి నేటికీ వర్ధిల్లుతూనే ఉంది. ఒకప్పటి సంస్కృతిని చాటి చెప్పే కోటలు, కట్టడాలు, గుళ్ళూ, చెక్కిన రాళ్ళు, ఇకా సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి. నిర్మల్ బొమ్మలు ప్రసిద్ధి గాంచినవి,

    పశు పక్ష్యాదులు

    ఆదిలాబాదు జిల్లా అరణ్యాలను రెండు విభాగాలుగా ఉంటుంది. ఎగువ బాగంలో తాలుక్, నల్లమద్ది, బిజసల్, చైర్మను, విప్ప, జిత్రేగి, ముష్టి వంటి వృక్షసంపద ఉంది. దిగువ భాగంలో ఉసిరి, మారేడు, మౌదుగు, వెదురు, సారపాపు వంటి వృక్షసంపద ఉంది. ఆదిలాబాదు జిల్లా దట్టమైన అరణ్యప్రాంతంలో పులులు, చిరుతపులులు, ఎలుగుబంట్లు, హైనాలు, తోడేళ్ళు మరియు అడవి కుక్కలు వంటి జంతువులు నివసిస్తున్నాయి. అలాగే అరణ్య మైదానాలలో అలాగే పక్షి జాతులలో నెమలి, పావురాళ్ళు, అడవి కోళ్ళు, రామ చిలుకలు, మైనాలు ఉన్నాయి. నీలి ఆవులు, చుక్కల జింకలు మరియు సంబార్ వంటి సాదు జంతువులు నివసిస్తున్నాయి.

    విద్యా సంస్థలు

    సంఖ్యవిద్యాసంస్థవివరణసంఖ్య
    1పాఠశాలలుప్రాధమిక పాఠశాలలు4,826
    2వివరణప్రాధనికోన్నత పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు700,772
    3జూనియర్ కళాశాలలుసరాసరి అన్ని మండలాలో112
    4కళాశాలలు32
    5ఉన్నత కళాశాలలుమంచిర్యాల, ఆదిలాబాదు10
    6ఇంజనీరింగ్ కళాశాలలుట్రిపుల్ ఐటీ, నిర్మల్, ఆగిలాబాద్3
    7కంఫ్యూటర్ పాఠశాలలునిర్మల్,సిర్ పూరు,అసిఫాబాదు,చెన్నూరు,ఖానాబాదు౧౩
    8బాలికల వృత్తి విద్యమండలానికి ఒకటి కస్తూరిభా విద్యాలయాలు32
    9వైద్య కళాశాలలురిమ్స1
    10ఫార్మసీ
    11వృత్తి విద్యాలయాలుపాలిటెక్నిక్, డైట్, ఐటీ, డీ ఎడ్, ఇతరాలు25
    12ఉపాద్యాయ శిక్షణఉట్నూరు, నిర్ల్, అసిఫాబాదు, ఆదిలాబాదు5
    13ఇతరాలు



    ఆకర్షణలు



    ఉ ద్యమకారుడు కొమరం భీం,



    జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రం నిర్మల్ పట్టణానికి 70 కి.మీ దూరంలో ఉంది. ఆంధ్ర ప్రదేశ్ లోని ఏకైక సరస్వతీ ఆలయం ఇక్కడే ఉంది. భారత దేశంలో గల రేండే రెండు సరస్వతీ దేవాలయాల్లో ఒకటి కాశ్మీరు లో ఉండగా, రెండవది ఇదే. ఇక, నిర్మల్ పట్టణం చిత్రకళకు ప్రసిద్ధి గాంచింది. కుంటాల జలపాతం చాలా ఆకర్షణీయమైంది. పులి, మొసళ్ళు, దుప్పి వంటి అడవి జంతువుల సంరక్షణకోసం "ప్రాణహిత సంరక్షణ కేంద్రం" ఏర్పాటు చేయడం జరిగింది.
    దర్శనీయ ప్రదేశాలు: బాసర, పోచంపాడు, నిర్మల్, కుంతల జలపాతం, కడెం ప్రాజెక్టు, బెల్లంపల్లి,మందమర్రి, సిర్పూర్, బుగ్గ రాజేశ్వరాలయం, కొకసమన్నూరు హనుమాన్ ఆలయం. ఎచోడా, నారాయణస్వామి ఆలయం, జైనాధ్



                                     
                              
                                                           kuntala jalapatham

      

                                    





                                Basara saraswathi temple

    No comments:

    Post a Comment