వచన కవిత తీరుతెన్నులు -- డా|| సి. భవానీ దేవి (ఆంధ్ర ప్రభ 10 May 2010)
తెలుగులో వచనం అంటే గద్యం. మన నిత్యానుభవాల భాష ఇది. ఇది ఒక వాదం కాదు. ఫ్రెంచి భాషలో Verse Libre అని ఇంగ్లీషులో Free verse అని అంటారు. తెలుగులో 1935 సంవత్సరం నుండి వచన కవితా రచన జరుగుతూనే ఉంది. 50వ దశకంలో అభ్యదయ కవిత్వదశ మారి ప్రగతివాద ప్రాణప్రతిష్ట జరిగింది. సామాజిక కవిత్వధోరణి నవీన ప్రగతి మార్గంలో ప్రయాణించినప్పుడు వచన పద్యం కొత్త తరం కవుల్ని సృష్టించింది. లయాన్విత వచనమే వచన కవిత్వమైంది. ప్రతి అక్షరంలో స్వాభావికమైన సంగీతం అంతర్లీనంగా ఉంటుంది. అక్షరంలోని సంగీతాన్ని అర్థం చేసుకొని, ఆ అక్షరాన్ని సమయానుకూలంగా ప్రయోగించటం ద్వారా ఈ లయ సాధ్యమవుతుంది. ప్రతిభగానీ, లయగానీ లేకపోతే పద్యంగానే మిగుల్తుంది కానీ కవిత్వం కాలేదు.
1950 సంవత్సరంలో భారతదేశం సంపూర్ణ గణతంత్ర దేశంగా రూపొందింది. దేశంలోని ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పునరుజ్జీవనానికి ద్వారాలు తెరుచుకున్నాయి. 1944 సంవత్సరంలో 'నయాగరా' కృతితో వచన కవిత ఆవిర్భవించింది. 1956 సంవత్సరంలో 'నాలోని నాదాలు' భూమికలో కుందుర్తి కొత్త పద్యం పుట్టుకను వివరించారు. 'తెలంగాణ' కావ్యాన్ని రాశారు. 1960 నాటికి వచన కవిత ఒక స్థిరరూపాన్ని సాధించింది. ఇప్పుడు ఎందరో కవులీ ప్రక్రియను స్వీకరించి విరివిగా రచనలు చేస్తున్నారు.
వచన కవితా ప్రక్రియలో కుందుర్తి 'నగరంలో వాన', తిలక్ 'అమృతం కురిసిన రాత్రి', పఠాభి 'ఫిడేలు రాగాలడజన్', బైరాగి 'నూతిలో గొంతుకలు, ఆరుద్ర 'త్వమేవాహం' దాశరథి 'పునర్నవం', సినారె 'మంటల్లో మానవుడు' మొదలైన ఎన్నో ఖండకావ్యాలు వెలువడ్డాయి. శేషేంద్ర, డా|| ఎన్. గోపి, కె. శివారెడ్డి మొదలైన ఎందరో కవులు, కవయిత్రులు వచన కవిత్వాన్ని మరింత పరిపుష్టం చేశారు. 1967లో Free verse Front స్థాపనతో వచన కవితకు పీఠం వెలిసింది.
వచన కవిత లక్షణాలు :
సమకాలీనత :
వచన కవిత ప్రధాన లక్షణం సమకాలీనత. అట్టడుగు వర్గాల, మధ్యతరగతి వర్గాల ఆర్థిక దుస్థితి ఈ కవిత్వం వర్ణించింది, వర్తమాన కృత్రిమ జీవనభారాన్ని మోస్తున్న సామాన్యుని జీవితాన్ని ఆవిష్కరించింది. ఆరుద్ర 'గుమస్తా ప్రేమగీతాలు', మాదిరాజు రంగారావు 'పృథ్వీగీతం' ఉదాహరణలు. ఒక కోర్టు గుమాస్తా ముళ్ళ దుప్పటి కప్పుకొని కుటుంబ వ్యధలను దిండుగా నిద్రిస్తాడని అజంతా వర్ణించారు. బైరాగి 'నాక్కొంచం నమ్మకమివ్వు' అంటూ మనకి ఆత్మవిశ్వాసం ఉండాలంటాడు. సమకాలీన రాజకీయ చారిత్రాత్మక సంఘటనలైన విశాలాంధ్రావతరణం, యుద్ధ, రాజకీయకుట్రల మీద కాళోజి-సి. విజయలక్ష్మి రాశారు. తిలక్ మధ్యతరగతి ప్రజల గురించి రాస్తూ
''చిన్నమ్మా
వీళ్ళందరు తోకలు తెగిన ఎలుకలు
కలుగుల్లోంచి బయటికి రాలేరు
లోపల్లోపలే తిరుగుతారు
ఆకలి అవసరం తీరని కష్టాలు, గడులు
వాచకాలలోని నీతులను వల్లిస్తారు''
అంటారు. వచన కవితలో యుద్ధం పట్ల విముఖత్వం తీవ్రంగా కనిపిస్తుంది.
నూతన మానవుడు :
వచన కవితలో సామాన్యుడే యుగపురుషుడు. శ్రీశ్రీ కూడా
''విప్లవం మున్ముందు మనుష్యుని
మనస్సులో ప్రారంభమౌతుంది'' అన్నారు
వర్తమాన సమాజ సమస్యల పరిష్కారం కోసం సామాన్య మానవుడ్ని ఉత్తేజితం చేసింది. వచన కవిత్వమే!
యవ్వన వర్ణన :
తెలుగు వచన కవులు వేశ్యావృత్తిని నిరసిస్తూ రచనలు చేశారు. యవ్వన ప్రతీకలుగా కనురెప్పలు, కళ్ళజోడు, టొమాటో వంటి వాటిని నారాయణబాబు వాడాడు. ఈ ప్రతీకల ప్రయోగశైలి ఫ్రాయిడ్ ప్రభావమే! పఠాభి రచనల్లో ఈ విలక్షణ కామవర్ణన వన్పిస్తుంది.
వేదన :
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత పాశ్చాత్య పీడనలోని వేదన, మృత్యు సాక్షాత్కారం, భయం, తిరుగుబాటులు, అరాజకం, నిరుద్యోగం, బ్లాక్‌మార్కెట్, నల్లడబ్బు వంటి సమస్యల గురించి కవులు వేదన, దుఃఖం, కోపం విప్లవభావాలతో కవిత్వం రాశారు.
నగర వర్ణన :
పారిశ్రామిక విప్లవ ఫలితంగా టౌన్లు నగరాలుగా, నగరాలు మహానగరాలుగా పరివర్తన చెందాయి. ప్రజలు నగరాలకు వలస వెళ్లారు. మహానగరాలు ఆధునికతకు కేంద్రాలైనాయి. నగరాల్లో మధ్యతరగతి మనుషుల్లోని ఏకాకితనం, అసమర్ధత, వేదనల గురించి వచన కవితా ఖండకలు వెలువడ్డాయి. ఆరుద్ర, పినిశెట్టి, సినారె మొదలైన కవులు నగర యాంత్రిక జీవితాన్ని వర్ణించారు. వీధులు, దురాణాలు, హోటళ్ళు, మురుగు కాల్వలు నగర వర్ననలుగా కనిపిస్తాయి. విశాఖ గురించి నారాయణబాబు ఇక్కడి రోడ్లు నీగ్రో స్త్రీ బుగ్గల్లా ఉన్నాయంటారు.
''ఇక్కడ సోడాలో కాక్‌టైల్
కిలోల్లో ఉల్లి పాషాణం
సినిమాహాలులో శిశుహత్య
సిరాబుడ్డితో ఆత్మహత్య
విమానంలో భ్రూణహత్య
పెట్టెబండిలో గర్భస్రావం''
అంటూ 'రుధిరజ్యోతి'లో అత్యంత వ్యతిరేకత వ్యక్తం చేశారు. వచన కవులు నగర జీవనంలోని యాంత్రికతను వివిధ కోణాల్లో వర్ణించారు.
ఆశావాదం :
ఎన్ని వేదనలు, నిరాశలున్నా వచనకవి మనస్థైర్యాన్ని కోల్పోలేదు. చీకట్లోంచి వెలుగుని అన్వేషించాడు. వర్తమానం నుంచి శక్తి సాధించి నవ్యశక్తిని సంతరించుకుని ఉజ్వల భవిష్యత్తుకేసి నడిచారు డా|| సినారె 'మంటలు - మానవుడు'లో
''రానున్న ప్రభాతం రాక తప్పదు
రక్తి సూక్తి సత్యమౌక్తికాన్ని
ప్రసరించక తప్పదు, నవధర్మం
ప్రభవించక తప్పదు'' అంటారు.
దాశరథి 'తిమిరంలో సమరం' చేశారు. అరిపిరాల విశ్వం 'మనిషికి శక్తి ఆశ మాత్రమే!' అంటూ కవితా 'కాలరేఖలు' గీశారు.
యుద్ధవైముఖ్యం :
వచన కవిత ముఖ్యలక్షణాల్లో యుద్ధం పట్ల విముఖత ఒకటి. పైకి ఎంత ఆనందంగా ఉన్నా అందరి మనసుల్లో యుద్ధభయం, విషాదం నిండి ఉంది. కె.వి. రమణారెడ్డి, పేర్వారం, తిలక్ యుద్ధం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
గూఢత :
కుందుర్తి అభిప్రాయం ప్రకారం వచన కవిత కేవలం ప్రగతి భావనలకే కాదు. ప్రణయభావనల అభివ్యక్తికి ఉపయోగపడుతుంది. మాదిరాజు, బోయి భీమన్న, రచనలు ఈ కోవలోకి వస్తాయి.
భాష :
ఆధునిక కవులు మధ్యయుగపు భాషను తిరస్కరించారు. తెలుగు భాషకు కొత్త రూపం ఇచ్చారు. కొత్త వస్తువుకు కొత్త భాష, సజీవమైన దైనందిక భాషను యథాతథంగా స్వీకరించారు. సహజసుందరమైన ఈ భాషలో జీవితంలోని జటిలత్వం కన్పిస్తుంది. సమాజంలో న్యాయం, సత్యం వ్యక్తం చేసే జనభాష సాహిత్య భాషయింది. నూతన ప్రతీకలు, బింబాలు వాడారు. గురజాడతో ప్రారంభమైన వ్యవహారిక భాష వచన కవిత్వంలో మధ్యవర్గీయ స్పృహకు అనువైన అభివ్యక్తిగా మలచబడింది. వచనకవులు అవసరాన్ని బట్టి ఆంగ్ల, ఉర్దూ పద ప్రయోగాలు చేశారు. పారిశ్రామిక నాగరికతను ప్రతిబింబిస్తూ శాస్త్రీయ పదజాలం విరివిగా వాడారు. ఎక్కువ ప్రచారంలో ఉన్న విజ్ఞాన విషయాలు- పారిభాషిక పదాలు స్వీకరించారు. రైలు, లగేజి, బ్రేకు, టి.సి వంటి ఆంగ్లపదాలు చెరిషించు, రనండి, ఎర్రటేపు, నీవిన్ వంటి విరుద్ధ ప్రయోగాలు చేసిన ఆరుద్ర, మద్రాస్సిటీ, హైహీలుయాన వంటి పదప్రయోగాలు చేసిన పఠాభి; ఇంగ్లీషు అంకెలతో 'అపాయం 3తుంది' వంటి పదాలు సృష్టించిన శార్వరి; వైచిత్రి కోసమే భాషలో ఇటువంటి ప్రయోగాలు చేశారు.
‘మహాప్రస్థానం’లో మార్క్సిజం ఎంత? - డా. మలయశ్రీ, ( Marxism in Mahaprasthanam)
60-70 ఏళ్లుగా అభ్యుదయ కవిత్వానికి అడ్రసు శ్రీశ్రీ. శ్రీశ్రీ ఎన్ని రాసినా ‘మహాప్రస్థానం’ మలి గేయసంపుటి (తొలి గేయ సంపుటి-ప్రభవ) వారికి ఎనలేని కీర్తి తెచ్చిపెట్టింది. పద్యపుస్తకాల్లో కరుణశ్రీగారి ‘ఉదయశ్రీ’ (మొదటి భాగం), గేయసంపుటాల్లో శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ పొందినన్ని ముద్రణలు వేరే తెలుగుపుస్తకం కానీ పొందలేదని ఖచ్చితంగా చెప్పవచ్చు. అది ఆ కవిత్వ మహత్యం, భావ పటుత్వం.
శ్రీశ్రీ సినిమా పాటలు, రేడియో నాటికలు మొ. రచనలు వేరు. అవీ బాగున్నాయ్. కొన్ని చప్పనివన్నా, ఉన్నా అది తప్పు కాదు. ముఖ్యంగా మహాప్రస్థానం కమ్యూనిజానికి, కమ్యూనిజం శ్రీశ్రీకి అవినాభావ సంబంధం కలవి అయినై అనవచ్చు. శ్రీశ్రీ కమ్యూనిస్టులకు కొండంత అండ. ఆయన సామ్యవాద సిద్ధాంత కేంద్రం-ఆయన కవిత్వం ప్రచార సాధనం అయింది.
‘మహాప్రస్థానం’ మరోసారి చదవండి. మార్క్సిజం ఊపు, ఉద్యమం ముందు చూపు వున్న గేయాలు అందులో ఎన్ని వున్నవో లెక్కించండి. కాలక్షేపానివి, నిరాశవి, సొంత విషయాలు, అనువాదాలు వదిలితే దాదాపు పదికి మించవు. అవునా? పావుభాగం అయితేనేం! ‘పదండి ముందుకు’, ‘దేశ చరిత్రలు’ రెండు గేయాలు చాలు, శ్రీశ్రీని మహాకవి పీఠంమీద కూర్చోబెట్టడానికి.
ఆధునిక భావాలకు ఆద్యుడు! గురువు అనదగిన గురజాడ ‘సుభద్ర’ పద్యాలు కేవలం సంప్రదాయ కవిత్వమే కదా. పూర్ణమ్మ, కన్యక గేయాలు, సంస్మరణాత్మకమైనవే అయినా అవి కొన్ని కులాల సమస్యలే ‘కన్యాశుల్కం’ భాష, నాటకీకరణ నవ్యంగా భవ్యంగా ఉన్నా ఆ సమస్య ఒక కులానిదే. ‘దిద్దుబాటు’ కథ కథనం శిల్పం గొప్పగా ఉన్నా విషయం సామాన్యం. ‘ముత్యాల స్వరాలు’లో ప్రగతిశీల భావాలున్నాయి. ఒక్క ‘దేశభక్తి’ గేయం చాలు గురజాడ అప్పారావుని ఆధునిక అభ్యుదయ కవుల పంక్తిలో అగ్రస్థానాన నిలపడానికి.
శ్రీశ్రీ సైతం అంతే. ఆయనే కాదు, మరే కవి/రచయిత కానీ, రాసినదంతా వాసికి రాదు-కాదు కూడా! జనం ఆసక్తి అవసరాన్ని బట్టి కవుల రచనలకు ఆదరణ విలువ లభిస్తాయ. ప్రచారం వేరు, మన కులం మతం, పార్టీ అయితే వారి తప్పయిన ఒప్పే. కాకపోతే ఒప్పయినా తప్పే అనే పనికి మాలిన పద్ధతి ఇప్పుడు మన సమాజంలో చాలావరకు చలామణి అవుతున్నది.
శ్రీశ్రీకి యుగకవి, మహాకవి అనే బిరుదులు అనవసరం. అవి రాచరిక కాలంనాటి వందిమాగధ స్తోత్ర పదాలు. శ్రీశ్రీ ఈనాటి ప్రజాకవి. శ్రామిక జన పక్షపాత సామ్యవాద కవి-విప్లవ కవి.
అయితే ఆయనపై కొన్ని విమర్శలు లేకపోలేదు. అవి ఇవి
1. అలవాట్లు, ఆహార విహారాల విషయాలు. అవి వ్యక్తిగతం. లోకంలో ఎవరూ సంపూర్ణ సుగుణవంతులు కారు. సమాజానికి కష్టం కలిగించనంత వరకు వాటి జోలి మనకు అనవసరం. ‘‘పేరు ధర్మరాజు పెనువేప విత్తమా’’ అన్నాడు అజాత శత్రువును మన కవి వేమన. ఇక ఇతరుల గురించి చెప్పేదేముంది?
2 కమ్యూనిస్టును అంటూ క్యాపిటలిస్టుల సినిమాలకు పనిచేయడమేమిటి? అని మరో ప్రశ్న. ఉదర నిమిత్తం బహుకృత వేషం. తొలి తరం కమ్యూనిస్టు కవులు, నటులు చాలామంది సినీరంగాన్ని ఆశ్రయించినారే. వృత్తిని కాదు, వారి ప్రవృత్తి! ప్రవర్తన ఎట్లుంది? అనేది మాత్రమే మనము పట్టించుకోవలసిన అంశం.
3. శ్రీశ్రీ సంప్రదాయ భావాలు పూర్తిగా వదులు కోలేదని-అప్పుడే కాదు, ఇప్పటికీ కమ్యూనిస్టులు ముఖ్యంగా ఆర్థిక-సామాజిక విషయాలపై చూపుతున్న శ్రద్ధ, కులమత నిర్మూలన-్భతికవాద భావ వ్యాప్తిపై చూపుతూ లేరుకదా, ఇది మన కమ్యూనిస్టుల లోపం, అయినా శ్రీశ్రీ కవనంలోని సంప్రదాయ విధేయత కొంతవరకు ఆలోచనీయాంశమే.
‘‘త్రికాలాలలో త్రిలోకాలలో’’ మొదటిది సరే. రెండవది ఏమిటి? సంప్రదాయ భావమనేనా?
‘‘జగన్నాధుని రథ చక్రాల్ వస్తున్నాయ్’’ అంటే అది పూరి జగన్నాథుని రథ చక్రాల ప్రభావమేనా? సమర్ధన వేరు.
‘‘బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను’’ ఎందుకో? ఉత్తదె అది
‘‘పొలాల నన్నీ హలాలదున్ని’’ అది ప్రాస కోసమే కదా, హలం కంటే నాగలి, అరక అనేవే జనం ఎక్కువగా వ్యవహరించే పదాలు.
ఇంకా ‘‘ఖడ్గసృష్టి’’లో ‘కవి’కి సమాంతరంగా ‘పవి’ అనే పదముంది. అది ఎవరికి తెలిసేది?పవి=వజ్రాయుధం, ఇంద్రునిది.
శ్రీశ్రీకి భాషా సౌందర్యంతోపాటు, భావ గాంభీర్యం, ప్రాసలు ఇష్టం. పులి చంపిన వేడి నెత్తురు-సరే. యజ్ఞోపవీతాన్ని, వైప్లవ్య గీతాన్ని-జంజెం (జంధ్యం) ప్రసక్తి అవసరమా? ఇది ‘‘బసవనీదు భక్తి బ్రాహ్మంబుతో పొత్తు వదలలేను నేను’’ అని 12వ శతాబ్ది వీరశైవ కవి పాల్కురికి సోమనాథుడు అన్నట్లేనా?
‘‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను’’ అంటే, ఆ అగ్ని, హోమకుండం! శ్రీశ్రీ కవిత్వంలో సంప్రదాయ వాసన కొంత వుంది. ఉండకూడదు. కాని, అది మన కమ్యూనిజం ప్రారంభ దశ. ఆ తర్వాతి కవులైనా దాన్ని వదులుకున్నారా? అంటే, వారికి ‘‘మహాప్రస్థానం’’ మార్గదర్శకమయ్యె. అందుకే- ‘దివంగత, నివాళి, అదృష్ట దురదృష్ట పదాలు’’ ఇప్పటికీ వాడుతున్నారు కొందరు.
శ్రీశ్రీకి దళిత స్పృహ లేదు-అనేది ఇటీవలి మరో విమర్శ. లేదు నిజమే. కానీ, ఆయన ఏ కులాన్నయినా ఉన్నతమైనదనో, అధమమనో-బలపరచెనా, త్రోసిపుచ్చెనా? లేదే! సామ్యవాదులకు కులమత పక్షపాతం ఉండదు. ఉండకూడదు! శ్రీశ్రీకి లేదు. దళిత కులవాదం ఇటీవలిది. అది కమ్యూనిజంను విమర్శించేదాకా వెళ్లింది. అది వేరు, వాళ్లిష్టం.
ఒక్కో వ్యక్తి అభిరుచి ఒక్కో తీరు. వారి స్థాయిని, సాధనను గుర్తించి వారిని అభిమానించారు. అవసరమైతే అనుసరించాలె. మనకు సాధ్యమైతే మరింత ముందుకు సాగిపోవలె. అట్లయితేనే ప్రయోజనం. ఊరకే విమర్శిస్తూ ఉంటే వృధా కాలహరణం. సాహిత్యమంటే ఏ ఒక్క ప్రక్రియో, భావమో, సిద్ధాంతమో కాదు. సంప్రదాయ విధేయులూ ఉన్నారు. అభ్యుదయ వాద రచయితలూ ఉంటారు. ఎవరివాళ్లను వాళ్లు అతిగా పొగడుతూ వుంటే, విమర్శలు రాక తప్పవు. శ్రీశ్రీ మంచి మనిషి. గొప్ప కవి. ఆయన భావాలకంటే కవిత్వానికి ముగ్ధులమయాం అన్న వాళ్లున్నారు. అయితే శ్రీశ్రీ అభిమానులు కేవలం భజనలు మాని, నిష్పాక్షిక సమీక్షలు వెలువరిస్తే విపక్షుల విమర్శలకు తావుండదు.
- డా. మలయశ్రీ
Viswambhara by C Narayana Reddy
Download Viswambhara here: Viswambhara
విశ్వంభర డా.సి.నారాయణరెడ్డి రచించిన పద్య కావ్యము. ఈ గ్రంధానికి 1988 సంవత్సరంలో భారతదేశంలోని అత్యున్నతమైన జ్ఞానపీఠ పురస్కారం ప్రదానం చేయబడినది. సినారె దీనిని రాజాలక్ష్మీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మరియు తన ప్రియమిత్రులైన శ్రీ రమణయ్య రాజా గారికి అంకితమిచ్చారు. దీనిని మొదటిసారిగా 1980లో ముద్రించారు.
ఈ విశ్వంభర కావ్యాన్ని కొన్ని విశ్వవిద్యాలయాలు ఎం.ఏ.స్థాయిలో పాఠ్యగ్రంథంగా నిర్ణయించాయి. దీని మీద ఎం.ఫిల్., పి.హెచ్.డి. పట్టాల కోసం పరిశోధనలు జరిగాయి. దీనిని హిందీలోకి ఆచార్య భీమసేన్ నిర్మల్, ఇంగ్లీషులోకి డాక్టర్ అమరేంద్ర అనువదించారు.
ప్రస్తావన
ఈ కావ్యానికి నాయకుడు మానవుడు. రంగస్థలం విశాల విశ్వంభర. ఇతివృత్తం తేదీలతో నిమిత్తంలేని, పేర్లతో అగత్యంలేని మనిషి కథ. ఈ కథకు నేపధ్యం ప్రకృతి.
మనిషి ధరించే వివిధ భూమికలకు మూలధాతువులు మనశ్శక్తులు.
అలెగ్జాండర్, క్రీస్తు, అశోకుడు, సోక్రటీస్, బుద్ధుడు, లింకన్, లెనిన్, మార్క్స్, గాంధీ - ఇలా ఇలా ఎన్నెన్ని రూపాలో మనిషికి!
కామం, క్రోధం, లోభం, మదం, ఆత్మశోధనం, ప్రకృతిశక్తుల వశీకరణం - ఇలా ఇలా ఎన్నెన్ని విభిన్న ప్రవృత్తులో మనిషికి!
ఆదిమదశ నుంచీ ఆధునికదశ వరకు మనిషి చేసిన ప్రస్థానాలు ఈ కావ్యంలోని ప్రకరణాలు.
మనిషి సాధన త్రిముఖం - కళాత్మకం, వైజ్ఞానికం, ఆధ్యాత్మికం. ఈ సాధనలో అడుగడుగునా ఎదురుదెబ్బలు. క్షతుడైనా మనిషి తిరోగతుడు కాలేదు.
ఇలాంటి మహోన్నతమైన ఆలోచనల రేఖాచిత్రం 'విశ్వంభర' కావ్యరచనకు పునాది.
రచననుండి ఉదాహరణలు
- ఆరంభం
నెత్తి మీద నీలి తెర
కాళ్ళ కింద ధూళి పొర
ఆ తెరకు అద్దిన అద్దాల బిళ్లల్లో
మిణుగురులు కనురెప్పలు మిటకరించాయి
చిచ్చుముద్దల్లోంచి
చిమ్ముకొచ్చిన పచ్చి వెలుగులు
పాలమీగడల్లా పరుచుకున్నాయి
- ఇంకా
పువ్వు నవ్వింది భ్రమరాలుగా
పుడమి కదిలింది చరణాలుగా
జడిమ కదలింది హరిణాలుగా
నీటికి రెక్కలు మొలిచి నింగినందుకుంది
నింగికి అడుగులు కదిలి నేలనందుకుంది
వేయి తోటలను నరికిన చేయి
పూయిస్తుందా ఒక్క పువ్వును
ఉర్వీతలాన్ని వణికించిన శక్తి
ఒక్క హృదయాన్ని జయిస్తుందా...
- ముగింపు
మనిషికి ఉడుపు జగతి
ఇదే విశ్వంభరా తత్వం
అనంత జీవిత సత్యం
అనువాదాలు
విశ్వంభర కావాన్ని డాక్టర్ అమరేంద్ర ఆంగ్ల భాషలోకి అనువదించారు. దీనిని స్టెర్లింగ్ పబ్లిషర్స్ 1986లో ముద్రించారు. దీనిని హిందీ భాషలోకి ఆచార్య భీమసేన్ నిర్మల్ అనువదించారు.
ప్రశంసలు, పురస్కారాలు
ఈ రచనకు 1988లో జ్ఞానపీఠ పురస్కారం లభించింది. ఆంగ్ల, హిందీ భాషలలోకి ఇది అనువదించబడింది. కొన్ని విశ్వవిద్యాలయాలలో దీనిని పాఠ్యగ్రంధంగా నిర్ణయించారు. దీనిపై డాక్టరేటు పరిశోధనలు కూడా జరిగాయి. కలకత్తా భారతీయ భాషా పరిషత్తు 'భిల్వారా' అవార్డును, త్రివేండ్రం కుమారన్ ఆసాన్ అవార్డును, సోవియెట్ ల్యాండ్ నెహ్రూ అవార్డును పొందింది.
ఈ రచన గురించి చీకోలు సుందరయ్య ఇలా వ్రాశాడు - భూమ్యాకాశాల పుట్టుక నుంచి మొదలైన ఈ విశ్వంభర కాలం స్వరూపాన్ని, మనిషి వికాసాన్ని, చైతన్యాన్ని, ఆ చైతన్యం ప్రదర్శించిన విశ్వరూపాన్ని అనేక విధాలుగా ఆవిష్కరిస్తుంది. మానవ ప్రస్థానంలో మజిలీలు, ఆ మజిలీల పునాదుల మీద భవిష్యత్తరాలు సాధించిన విజయాలు, ఆ విజయాల సోపానాల మీద పయనించిన మానవుడు పొందిన అనుభవాలు... అన్నీ విశ్వంభరలో పాఠకుల కళ్లముందు సాక్షాత్కరిస్తాయి. మనశ్శక్తి వ్యక్తిగా సాగితే జీవిత చరిత్రగా, సమష్టిగా సాగితే సమాజ చరిత్రగా ఎలా కనిపిస్తుందో సినారె కలం దాన్ని ఒడిసి పట్టుకుని మనముందు నిలుపుతుంది. విశ్వంభర ఆధునిక ఐతిహాసిక వచన కవితా కావ్యం. కాల గమనానికి దర్పణం. తేదీలు, దస్తావేజులు, గణాంకాలు లేక మానవ చరిత్రను కీర్తిస్తున్న గానం. ఇందులో కవిత్వాన్ని ఆస్వాదించే వారికి అడుగడుగునా కవిత్వమే లభిస్తుంది... . ... కళాత్మకంగా, వైజ్ఞానికంగా, ఆధ్యాత్మికంగా, సామాజికంగా అన్ని అంశాలను స్పృశిస్తోన్న విశ్వంభర మరో మాటలో చెప్పాలంటే మనసు కావ్యం ... . విశ్వంభరలోని మానవుడు, కథానాయకుడు ఒక్క భారతీయుడే అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఇందులో సంపూర్ణ మానవ వికాసమే కావ్యాత్మగా ఉంది. సినారె ప్రతి పంక్తినీ చమత్కారంగా, రసాత్మకంగా తీర్చిదిద్దారు. భావాల్లో కొన్నిచోట్ల నూతనత్వం కొరవడినా సినారె నాజూకు నగిషీ పనితనం నూతనత్వం కలిగిస్తుంది. ఆధునిక కవిత్వంలోని గందరగోళం ఏమాత్రం లేకుండా ప్రతి దృశ్యం పాఠకుల ముందు కదలాడుతూ కాలయంత్రంలా సాగిపోతుంది. ఆ అనుభవాలతో తడిసిపోతుంది.
ఆచార్య ఎన్.గోపీ - "విశ్వంభర అంటే భూమి, ప్రపంచం అని అర్థాలు. అయితే ఇది కేవలం భూగోళం అనే మట్టిముద్దను గురించిన కావ్యం కాదు. ఆ మట్టిలో పుట్టిన మనిషి అనే ప్రాణి పొందిన వికారాన్ని గురించి, వికాసాన్ని గురించి ఆ వికాసక్రమంలో ఆ మనిషి చైతన్యస్థాయి గురించి, ఈ చైతన్యానికి మూలమైన మట్టితో అతని సంబంధాన్ని గురించి. మట్టే విశ్వంభర. విశ్వంభరే మానవుడు"
డా. పి.వి.రమణ - "విశ్వమానవ ఆత్మకథగా, అనుభవ గాథగా క్లాసిక్ ప్రమాణాలతో భావచిత్రాభి వ్యక్తి కవితా శిల్పంలో ప్రతీకాత్మంగా విశ్వంభరను అలంకరించారు.
శ్రీ కృష్ణదేవరాయ మహోత్సవాలు! - 500th Anniversary of Coronation Of Sri Krishnadevaraya
తెలుగు ప్రజలున్న అన్నిచోట్లా నేటికీ శ్రీకృష్ణదేవరాయలు నిలిచే ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, బయటి రాష్ట్రాల్లోకూడా తెలుగువారికి నేటికీ ఆయన స్ఫూర్తి దాత. తెలుగు భాషా సాహిత్యాలకు ఆయన చేసిన సేవే ఇందుకు కారణం. యుద్ధతంత్రంలో ఎంత నేర్పరో, సాహితీక్షేత్రంలోనూ అంతటి ప్రతిభాశాలి. సైనికబలంతో పాటు కవి దిగ్గజాలను కూడా తనతో తోడ్కొని వెళ్లి యుద్ధ విరా మ సమయాల్లో సాహితీగోష్ఠి జరిపిన రాజు మరొకరు మనకు చరిత్రలో కనిపించరు. అందుకే ఆయనను సాహితీ సమరాంగణ సార్వభౌముడు అన్నారు.
తెలుగువారు భాషాప్రయుక్త రాష్ట్రంకోసం, విశాలాంధ్ర కోసం చేసిన పోరాటంలో కూడా శ్రీకృష్ణదేవరాయలు స్ఫూర్తికేంద్రం. సంస్కృత భాషలో పండితుడయివుండీ, ఇతర ద్రావిడ భాషలు తెలిసినవాడయివుండీ తెలుగులో ‘అముక్తమాల్యద’ వంటి ప్రబంధ రచన చేయడం ఆయనకు తెలుగుభాషతో, తెలుగుజాతితో ఉన్న మమేకతను తెలుపుతుంది. ప్రజల భాషలో పరిపాలన చెయ్యాలని, తన ప్రజల భాషాసాహిత్యాల వికాసానికి రాజే బాధ్యుడనీ ఆచరణాత్మకంగా నిరూపించిన చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు. నేటి మన ప్రజా ప్రభుత్వాలు శ్రీకృష్ణదేవరాయల నుంచి నేర్చుకోవలసింది చాలా ఉంది. పరిపాలకుడుగా సామరస్యతను, రాజనీతిని ఎలా ప్రదర్శించగలిగాడో, ప్రజల భాషను ప్రోత్సహిస్తూనే వివిధ భాషీయులున్న సమాజం లో భాషా జాతి సమైక్యతను ఎంత నేర్పుగా సాధించ గలిగాడో, శ్రీకృష్ణదేవరాయలనుంచి నేర్చుకోవాలి. భారతీ య సంస్కృతీ మర్యాదలను పటిష్టం చేస్తూ, వాటి విలువలను చాటి చెప్పడంలో నిపుణతకు ఆయన ఒక ప్రతీకగా నిలిచాడు.
అయితే, ఇంతటి మహావ్యక్తి గురించి, ఇంతటి గొప్ప పాలకుడి గురించి పరిశోధన ఏమాత్రం జరిగింది? ఆయనను గురించిన వివరాలను వెలికితీసి ఎంతమాత్రం గ్రంథస్థం చేశాం? విదేశీ రచయితలు మన ముందుకు తెచ్చిన వివరాలే మనకు ఆయన్ను గురించి కొంత సమాచారాన్నందిస్తున్నవి. శిలాశాసనంతోపాటు, సాహిత్య సంపద మాత్రమే మనకు ఆయన గొప్పదనాన్ని తెలియజేస్తున్నది. వీటి ఆధారాలతోనైనా మనం ఎంతో పరిశోధన చేయవలసివుంది.
కృష్ణాజిల్లా విజయవాడకు 45 కి.మీ. దూరంలో కృష్ణా నది ఒడ్డున శ్రీకాకుళంలో ఆంధ్రమహావిష్ణువు దేవాలయం ఉన్నది. తొలి ఆంధ్ర సామ్రాజ్య స్థాపకుడుగా ప్రసిద్ధుడై, ఆదర్శ రాజ్యాన్ని స్థాపించి, చరిత్రకెక్కిన ఆంధ్ర మహా విష్ణువు క్రీస్తుపూర్వం అయిదారు శతాబ్దాల నాటివాడని తెలుస్తున్నది. అప్పటికే భాషా సంస్కృతులు కలిగిన నాగరిక రాజ్యాన్ని ఆ ఆంధ్ర నాయకుడు ఏలినట్లు తెలు స్తున్నది. ఇప్పుడు తెలుగుభాషా ప్రాచీనతను మనం నిరూపించుకొనే కృషిలో దీన్ని ఒక ప్రధానాంశంగా గ్రహించాలి. తర్వాత దాదాపు 2000 ఏళ్లకు, 1518లో కళింగ జైత్ర యాత్రకు వచ్చిన ‘సాహితీ సమరాంగణ సార్వభౌముడు’ శ్రీకృష్ణదేవరాయలు, శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువుని సేవించడానికి 1518 ఫిబ్రవరి 11న వచ్చి ఇక్కడ విడిది చేశాడు. ఆ పుణ్యరాత్రి శ్రీకాకుళాంధ్రదేవుడు రాయలవారికి కలలో ప్రత్యక్షమై ‘అముక్తమాల్యద’ రచన చేయవలసిందిగా ఆదేశించాడట. దాదాపు రెండువేలేళ్ల తర్వాత, మరొక సువిశాల తెలుగు సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణదేవరాయలు ఈ తొలి తెలుగు నాయకరాజు దేవాలయాన్ని దర్శించి స్ఫూర్తి పొందడం, ‘అముక్త మాల్యద’ వంటి ప్రబంధ రచనకు శ్రీకారం చుట్టడం… ఈ తెలుగుజాతి ఆత్మజ్యోతి ఎంత శక్తి మంతమైనదో మనకు తెలుపుతున్నది.
తెలుగువారి తొలి రాజధానిలో విడిది చేసిన శ్రీకృష్ణదేవరాయల అంతరంగంలోకి ప్రవేశించిన ఆంధ్ర మహా విష్ణువు- ఆనాటికీ ఏనాటికీ చెదరరాని ఒక ఆదేశాన్నిచ్చాడు. ‘తెలుగదేల యన్న దేశంబు తెలుగు’ అని ఆ ఆదేశం. అంటే ఈ దేశం తెలుగు ప్రజలది కనుక ఇక్కడ తెలుగే రాజ్యమేలాలి అని. ‘దేశభాషలందు తెలుగు లెస్స’ అని కూడా ఆయనే చెప్పాడు. ఈ దేశాన్ని పాలించేవాడిగా తాను తెలుగు వల్లభుడననీ చెప్పుకున్నాడు. ఆంధ్రమహావిష్ణువు ఇచ్చిన ఈ ఆదేశాన్ని స్పష్టం చేయడం ద్వారా శ్రీ కృష్ణదేవరాయలు ఒక తెలుగు రాజ్యాధీశుడుగా తన విధాన ప్రకటన చేశాడన్నమాట. ఇదే సమయంలో రాయలు, తన సామ్రాజ్యంలోని అయిదు భాషా ప్రాంతాలకు విజయనగరాన్నే కేంద్రంగాచేసి, శాసనములను తెలుగు, కన్నడ, తమిళ, మళయాళ, కొంకణ భాషల్లో వేయించాడని, తన ఆస్థానంలో తెలుగు కవులతో పాటు తమిళ, కన్నడ కవులకు కూడా స్థానం కల్పించి గౌరవించాడని మరచి పోకూడదు. భాషా సమైక్యత, జాతీయ సమైక్యతలకు ఆయన ఎంత ప్రాధాన్యమిచ్చాడో గమనించండి.
మన గతం, వర్తమానం, భవిష్యత్తు అంతా మనం మన భాషా సంస్కృతులను వికసింపజేసుకోవడం మీదే ఆధార పడి ఉంటుంది. మన జాతి ఐక్యతను కాపాడుకొంటూ, రాజ్యాన్ని సుభిక్షంగా విలసిల్లజేసుకోవడం మీదే ఆధార పడి ఉంటుంది. ఈ సత్యాన్ని నాటి ఆంధ్రనాయకుడయిన శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు, నిన్నటి తెలుగు వల్లభుడైన శ్రీకృష్ణదేవరాయలు ఆచరణాత్మకంగా చాటిచెప్పారు.ఈ మహత్తర చారిత్రక సన్నివేశాన్ని స్ఫూర్తిగా తీసు కుని శ్రీకాకుళంలో శ్రీకృష్ణదేవరాయ మహోత్సవాలు ఫిబ్రవరి 9నుండి మూడు రోజుల పాటు జరుగుతాయి. అముక్తమాల్యద మండపంలో శ్రీకృష్ణదేవరాయలు కాంస్య విగ్రహ ప్రతిష్ఠాపన ఉంటుంది.మనది తెలుగుజాతి. రెండువేల అయిదువందల సంవ త్సరాల ఘనమైన చరిత్రగల మహోన్నత జాతి. మన జాతి, చరిత్ర, భాష, సంస్కృతుల ఔన్నత్యాన్ని మరచి పోతున్న ప్రస్తుత తరాన్ని జాగృతం చేయడం, వాటి ప్రాచీనతను, గొప్పతనాన్ని మన జీవనవిధానంలోని విశిష్టతను తెలియజేస్తూ ఆత్మౌన్నత్యభావాన్ని పెంపొందించుకుని ‘నేను తెలుగువాడిని’ అని సగర్వంగా ప్రపంచంలో ఏ మూలనైనా ప్రకటించుకొనేలా చేయడానికి కావలసిన స్ఫూర్తిని, సమాచారాన్నీ, ఉత్తేజాన్నీ నింపడానికి శ్రీ కృష్ణ దేవరాయలు సదా మనకు స్ఫూర్తికేంద్రం.
ఆముక్తమాల్యద Amukta Malyada by Sri Krishna Deva Rayalu
Download Amukta Malyada here: Amukta Malyada
సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా ప్రఖ్యాతి వహించిన విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు రచించిన తెలుగు ప్రబంధం ఈ "ఆముక్తమాల్యద" గ్రంథం. దీనికే "విష్ణుచిత్తీయం" అని మరోపేరు. ఇది తెలుగు సాహిత్యంలో పంచకావ్యాలు లో ఒకటిగా ప్రసిద్ధిచెందినది.
ప్రారంభం
ఆముక్తమాల్యదలోని మొట్టమొదటి పద్యములో శ్రీవేంకటేశ్వరుని స్తుతించి కావ్యనియమములను అనుసరించి నమస్క్రియతో మరియు 'శ్రీ' శబ్దం తో కావ్యామారంభించినాడు.
శ్రీ కమనీయ హారమణి
జెన్నుగ దానును, గౌస్తుభంబునం
దాకమలావధూటియును
దారత దోప పరస్పరాత్మలం
దాకలితంబు లైన తమ
యాకృతు లచ్ఛత బైకి దోపన
స్తోకత నందు దోచె నన
శోభిలు వేంకట భర్త గొల్చెదన్.
సాధారణంగా శార్దూల విక్రీడములతో కావ్యములు ప్రారంభించుట పరిపాటియై యుండగా, ఈ కావ్యము ఉత్పలమాలతో ప్రారంభమైనది. మహాలక్ష్మి, శ్రీవేంకటేశ్వరులు, ఇరువురి వక్షస్థలములందు పరస్పరము రూపములు ప్రతిఫలించుట ద్వారా కావ్యకథలోని ఆముక్తమాల్యద, రంగనాయకుల పరిణయ వృత్తాంతమును సూచించి రాయలు వస్తు నిర్దేశము గావించెను.
శ్రీవేంకటేశ్వరుని ప్రస్థావన
కావ్య ప్రారంభంలో ప్రస్తావన తర్వాత చాలా చోట్ల శ్రీవేంకటేశ్వరుని పలు విధాలుగా ప్రశంసించాడు.విష్ణుమూర్తి శయనించిన శేషుని వర్ణన, శ్రీదేవిని కనుమరుగు పరచి శ్రీవేంకటేశ్వరునికి భూదేవితో క్రీడించుట కవకాశము కల్పించిన శేషుని రాయలు స్తుతించినాడు. రాయలు తరువాతి పద్యములలో చాల భాగము తిరుమల నంతయు సాక్షాత్కరింపజేసినాడు.
తిరుమల బ్రహ్మోత్సవాలు జరిగే సందర్భము లేదా ఇతర పూజా సందర్భాలలో, ధ్వజారోహణ గావించి శుభారంభము చేసే సందర్భాలలో విశ్వక్సేనుని పూజించుట నేటికీ పరిపాటి. ఈ ఆచారాన్ని రాయలు ఆముక్తమాల్యదలో సైన్యపతి యొక్క కాంచనవేత్రము (బంగారు దండము) కదలనిదే లోకవ్యవహారమే జరుగదని ఇలా వర్ణించాడు:
పూని ముకుందునాజ్ఞగనుబొమ్మనె
కాంచి యజాండభాండముల్
వానను మీద బోవ నడు
వ న్గొనెదన్నననగ్రనిశ్చల
త్వానుచలత్వనిష్ఠలె స
మస్తజగంబుల జాడ్యచేతనల్
గా నుతి కెక్కు సైన్యపతి
కాంచనవేత్రము నాశ్రయించెదన్.
హరి పాంచజన్యమును పూరించినంతనే ఆ ధ్వని మాత్రము చేతనే రాక్షసుల ప్రాణములు హరీయన్నవని వర్ణించాడు. పాంచజన్యపు రాకా పున్నమినాటి చంద్రుని తెల్లని కాంతి గలదైన హరి శంఖము వెలుగులీనుచు కళ్యాణ సమృద్ధిని కూడ ఒనగూర్చునని రాయల శుభాసంసన.
హరిపూరింప దదాస్య మారుత సుగం
ధాకృష్ణమై నాభిపం
కరుహక్రోడమిళిందబృంద మెదు రె
క్కందుష్క్రి యాపంక సం
కరదైత్యాసు పరంపరం గముచు రే
ఖం బొల్చురాకానిశా
కరగౌరద్యుతి పాంచజన్య మొసగుం
గళ్యాణసాకల్యమున్.
శంఖు చక్ర గదాధరుడని శ్రీవేంకటేశ్వరుని స్తుతి కదా. కానీ రాయలు ఆముక్తమాల్యదలో చక్రమునకే పెద్దపీట వేసి తరువాత శంఖువు గదలను వర్ణించినాడు. శ్రీవారి నందక ఖడ్గం పాపములనెడి తీగలయొక్క శ్రేణిని పటాపంచలు చేయగల సామర్ధ్యము కలదని వర్ణించాడు:
ప్రతతోర్ధ్వాధరభాగపీఠయుగళీ
భాస్వత్త్సరు స్తంభ సం
స్థితి దీండ్రించెడుజాళువా మొసలివా
దీప్తార్చిగా గజ్జలా
న్వితధూమాసితరేఖ పైయలు
గుగా విజ్ఞానదీపాంకురా
కృతి నందం బగు నందకం బఘలతా
శ్రేణిచ్ఛిదం జేయుతన్.
శ్రీ వైష్ణవ మతాచార్యులైన పన్నిద్దరాళ్వారులను రాయలు ఇలా కీర్తించాడు:
అలపన్నిద్దఱు సురులందును సము
ద్యల్లీలగా పన్నవె
గ్గల ప్రందాపము బాపునా నిజమనః
కంజాతసంజాతపు
ష్కలమాధ్వీకఝరి న్మురారి నొగియం
గా జొక్కి ధన్యాత్ములౌ
నిలపన్నిద్దఱుసూరులందల తు
మోక్షేచ్ఛామతిందివ్య్రులన్.
రాయలు ఆముక్తమాల్యదను శ్రీకాకుళాంధ్రదేవుని ఆనతిమీద శ్రీవేంకటేశ్వరునికి అంకితమిచ్చాడు. అనేక ప్రబంధ రాజములను కృతిభర్తగా శ్రీకృష్ణదేవరాయలు లోకైకనాధుడు శ్రీవేంకటేశ్వరునికి ఈ క్రింది విధంగా ఆముక్తమాల్యదను సమర్పించాడు:
అంభోధికన్యకాకుచ
కుంభోంభితఘసృణమసృణ గురువక్షునకున్
జంభారిముఖాధ్యక్షున
కంభోజాక్షునకు సామిహర్యక్షునకున్.
Veturi tho Vamsi gnapakalu
An article on Molla Ramayanam -- రాసిన వారు: నిడదవోలు మాలతి
Download Molla Ramayanamu here : Molla Ramayanamu
“కుమ్మర మొల్ల”గా సుప్రసిద్ధురాలయిన కవయిత్రి మొల్ల జీవితంగురించి మనకి నిర్ధారణగా తెలిసింది స్వల్పం. ఆమెని గురించి చెప్పుకుంటున్న, ఋజువూ సాక్ష్యాలూ లేని కథలు చాలానే ఉన్నాయి. నిజానికి రాధికాస్వాంతనంముద్దుపళనిని తప్పిస్తే, పూర్వకవయిత్రులలో ఇంతటి ప్రాచుర్యం పొందిన స్త్రీలు లేరేమో. మొల్ల రామాయణం ఒక్కటే అందరికీ తెలిసిన ఆమెరచన. ఆమె ఇంకా ఏమైనా రచనలు చేసిందో, లేదో, అవి దొరుకుతాయో లేదో తెలీదు. కానీ తెలుగుకవయిత్రులలో మొల్ల తెలుగులు కాని పండితులదృష్టిని ఆకర్షించడం విశేషం. తొలిసారిగా నేను గమనించింది -మొల్ల రామాయణంలో 2400 శ్లోకాలు రాసిందని “మానుషి” అన్న ఇంగ్లీషు పత్రికలో చూసినప్పుడు. ఇప్పుడు ఆవాక్యం తొలగించబడింది. ఆతరవాత లలిత, తారూ రాసిన “Women writing” అన్న పుస్తకంలో కూడా శ్లోకాలనే వ్యవహరించేరు మొల్ల రామాయణంలో పద్యాలని. అప్పుడే నాకు మొల్లగురించిన ఆసక్తి మొదలయింది. ఇవి చదివినప్పుడు నాకు తోచిన మొదటి ఆలోచన శ్లోకం అన్నది సంస్కృత సాంప్రదాయవిశేషం. మొల్ల సంస్కృతాన్ని వదలి, జానుతెలుగులో రాయపూనుకున్న కవయిత్రి. ఆమె రచనని శ్లోకాలు అనడం ఆమెకి ఒక పాండిత్యస్థాయిని కల్పించడంకోసమేమో అనిపించింది. ఆరుద్ర మొల్ల రామాయణంలో ఉన్నవి 871 గద్యపద్యాలు అనీ, ప్రస్తుతం లభ్యమయిన ప్రతులు సమగ్రమయినవి కాకపోవచ్చు అనీ రాశారు (సమగ్రాంధ్ర సాహిత్యం, సం.2.). నాకు దొరికిన ప్రతిలో పద్యాలూ, వచనం ఒకే వరసలో లెక్కించి, మొత్తం ఆరుకాండలలో 880 ఉన్నట్టు చూపించారు. అందులో వచనంగా గుర్తించిన భాగాలు 208. అవి కొన్ని కేవలం ఒకటి రెండు మాటలు “అట్టి సమయంబున,” “అని మఱియును” లాటివి అయితే, కొన్ని దాదాపు ఒకపేజీ నిడివి ఉన్నాయి. మరో రెండు, మూడు చోట్ల గద్య అని కూడా ఉంది. దీనికి పీఠిక రాసినవారు (పరిష్కర్త కావచ్చు) క.కో.రా. అని ఉంది కానీ ఆయనెవరో నాకు తెలీదు. కోరాడ రామకృష్టయ్యగారేమో. రాసిన
మొల్లనిగురించి తెలిసింది చాలా తక్కువ అని మొదట్లో చెప్పేను. చదువుతున్నకొద్దీ, నాకు అబ్బురం అనిపించిన కొన్ని విషయాలు ముందు ప్రస్తావిస్తాను.
మొదటిది ఆమెపేరు, “కుమ్మర” మొల్లగా ప్రచారం కావడం. నేను చూసినంతవరకూ మరే ఇతర కవిని గానీ కవయిత్రిని గానీ కుల, వృత్తులపేరుమీదుగా ప్రస్తావించినట్టు కనిపించదు. ఆమె తనకు తానై ఎక్కడా తనపేరు “కుమ్మర మొల్ల” అని చెప్పుకోలేదు. మరి ఈ కుమ్మర అన్నపదం ఇంటిపేరుకి మారుగా ప్రాచుర్యంలోకి ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు.
పూర్వకవులు తమగ్రంథాదిని కులగోత్రాలు, వంశక్రమం చెప్పుకోడం సాంప్రదాయం. మొల్ల తాను రచించిన రామాయణానికి అవతారికలో “గురులింగజంగమార్చనపరుడు, శివభక్తరతుడు, బాంధవహితుడు” అయిన కేసయసెట్టి తనయనని చెప్పుకుంది. తండ్రినిగురించి రాస్తున్నప్పుడు కూడా కులప్రసక్తి కానీ వృత్తి ప్రసక్తి కానీ లేదు. అంచేత, ఈ కుమ్మర నామవిశేషణం ఆమెపేరుకి ముందు తగిలించడం, పరిష్కర్తలూ, ప్రచురణకర్తలూ చేసిన నిర్ణయంగానే కనిపిస్తోంది తప్ప మొల్ల అభిమతంగా తోచదు.
రెండవ అంశం “మొల్ల” అన్న పేరు ఆధారంగా పండితులు ఆమెవృత్తి లేక కులం నిర్ణయించ పూనుకోడం. ఈవిషయం ఆండ్ర శేషగిరిరావుగారు “ఆంధ్రవిదుషీమణులు” అన్న గ్రంథంలో విపులంగా చర్చించేరు. స్థూలంగా – మొల్లకనుపర్తి వరలక్ష్మమ్మగారు మొల్ల తన రామాయణంలో వేశ్యలగురించి ప్రస్తావించినతీరు చూస్తే, ఆమె వేశ్య కాదని స్పష్టంగా తెలుస్తుంటారు. శేషగిరిరావుగారు కూడా ఆమె కులటాంగన కాదనే నిర్ధారించేరు. మల్లియజాతికి చెందినపువ్వు. పూర్వకాలంలో పువ్వులపేర్లు వేశ్యలు మాత్రమే పెట్టుకునేవారుట. అంచేత ఆమె వేశ్య కావచ్చునని ఒక వాదన. ఈవాదనకి ప్రతిగా
మొల్ల కాలనిర్ణయం చేసినప్పుడు కూడా ఆమె రామాయణంలోని అవతారికే ఆధారమయింది. అందులో ఆమె గౌరవపురస్సరంగా పేర్కొన్న పూర్వకవులు ఆధారంగా ఆమె పదహారవ శతాబ్దం కృష్టదేవరాయలకాలంలో జీవించి ఉండవచ్చునని నిర్ణయించేరు. ఇక్కడ నాకు కలిగిన సందేహం – మొల్ల తన రామాయణంలో పేర్కొన్నకవులు గుర్తుగా వారి జీవితకాలం ఆధారంగా ఆమె కాలనిర్ణయం చేసేరు కానీ ఆమెతరవాత కవులు ఎవరైనా ఆమెని పేర్కొన్నారో లేదో వివరించలేదు. నేను సాహిత్యమంతా తరిచి చూడలేదు కానీ పైన పేర్కొన్న పండితులు పేరెన్నిక గన్నవారే. వారి వ్యాసాలలో ఈ ప్రస్తావన లేదు. శేషగిరిరావుగారు ఏదో ఒక ఉదాహరణ చెప్పేరు కానీ మళ్లీ అది మొల్లగురించి కాదేమోనన్న సందేహం కూడా వెలిబుచ్చారు. మరి మొల్లని ఆమెకాలంలోనూ, ఆ తరవాతా ఎవరైనా ఆమెను రామాయణకర్త్రిగా గుర్తించి ప్రశంసించేరా లేదా, ఈ విషయంలో పరిశోధన ఏమైనా జరిగిందా లేదా అన్నది తెలిసినవారెవరైనా చెప్పాలి.
విద్య మాటకొస్తే, తాను అట్టే చదువుకోలేదని ఆమె వినయంగా చెప్పుకున్నా, ఆమెరచనలో చమత్కారాలూ, పాండిత్యప్రకర్షా, పూర్వకవుల గ్రంథాల్లో భాషగురించి ఆమె చేసిన వ్యాఖ్యానాలు చూస్తే, ఆమె విస్తృతంగా కావ్యాలూ, ప్రబంధాలూ చదువుకున్నట్టే కనిపిస్తుంది. ఉదాహరణకి, అవతారికలో ఈ పద్యం చూడండి.
తాను అలా “కావ్యసంపదక్రియల” జోలికి పోనని చెప్పి, పదం చూడగానే పాఠకుడికి అర్థం తోచని భాషలో రాస్తే అది మూగ, చెవిటివారు ముచ్చటలాడినట్టే ఉంటుందంటూ హాస్యమాడుతుంది..
తెలుగుదనం ఉట్టిపడే పదకేళి “రాముడు గీముడుంచు”, “విల్లా ఇది కొండా”, “సందుగొందులు దూరిరి” లాటివి ఉన్నాయి. సాయంశోభని వివరిస్తూ చెప్పినపద్యాలలో మచ్చుకి ఒకటి -
పాఠకులమనసుని అలరించే చమత్కారాలూ (కందువలు) సామెతలూ కూర్చి అందంగా చెప్తే వీనులవిందుగా ఉంటుంది అంటుంది మొల్ల.
ఆండ్ర శేషగిరిరావు, ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ, కనుపర్తి వరలక్ష్మమ్మవంటి అనేక ప్రముఖులు మొల్ల తన రామాయణాన్ని జానుతెనుగులో, సులభశైలిలో సకలజనులకూ అర్థమయేరీతిలో రాసింది అని మెచ్చుకున్నారు. మొల్ల కూడా అలాగే తన రామాయణం “మూగ చెవిటి ముచ్చట” కాకుండా ఉండేలా రాయదల్చుకున్నట్టు చెప్పుకుంది. ఆమెరచనలో చవులుఁ బుట్టు జాతీయాలు కోకొల్లలుగానే ఉన్నా, సంస్కృత సమాసాలు, ముఖ్యంగా యుద్ధవర్ణనలో, నాయకీ, నాయకుల వర్ణనలలో క్లిష్ట భూయిష్టమయిన సంస్కృతసమాసాలు చాలానే కనిపించేయి. నేను చాలాచోట్ల తడుముకోవలసివచ్చింది అర్థంకోసం. “జాను తెనుగు,” “వాడుకభాష” లాటి పదాలకి ఆనాడు ఉన్న అర్థాలు ఈనాడు అన్వయించుకోలేం అనుకోవాలి.
మూలరామాయణంలో లేని కొన్ని సన్నివేశాలు మొల్ల స్వతంత్రించి ఇతర రామాయణాలనుండి స్వీకరించడం జరిగింది. అయోధ్యకాండలో రాముడు స్వర్ణనది దాటేముందు గుహుడు ఆయనపాదాలు కడగడం వాటిలో ఒకటి.
సుడిగొని రాముపాదములు సోఁకి ధూళివహించి ఱాయెయే
యేర్పడ నొక కాంతనయ్యెనఁట పన్నుగనీతని పాదరేణువి
య్యడవడి నోడసోఁకనిదియేమగునో యని సంశయాత్ముఁడై
కడిగెగుహుండు రాముపదకంజయుగంబు భయమ్ముపెంపునన్.
ఈ సన్నివేశం వాల్మీకిరామాయణంలో లేదు కానీ అధ్యాత్మరామాయణంలో ఉందని ఆరుద్ర అంటున్నారు. అలాగే మరో సన్నివేశం – పరశురాముడు రాముడిని ఎదుర్కొని కయ్యానికి కాలు దువ్వడం కూడా వ్యాస రామాయణంలో లేదనీ, భాస్కరరామాయణంనుండి తీసుకున్నదనీ అంటున్నారాయన. వీటివల్ల మొల్ల విస్తృతంగా తెలుగు, సంస్కృతగ్రంథాలు చదివిందనే అనుకోవాలి. ఈ గుహుడికథ చిన్నప్పడు నాలుగోక్లాసు, ఐదోక్లాసు వాచకాల్లో ఉండేది. ఈ కథ అంత ప్రాచుర్యం పొందడానికి మొల్ల రామాయణమే కారణం కావచ్చు.
*******************************************************
నన్ను ఆకట్టుకున్న మరో రచనావైచిత్రి ఆమె మాటలతో ఆడుకున్నట్టు కనిపించే సమయాలు. నిత్యజీవితంలో మనం మాటాడుకునేతీరు కనిపిస్తుంది ఆమె రచనలో. ఒకొకప్పుడు మనం చెప్పదల్చుకున్నది స్పష్టం చెయ్యడానికి “అది కాదు ఇది” అంటూ సాగదీస్తాం. బాలకాండంలో సాకేతపురం ఎలా ఉందో చెప్తూ ఆమె చేసిన వర్ణన చూడండి.
మదనాగయూధసమగ్రదేశము గాని
కుటిలవర్తనశేషకులము గాదు.
ఆహవోర్వీజయహరినివాసము గాని
కీశసముత్కరాంకితము గాదు
సుందరస్యందనమందిరంబగు గాని
సంతతమంజులాశ్రయము గాదు
మోహనగణికాసమూహగేయము గాని
యూధికానికరసంయుతము గాదు
సరససత్పుణ్యజననివాసము గాని
కఠిననిర్దయదైత్యసంఘము గాదు
కాదు కాదని కొనియాడఁ దగినట్టి
పురవరాగ్రమ్ము సాకేతపురవరమ్ము.
“కాదు, కాదం”టూ, ఏది అవునో వివరిస్తున్నానని తానే చెప్పడంలో ఆమె గడుసుదనం చూడగలం. ముందు చెప్పేను ఆమె కవిత్వంలో సంస్కృతసమాసాలు విశేషంగా ఉన్నాయని. అది కూడా పైపద్యంలో గమనించవచ్చు.
అలాగే ఒకే పదాన్ని రెండుసార్లు చెప్తూ కవితలల్లడంలో సొగసు చూడండి. అరణ్యకాండలో సీతని వెతుకుతూ రాముడు తిరుగుతున్న ఘట్టం -
ఏమృగంబును గన్నఁ నేణాక్షి గానవే
యని పెక్కుభంగుల నడిగి యడిగి
ఏపక్షిఁ గనుగొన్న నెలనాగ గానవే
యని పెక్కుభంగుల నడిగి యడిగి
… … …
సీత గానఁబడమి శ్రీరామచంద్రుండు
విరహతాపవహ్ని వేఁగి వేఁగి
అంటూ సీతకోసం ఆయన అనుభవించిన వేదనని పాఠకులమనసుకి గట్టిగా తగిలేలా చెప్తుంది మొల్ల. ఈ ప్రయోగం యుద్ధకాండలో నిశేషించి ఇతోధికంగా భావసమన్వితమవుతుంది. మూడు ఆశ్వాసాలలో ఆమె చేసిన యుద్ధవర్ణన చదువుతుంటే స్వయంగా యుద్ధం చూసైనా ఉండాలి, లేదా యుద్ధానికి సంబంధించిన గ్రంథాలు విశేషంగా చదివి అయినా ఉండాలి అనిపించకమానదు.
మొల్ల పదాలు వాడుకోడంలో పొదుపరి, ఆమెకి ఆమెయే సాటి అంటూ మలయవాసిని, ఆరుద్ర సుందరకాండలో రామలక్ష్మణులని వర్ణించమని సీత హనుమంతుని అడిగిన సందర్భం ఉదహరిస్తున్నారు. హనుమంతుడు నిజంగా రాముని పంపున వచ్చినవాడవునో, ఇది కూడా రాక్షసమాయేనేమో నన్న సందేహంతో సీత వారిని వర్ణించమంటుంది. అప్పుడు హనుమంతుడు అంటాడు.
సీ. నీలమేఘచ్ఛాయఁ బోలు దేహము వాఁడు
ధవళాబ్దపత్రనేత్రములవాఁడు
కంబుసన్నిభమైన కంఠంబు గలవాఁడు
బాగైనయట్టి గుల్భములవాఁడు
…. … ….
అని రాముని వర్ణించి, లక్ష్మణుని,
ఇన్నిగుణముల రూపింప నెసఁగువాఁడు
వరుస సౌమిత్రి బంగారు వన్నెవాఁడు.
అంటాడు. లక్ష్మణుడిని గురించి మళ్లీ వేరే చెప్పక్కర్లేదు. ఆయనకి కూడా ఈవర్ణనంతా సరిపోతుంది, రంగు మాత్రమే వేరు అని. పైన చెప్పినట్టు ఈపద్యం కూడా నేను చిన్నప్పుడే విన్నాను కానీ ఇది మొల్లవిరచితమని ఇప్పుడే తెలిసింది!
పూర్వకవులు మొల్ల పాండిత్యాన్ని స్పృశించినట్టు కనిపించదు కానీ ఆధునికకాలంలో పండితులు కొందరైనా ఆమె కవిత్వాన్ని తమ వ్యాసాల్లో చర్చించారు.
దివాకర్ల వెంకటావధానిగారు, “తానంత విద్యాసంపన్నురాలు కాదని చెప్పుకొన్నా ఈమె కావ్యమున పాండిత్యలోపమెచ్చటను కానిపింపదు. ఈమె వర్ణనలన్నియు ప్రబంధోచిములయి మిక్కిలి ప్రౌఢముగా నుండును. అందును సాకేతనగరవర్ణనము శ్లేష శబ్దాలంకారపూరితమై ఆమె పాండితీవిశేషమును పలు విధముల సూచించుచున్నది” అంటారు. “ఈమె శైలిని మృదుమధురపద గుంఫితమును, భావబంధురమునై సర్వజనరంజకముగా నుండును”, “ఔచిత్యపోషణలో కూడా అందె వేసిన చేయి” అని కూడా ప్రశంసించారు. (ఆంధ్ర వాఙ్మయచరిత్ర, పు 59-50).
అయితే ఈ ఔచిత్యపోషణవిషయంలో ఆండ్ర శేషగిరిరావుగారి అభిప్రాయం కాస్త భిన్నంగా కనిపిస్తుంది. ఆమె స్త్రీవర్ణనలోనే కాక ఇతర సందర్భాలలో కూడా స్త్రీల శరీరభాగాలు ఉపమించడంలో “పూర్వకవి సాంప్రదాయాన్ని పాటించుట విశేషము” అంటారు. శేషగిరిరావుగారు ఈవిషయాన్ని మూడు పేజీలనిడివిలో చర్చించడం నాకు విశేషంగా అనిపించింది!
నేను ఈవ్యాసం రాయడానికి ఉపక్రమించిన తరవాత, మొల్ల సినిమాగా కూడా వచ్చిందని సౌమ్య చెప్పింది. ఈసినిమా వచ్చేవేళకి అంటే 1970లో నేను ఇండియాలోనే ఉన్నాను. అప్పట్లో సినిమాలు బాగానే చూసేదాన్ని కూడా. అయినా ఎంచేతో ఇది మాత్రం నాదృష్టికి రాలేదు. ఇప్పుడు లైబ్రరీలో పుస్తకాలు చూస్తుంటే ఇంటూరి వెంకటేశ్వరరావు మొల్ల జీవితం ఆధారంగా రాసిన నవల, ఆ నవల ఆధారంగా సుంకర సత్యనారాయణ రాసిన బుర్రకథ కనిపించేయి. ఈ నవలవిషయంలో మహానటుడు చిత్తూరు నాగయ్య కథాగమనంవిషయంలో వెంకటేశ్వరరావుతో విబేధించేరని ఇద్దరూ తమ ముందుమాటలలో చెప్పుకున్నారు. ఆ అభిప్రాయబేధాలు ప్రత్యేకించి ఏవిషయంలోనో తెలీదు గానీ నాకు అభ్యంతరకరంగా అనిపించిన విషయాలు ప్రస్తావిస్తాను.
ప్రాక్తనకవులగురించి చదువుతున్నప్పుడు సహజంగానే ఆ కాలంలో ఆచారవ్యవహారాలగురించి కూడా తెలుసుకోగలుగుతాం అన్న ఆశ ఉంటుంది మనకి. సుప్రసిద్ధ కవులజీవితాలకీ, ఆనాటి సాంఘికపరిస్థితులకీ అవినాభావసంబంధం ఉంటుంది. మనఅవగాహన కూడా పరస్పరానుబంధంగానే ఉంటుంది. అంటే ఒకటి తెలిస్తే, రెండోది మరింత విపులంగా తెలుస్తుంది. అంచేతే ఏదో ఒక ఎజెండా పెట్టుకుని రచయితలు తమ ఇష్టం వచ్చినట్టు కల్పనలు చేస్తే, అది సాహిత్యానికి ద్రోహమే అవుతుంది. రచయితలో నిజాయితీ లోపించినట్టే అనిపిస్తుంది.
పలువురి ప్రశంసలు పొందిన ఒక సుప్రసిద్ధ కవయిత్రిని తీసుకుని నవల రాస్తున్నప్పుడు ఆ గౌరవం అలా నిలబెట్టేదిగా ఉండాలి రచన. అంతేకానీ తమ రాజకీయసిద్ధాంతాలు ప్రచారం చేసుకోడానికి ఆ పాత్రని తమ ఇష్టంవచ్చినట్టు మలచడం ఆపాత్రని అగౌరవపరచడమే అని నా అభిప్రాయం..
ఈనవలలో రచయిత మొల్ల చిన్నతనంలో అనాగరీకంగా, విసృంఖలంగా ప్రవర్తించినట్టు చిత్రించారు. ఆనాటి సాంఘికదురన్యాయాలు దుయ్యబట్టడం మొల్లద్వారా జరిగినట్టు చూపించడంకోసం అలా చిత్రించడం జరిగినట్టుంది. నిజానికి ఆనాటి సాంఘిక దురన్యాయాలు నిరసించడానికి మొల్ల వ్యక్తిత్వాన్ని వక్రీకరించనవసరం లేదనే నా అభిప్రాయం. సమర్థుడయిన రచయిత ప్రచారంలో ఉన్న వ్యక్తిత్వాలని యథాతథంగా వాడుకుంటూనే, కథని నడిపించగలడు. గలగాలి. అంతటి బలమైన మరొక పాత్రని సృష్టించలేక, మొల్లని వాడుకున్నట్టు అనిపించింది నాకు ఈనవల చదువుతుంటే. నాదృష్టిలో ఇది నవలారచనలో లోపమే.
రెండో అభ్యంతరం – అలా మొల్ల పట్టపగ్గాలు లేకుండా ప్రవర్తిస్తుండగా, ఒక దేవదాసి ఉద్బోధనతో జ్ఞానోదయమై, అడవులకు పోతుంది. అక్కడ ఒక సుందరాకారుడు కనిపించి మొల్లకి “ఆడదాని”లా ప్రవర్తించడం, సిగ్గు పడడంతో సహా, నేర్పి ఆమెని “నిజమైన ఆడదాన్ని” చేస్తాడు. ఇది కూడా నాకు అసంబద్ధంగానే అనిపించింది.
ఆమె రచించిన రామాయణంలో అవతారికలోనూ, చివర మంగళాశాసనంలోనూ కూడా తాను శ్రీగౌరీశవరప్రసాద లబ్ధననీ, గురుజంగమార్చనవినోద, సూరిజనవినుత, నిత్యశైవాచార సంపన్న, కవితాచమత్కారి అయిన ఆతుకూరి కేసనసెట్టి తనయననీ, మొల్ల నామధేయననీ చెప్పుకుంది. మహాభక్తుడూ, కవీ అయిన కేసనసెట్టి ఇంట పెరిగిన మొల్లని అదుపాజ్ఞలు లేక దుడుకుగా ప్రవర్తించిన అనాగరీకురాలుగా ఊహించడం సమర్థనీయంగా తోచడంలేదు నాకు. అంతేగాదు. ఆమె రచించిన గ్రంథంలో ఎనలేని పాండితీగరిమ ప్రదర్శించింది. అంతటి పాండిత్యం శ్రద్ధగా నిష్ఠతో ఎన్నో గ్రంథాలు చదివితే తప్ప రాదు. పరమ నిష్ఠాగరిష్ఠుడయిన తంఢ్రి శిక్షణలో ఆమె విద్యావతిగానే పెరిగినట్టు కనిపిస్తోంది.
సినిమావిషయం నాస్నేహితురాలు వైదేహికి చెప్తే, తను ఇంటర్నెట్‌లో ఉందని నాకు లింకు పంపింది. సినిమాగా బాగుంది. బహుశా మొల్ల పేరు పెట్టకుండా మరో బలమైన స్త్రీపాత్రని సృష్టించి తీసినా ఆ సినిమాకి లోపమేమీ ఉండేది కాదేమో.
మొల్ల రామాయణం పండితులనీ పామరులనీ కూడా విశేషంగా ఆకట్టుకుంది. కారణం ఆమె పాండిత్యమే కానీ ఆమె కుమ్మరి వంశజురాలు కావడం కాదు. ఆమెచుట్టూ అల్లినకథలు ఆ కావ్యాన్నే ఆధారం చేసుకుని, ఆ గౌరవాన్ని ఇనుమడించేలా చేయడమే సమంజసం.
మొల్లకి పూర్వం చాలామంది మగకవులు రామాయణాలు రాశారు కానీ మొల్ల రామాయణం మాత్రమే కాలగర్భంలో కలిసిపోకుండా నిలిచింది అన్నారు ఆరుద్ర సమగాంధ్ర. సాహిత్యం, 2వ సంపుటంలో. ఈ ఒక్కవాక్యం చాలు మొల్ల కవితాప్రౌఢిమ ఎంతటి పటిష్ఠమైనదో ఘనతరమైనదో చెప్పడానికి.

దేశీయపదములు దెనుగు సాంస్కృతుల్పైపద్యంలో వ్యాకరణ ఛందోరీతులు, దేశీయాలూ, సంధులు, శయ్యలు, సమాసములు, విభక్తులూ, భావ చమత్కృతులూ, వాటి క్రమం తెలియదంటూనే అంత చిట్టాఆవర్జాలు వల్లించడం ఏమీ తెలీనివారికి సాధ్యం కాదు కదా. అంతే కాదు, తాను సంస్కృతంలో ఉన్న వాల్మీకి రామాయణానికి తెలుగుసేత చేస్తూ, మళ్లీ అందులో సంస్కృత సమాసాలు వాడడం సముచితం కాదంటుంది.
సంధులు ప్రాజ్ఞుల శబ్దవితతి
శయ్యలు రీతులుఁ జాటు ప్రపంధము
లాయా సమాసంబులర్థములును
భావార్థములుఁ గావ్యపరిపాకములు రస
భావచమత్కృతుల్ పలుకుసరవి
బహువర్ణములును విభక్తులు ధాతు లం
లంకృతి చ్ఛంధోవిలక్షణములుఁ
గావ్యసంపదక్రియలు నిఘంటువులును
గ్రమములేవియు నెఱుఁగ విఖ్యాత
గోపవరపు శ్రీకంఠమల్లేశు వరముచేత
నెఱి కవిత్వంబు జెప్పఁగా నేర్చికొంటి.
తాను అలా “కావ్యసంపదక్రియల” జోలికి పోనని చెప్పి, పదం చూడగానే పాఠకుడికి అర్థం తోచని భాషలో రాస్తే అది మూగ, చెవిటివారు ముచ్చటలాడినట్టే ఉంటుందంటూ హాస్యమాడుతుంది..
తేనె సోఁక నోరు తీయన యగురీతినాలుకకి తేనె తగలగానే నోరు తీయన అయినట్టే పదానికి అర్థం చదువుతుండగానే పాఠకుడికి స్ఫురించాలి అని ఆమె అభిమతం!
తోడ నర్థమెల్లఁ దోఁచకుండ
గూఢశబ్దములను గూర్చిన కావ్యమ్ము
మూఁగచెవిటివారి ముచ్చట యగును.
తెలుగుదనం ఉట్టిపడే పదకేళి “రాముడు గీముడుంచు”, “విల్లా ఇది కొండా”, “సందుగొందులు దూరిరి” లాటివి ఉన్నాయి. సాయంశోభని వివరిస్తూ చెప్పినపద్యాలలో మచ్చుకి ఒకటి -
సాయంకాలపు నీరెండ, కమ్ముతున్న చీకటులతో కలిసి నీలాలూ, కెంపులూ అతికినట్టున్నాయిట ఆకాశంలో.
మేలిమి సంధ్యారాగము
వ్రాలిన చీకటియు గఁలిసి వరుణునివంకన్
నీలముఁ గెంపును నతికిన
పోలికఁ జూపట్టే నట నభోమణి తలగన్.
పాఠకులమనసుని అలరించే చమత్కారాలూ (కందువలు) సామెతలూ కూర్చి అందంగా చెప్తే వీనులవిందుగా ఉంటుంది అంటుంది మొల్ల.
కందువమాటలు సామెత
లందముగాఁ గూర్చి చెప్ప నది తెలుఁగునకుం
బొందై రుచియై వీనుల
విందై మరి కానుపించు విబుధులమదికిన్.
ఆండ్ర శేషగిరిరావు, ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ, కనుపర్తి వరలక్ష్మమ్మవంటి అనేక ప్రముఖులు మొల్ల తన రామాయణాన్ని జానుతెనుగులో, సులభశైలిలో సకలజనులకూ అర్థమయేరీతిలో రాసింది అని మెచ్చుకున్నారు. మొల్ల కూడా అలాగే తన రామాయణం “మూగ చెవిటి ముచ్చట” కాకుండా ఉండేలా రాయదల్చుకున్నట్టు చెప్పుకుంది. ఆమెరచనలో చవులుఁ బుట్టు జాతీయాలు కోకొల్లలుగానే ఉన్నా, సంస్కృత సమాసాలు, ముఖ్యంగా యుద్ధవర్ణనలో, నాయకీ, నాయకుల వర్ణనలలో క్లిష్ట భూయిష్టమయిన సంస్కృతసమాసాలు చాలానే కనిపించేయి. నేను చాలాచోట్ల తడుముకోవలసివచ్చింది అర్థంకోసం. “జాను తెనుగు,” “వాడుకభాష” లాటి పదాలకి ఆనాడు ఉన్న అర్థాలు ఈనాడు అన్వయించుకోలేం అనుకోవాలి.
మూలరామాయణంలో లేని కొన్ని సన్నివేశాలు మొల్ల స్వతంత్రించి ఇతర రామాయణాలనుండి స్వీకరించడం జరిగింది. అయోధ్యకాండలో రాముడు స్వర్ణనది దాటేముందు గుహుడు ఆయనపాదాలు కడగడం వాటిలో ఒకటి.
సుడిగొని రాముపాదములు సోఁకి ధూళివహించి ఱాయెయే
యేర్పడ నొక కాంతనయ్యెనఁట పన్నుగనీతని పాదరేణువి
య్యడవడి నోడసోఁకనిదియేమగునో యని సంశయాత్ముఁడై
కడిగెగుహుండు రాముపదకంజయుగంబు భయమ్ముపెంపునన్.
ఈ సన్నివేశం వాల్మీకిరామాయణంలో లేదు కానీ అధ్యాత్మరామాయణంలో ఉందని ఆరుద్ర అంటున్నారు. అలాగే మరో సన్నివేశం – పరశురాముడు రాముడిని ఎదుర్కొని కయ్యానికి కాలు దువ్వడం కూడా వ్యాస రామాయణంలో లేదనీ, భాస్కరరామాయణంనుండి తీసుకున్నదనీ అంటున్నారాయన. వీటివల్ల మొల్ల విస్తృతంగా తెలుగు, సంస్కృతగ్రంథాలు చదివిందనే అనుకోవాలి. ఈ గుహుడికథ చిన్నప్పడు నాలుగోక్లాసు, ఐదోక్లాసు వాచకాల్లో ఉండేది. ఈ కథ అంత ప్రాచుర్యం పొందడానికి మొల్ల రామాయణమే కారణం కావచ్చు.
*******************************************************
నన్ను ఆకట్టుకున్న మరో రచనావైచిత్రి ఆమె మాటలతో ఆడుకున్నట్టు కనిపించే సమయాలు. నిత్యజీవితంలో మనం మాటాడుకునేతీరు కనిపిస్తుంది ఆమె రచనలో. ఒకొకప్పుడు మనం చెప్పదల్చుకున్నది స్పష్టం చెయ్యడానికి “అది కాదు ఇది” అంటూ సాగదీస్తాం. బాలకాండంలో సాకేతపురం ఎలా ఉందో చెప్తూ ఆమె చేసిన వర్ణన చూడండి.
మదనాగయూధసమగ్రదేశము గాని
కుటిలవర్తనశేషకులము గాదు.
ఆహవోర్వీజయహరినివాసము గాని
కీశసముత్కరాంకితము గాదు
సుందరస్యందనమందిరంబగు గాని
సంతతమంజులాశ్రయము గాదు
మోహనగణికాసమూహగేయము గాని
యూధికానికరసంయుతము గాదు
సరససత్పుణ్యజననివాసము గాని
కఠిననిర్దయదైత్యసంఘము గాదు
కాదు కాదని కొనియాడఁ దగినట్టి
పురవరాగ్రమ్ము సాకేతపురవరమ్ము.
“కాదు, కాదం”టూ, ఏది అవునో వివరిస్తున్నానని తానే చెప్పడంలో ఆమె గడుసుదనం చూడగలం. ముందు చెప్పేను ఆమె కవిత్వంలో సంస్కృతసమాసాలు విశేషంగా ఉన్నాయని. అది కూడా పైపద్యంలో గమనించవచ్చు.
అలాగే ఒకే పదాన్ని రెండుసార్లు చెప్తూ కవితలల్లడంలో సొగసు చూడండి. అరణ్యకాండలో సీతని వెతుకుతూ రాముడు తిరుగుతున్న ఘట్టం -
ఏమృగంబును గన్నఁ నేణాక్షి గానవే
యని పెక్కుభంగుల నడిగి యడిగి
ఏపక్షిఁ గనుగొన్న నెలనాగ గానవే
యని పెక్కుభంగుల నడిగి యడిగి
… … …
సీత గానఁబడమి శ్రీరామచంద్రుండు
విరహతాపవహ్ని వేఁగి వేఁగి
అంటూ సీతకోసం ఆయన అనుభవించిన వేదనని పాఠకులమనసుకి గట్టిగా తగిలేలా చెప్తుంది మొల్ల. ఈ ప్రయోగం యుద్ధకాండలో నిశేషించి ఇతోధికంగా భావసమన్వితమవుతుంది. మూడు ఆశ్వాసాలలో ఆమె చేసిన యుద్ధవర్ణన చదువుతుంటే స్వయంగా యుద్ధం చూసైనా ఉండాలి, లేదా యుద్ధానికి సంబంధించిన గ్రంథాలు విశేషంగా చదివి అయినా ఉండాలి అనిపించకమానదు.
మొల్ల పదాలు వాడుకోడంలో పొదుపరి, ఆమెకి ఆమెయే సాటి అంటూ మలయవాసిని, ఆరుద్ర సుందరకాండలో రామలక్ష్మణులని వర్ణించమని సీత హనుమంతుని అడిగిన సందర్భం ఉదహరిస్తున్నారు. హనుమంతుడు నిజంగా రాముని పంపున వచ్చినవాడవునో, ఇది కూడా రాక్షసమాయేనేమో నన్న సందేహంతో సీత వారిని వర్ణించమంటుంది. అప్పుడు హనుమంతుడు అంటాడు.
సీ. నీలమేఘచ్ఛాయఁ బోలు దేహము వాఁడు
ధవళాబ్దపత్రనేత్రములవాఁడు
కంబుసన్నిభమైన కంఠంబు గలవాఁడు
బాగైనయట్టి గుల్భములవాఁడు
…. … ….
అని రాముని వర్ణించి, లక్ష్మణుని,
ఇన్నిగుణముల రూపింప నెసఁగువాఁడు
వరుస సౌమిత్రి బంగారు వన్నెవాఁడు.
అంటాడు. లక్ష్మణుడిని గురించి మళ్లీ వేరే చెప్పక్కర్లేదు. ఆయనకి కూడా ఈవర్ణనంతా సరిపోతుంది, రంగు మాత్రమే వేరు అని. పైన చెప్పినట్టు ఈపద్యం కూడా నేను చిన్నప్పుడే విన్నాను కానీ ఇది మొల్లవిరచితమని ఇప్పుడే తెలిసింది!
పూర్వకవులు మొల్ల పాండిత్యాన్ని స్పృశించినట్టు కనిపించదు కానీ ఆధునికకాలంలో పండితులు కొందరైనా ఆమె కవిత్వాన్ని తమ వ్యాసాల్లో చర్చించారు.
దివాకర్ల వెంకటావధానిగారు, “తానంత విద్యాసంపన్నురాలు కాదని చెప్పుకొన్నా ఈమె కావ్యమున పాండిత్యలోపమెచ్చటను కానిపింపదు. ఈమె వర్ణనలన్నియు ప్రబంధోచిములయి మిక్కిలి ప్రౌఢముగా నుండును. అందును సాకేతనగరవర్ణనము శ్లేష శబ్దాలంకారపూరితమై ఆమె పాండితీవిశేషమును పలు విధముల సూచించుచున్నది” అంటారు. “ఈమె శైలిని మృదుమధురపద గుంఫితమును, భావబంధురమునై సర్వజనరంజకముగా నుండును”, “ఔచిత్యపోషణలో కూడా అందె వేసిన చేయి” అని కూడా ప్రశంసించారు. (ఆంధ్ర వాఙ్మయచరిత్ర, పు 59-50).
అయితే ఈ ఔచిత్యపోషణవిషయంలో ఆండ్ర శేషగిరిరావుగారి అభిప్రాయం కాస్త భిన్నంగా కనిపిస్తుంది. ఆమె స్త్రీవర్ణనలోనే కాక ఇతర సందర్భాలలో కూడా స్త్రీల శరీరభాగాలు ఉపమించడంలో “పూర్వకవి సాంప్రదాయాన్ని పాటించుట విశేషము” అంటారు. శేషగిరిరావుగారు ఈవిషయాన్ని మూడు పేజీలనిడివిలో చర్చించడం నాకు విశేషంగా అనిపించింది!
నేను ఈవ్యాసం రాయడానికి ఉపక్రమించిన తరవాత, మొల్ల సినిమాగా కూడా వచ్చిందని సౌమ్య చెప్పింది. ఈసినిమా వచ్చేవేళకి అంటే 1970లో నేను ఇండియాలోనే ఉన్నాను. అప్పట్లో సినిమాలు బాగానే చూసేదాన్ని కూడా. అయినా ఎంచేతో ఇది మాత్రం నాదృష్టికి రాలేదు. ఇప్పుడు లైబ్రరీలో పుస్తకాలు చూస్తుంటే ఇంటూరి వెంకటేశ్వరరావు మొల్ల జీవితం ఆధారంగా రాసిన నవల, ఆ నవల ఆధారంగా సుంకర సత్యనారాయణ రాసిన బుర్రకథ కనిపించేయి. ఈ నవలవిషయంలో మహానటుడు చిత్తూరు నాగయ్య కథాగమనంవిషయంలో వెంకటేశ్వరరావుతో విబేధించేరని ఇద్దరూ తమ ముందుమాటలలో చెప్పుకున్నారు. ఆ అభిప్రాయబేధాలు ప్రత్యేకించి ఏవిషయంలోనో తెలీదు గానీ నాకు అభ్యంతరకరంగా అనిపించిన విషయాలు ప్రస్తావిస్తాను.
ప్రాక్తనకవులగురించి చదువుతున్నప్పుడు సహజంగానే ఆ కాలంలో ఆచారవ్యవహారాలగురించి కూడా తెలుసుకోగలుగుతాం అన్న ఆశ ఉంటుంది మనకి. సుప్రసిద్ధ కవులజీవితాలకీ, ఆనాటి సాంఘికపరిస్థితులకీ అవినాభావసంబంధం ఉంటుంది. మనఅవగాహన కూడా పరస్పరానుబంధంగానే ఉంటుంది. అంటే ఒకటి తెలిస్తే, రెండోది మరింత విపులంగా తెలుస్తుంది. అంచేతే ఏదో ఒక ఎజెండా పెట్టుకుని రచయితలు తమ ఇష్టం వచ్చినట్టు కల్పనలు చేస్తే, అది సాహిత్యానికి ద్రోహమే అవుతుంది. రచయితలో నిజాయితీ లోపించినట్టే అనిపిస్తుంది.
పలువురి ప్రశంసలు పొందిన ఒక సుప్రసిద్ధ కవయిత్రిని తీసుకుని నవల రాస్తున్నప్పుడు ఆ గౌరవం అలా నిలబెట్టేదిగా ఉండాలి రచన. అంతేకానీ తమ రాజకీయసిద్ధాంతాలు ప్రచారం చేసుకోడానికి ఆ పాత్రని తమ ఇష్టంవచ్చినట్టు మలచడం ఆపాత్రని అగౌరవపరచడమే అని నా అభిప్రాయం..
ఈనవలలో రచయిత మొల్ల చిన్నతనంలో అనాగరీకంగా, విసృంఖలంగా ప్రవర్తించినట్టు చిత్రించారు. ఆనాటి సాంఘికదురన్యాయాలు దుయ్యబట్టడం మొల్లద్వారా జరిగినట్టు చూపించడంకోసం అలా చిత్రించడం జరిగినట్టుంది. నిజానికి ఆనాటి సాంఘిక దురన్యాయాలు నిరసించడానికి మొల్ల వ్యక్తిత్వాన్ని వక్రీకరించనవసరం లేదనే నా అభిప్రాయం. సమర్థుడయిన రచయిత ప్రచారంలో ఉన్న వ్యక్తిత్వాలని యథాతథంగా వాడుకుంటూనే, కథని నడిపించగలడు. గలగాలి. అంతటి బలమైన మరొక పాత్రని సృష్టించలేక, మొల్లని వాడుకున్నట్టు అనిపించింది నాకు ఈనవల చదువుతుంటే. నాదృష్టిలో ఇది నవలారచనలో లోపమే.
రెండో అభ్యంతరం – అలా మొల్ల పట్టపగ్గాలు లేకుండా ప్రవర్తిస్తుండగా, ఒక దేవదాసి ఉద్బోధనతో జ్ఞానోదయమై, అడవులకు పోతుంది. అక్కడ ఒక సుందరాకారుడు కనిపించి మొల్లకి “ఆడదాని”లా ప్రవర్తించడం, సిగ్గు పడడంతో సహా, నేర్పి ఆమెని “నిజమైన ఆడదాన్ని” చేస్తాడు. ఇది కూడా నాకు అసంబద్ధంగానే అనిపించింది.
ఆమె రచించిన రామాయణంలో అవతారికలోనూ, చివర మంగళాశాసనంలోనూ కూడా తాను శ్రీగౌరీశవరప్రసాద లబ్ధననీ, గురుజంగమార్చనవినోద, సూరిజనవినుత, నిత్యశైవాచార సంపన్న, కవితాచమత్కారి అయిన ఆతుకూరి కేసనసెట్టి తనయననీ, మొల్ల నామధేయననీ చెప్పుకుంది. మహాభక్తుడూ, కవీ అయిన కేసనసెట్టి ఇంట పెరిగిన మొల్లని అదుపాజ్ఞలు లేక దుడుకుగా ప్రవర్తించిన అనాగరీకురాలుగా ఊహించడం సమర్థనీయంగా తోచడంలేదు నాకు. అంతేగాదు. ఆమె రచించిన గ్రంథంలో ఎనలేని పాండితీగరిమ ప్రదర్శించింది. అంతటి పాండిత్యం శ్రద్ధగా నిష్ఠతో ఎన్నో గ్రంథాలు చదివితే తప్ప రాదు. పరమ నిష్ఠాగరిష్ఠుడయిన తంఢ్రి శిక్షణలో ఆమె విద్యావతిగానే పెరిగినట్టు కనిపిస్తోంది.
సినిమావిషయం నాస్నేహితురాలు వైదేహికి చెప్తే, తను ఇంటర్నెట్‌లో ఉందని నాకు లింకు పంపింది. సినిమాగా బాగుంది. బహుశా మొల్ల పేరు పెట్టకుండా మరో బలమైన స్త్రీపాత్రని సృష్టించి తీసినా ఆ సినిమాకి లోపమేమీ ఉండేది కాదేమో.
మొల్ల రామాయణం పండితులనీ పామరులనీ కూడా విశేషంగా ఆకట్టుకుంది. కారణం ఆమె పాండిత్యమే కానీ ఆమె కుమ్మరి వంశజురాలు కావడం కాదు. ఆమెచుట్టూ అల్లినకథలు ఆ కావ్యాన్నే ఆధారం చేసుకుని, ఆ గౌరవాన్ని ఇనుమడించేలా చేయడమే సమంజసం.
మొల్లకి పూర్వం చాలామంది మగకవులు రామాయణాలు రాశారు కానీ మొల్ల రామాయణం మాత్రమే కాలగర్భంలో కలిసిపోకుండా నిలిచింది అన్నారు ఆరుద్ర సమగాంధ్ర. సాహిత్యం, 2వ సంపుటంలో. ఈ ఒక్కవాక్యం చాలు మొల్ల కవితాప్రౌఢిమ ఎంతటి పటిష్ఠమైనదో ఘనతరమైనదో చెప్పడానికి.
Telugu Vari Charitra by Daggubati Venkateswara Rao
Download Telugu vari Charitra by Dr. Daggubati Venkateswara Rao here: Telugu Vari Charitra
తెలుగు వెలుగులేవీ? -అద్దంకి శ్రీనివాస్
మాతృభాషాభిమానం నేడు తెలుగును అధ్యయనం చేసేవారికీ, బోధించేవారికే పరిమితమైపోయింది. అలా కాకుండా రాయప్రోలు సుబ్బారావు చెప్పినట్లు 'నాదు దేశము నాదు జాతి నాదు భాష' అనే అభిమానం ఉండా లి. తెలుగు మాతృభాషగా కల ప్రతి ఒక్కరికీ భాషాభిమా నం ఉండాలి. తోటి తెలుగువానితో తప్పనిసరిగా తెలుగులోనే మాట్లాడాలి.
తెలుగు పట్ల అభిమానం పిల్లల్లో ప్రాథమిక స్థాయి నుంచే అలవడేలా చేయాలి. భాషపై అభిమానం ఏర్పడితే పాఠ్యాంశాలలో తెలుగు లేకపోయినా స్వీయకృషితో తెలుగు భాషా సాహిత్యాలపై పట్టు సాధించగలుగుతారు.
ఇద్దరు తెలుగువాళ్ళు కలిస్తే ఆంగ్లంలో మాట్లాడుకుంటారని ఒక ఛలోక్తి ఉంది. ఇది మనకు మన భాష పట్ల గల నిర్లక్ష్య వైఖరిని తెలియజేస్తోంది.
అసలు ఏ భాష అయినా మొదట వాగ్రూపంలో ఉంటుంది. మాట్లాడే భాష నుంచి లిఖిత భాష ఏర్పడుతుంది. అలా ఏర్పడ్డ లిఖిత భాష ప్రభావం మౌఖిక భాషపై కూడా ఉంటుంది. ఈ రెండూ పరస్పరాశ్రితాలు. అలాగే మాట్లాడే భాషలో తెలుగుతనం తగ్గిపోతూ ఉండడం వల్ల క్రమంగా లిఖిత భాష కూడా ప్రభావితం అవుతుంది. అందువల్ల ముందు మౌఖిక భాషను సంరక్షించుకోవాలి. దీనికి స్పష్టమైన నిర్దిష్టమైన ఉచ్ఛారణను విధిగా అందరూ పాటించాలి.
ముఖ్యంగా భాషను ప్రాథమిక స్థాయిలో బోధించే అధ్యాపకుల నియామకంలో స్పష్టోచ్ఛారణకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రాథమిక విద్యా బోధకులలో భాషా పండితు లు ఉండడం లేదు. తెలుగును ప్రత్యేక పాఠ్యాంశంగా చదివినవారిని ప్రాథమిక స్థాయిలో అధ్యాపకులుగా నియమించాలి.
అలా నియమితులైన వారే పిల్లలకు మంచి భాషను చిన్నప్పటి నుంచీ నేర్పడమేకాక, భాషాభిమానా న్ని కలిగించేందుకు కీలకపాత్రను పోషిస్తారు. ప్రాంతీయ మాండలిక భాషా జ్ఞానం అందరికీ తప్పనిసరి.
ఈ జ్ఞానం తో పాటుగా ప్రామాణికాంధ్ర భాషాస్వరూపాన్ని స్పష్టం గా చిన్నప్పటినుంచీ పిల్లలకు తెలియజెప్పాలి. వివిధ మాండలికాలు వాటి వ్యాప్తి, శబ్ద సాధు-అసాధువులు, ఉచ్ఛారణ విషయంలో సందేహాలు పిల్లవాడి భాషా వినియోగానికి ప్రతిబంధకాలుగా తయారవుతాయి.
ఈ సందేహాలను నివారించడానికి చిన్ననాటి నుంచి ప్రామాణిక గ్రంథాలను పాఠ్యాంశాలుగా బోధించడమే శరణ్యం. రేడియో, టీవీ వంటి ప్రసార మాధ్యమాల ప్రభావం ప్రజలపై ఎంతగా ఉందో చెప్పనవసరం లేదు. కనుక సరైన ఉచ్ఛారణను అందించే భాషా నిపుణుల్ని రేడియో టీవీల లో నియమించాలి. సాధారణంగా పాత్రికేయ నైపుణ్యా లు ఉన్న వారినే వ్యాఖ్యాతలుగా నియమిస్తున్నారు. దీనివల్ల భాష దెబ్బతినే ప్రమాదం ఉంది.
ఒక్క మాటలో చెప్పాలంటే నేడు తెలుగుభాషకు దిక్కు పత్రికలే. పత్రికలు దోషరహిత ప్రయోగాలను చిత్తశుద్ధితో వాడితే వాటి వ్యాప్తి వేగంగా ఉంటుంది. భాషా పాండిత్యం లేని పాత్రికేయులు కొన్నికొన్ని అపప్రయోగాలను, దుష్టపదబంధాలను రూపొందించి భాషకు తీరని అన్యాయం చేస్తున్నారు. పద, వాక్యస్థాయి దోషాలపై 'నిఘా' యంత్రాంగం పటిష్టమైన తీరులో అన్ని పత్రికల కు పనిచేయాలి.
అలాగే తెలుగు భాషలో మృగ్యమైపోతు న్న పద ప్రయోగ వ్యాప్తిని పెంచాలంటే ముందుగా ఆంగ్ల భాషా వ్యవహారాన్ని సాధ్యమయినంత వరకు కట్టడి చేయాలి. ఇది చాలా కష్టమైన విషయం.
ఎందుకంటే ఆధునిక కాలంలో శాస్త్రసాంకేతిక రంగాలలోనూ విద్యా వాణిజ్యాది రంగాలలోనూ విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకొంటున్నాయి. ఈ మార్పు ప్రజల జీవనం, సంస్కృతి, భాషలపై ప్రధానంగా ప్రభావాన్ని చూపిస్తుం ది.
తెలుగు భాషా సంస్కృతులకు సంబంధంలేని కొత్తకొత్త కొలువులు ప్రవేశిస్తున్నాయి. దీంతో తెలుగు భాషలో ఆయా కొలువులకు చెందిన పారిభాషిక పదాలను ఆంగ్లం నుంచే స్వీకరించవలసిన అనివార్య స్థితి ఏర్పడుతోంది.
ఇది ఎప్పుడూ సమస్యే. సాంస్కృతికంగా సంస్కృత భాష, పాలనాపరంగా అరబిక్ భాష, శాస్త్రసాంకేతిక పరంగా ఇప్పుడు ఆంగ్ల భాష అసంఖ్యాక పదాలను తెలు గు భాషకు అందించాయి. ఈ ప్రభావం క్రమంగా నిత్య వ్యవహారానికి కూడా వ్యాపించి, వర్ణ, పద, వాక్య స్థాయిలలో తెలుగు వాడకం తగ్గిపోతోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే వ్యాకరణం తెలుగులో ఉంటుంది. పదాలన్నీ ఆంగ్ల భాషవే ఉంటాయి. దీనికి పరిష్కారం అన్య దేశాల కు బదులు స్వీయభాషలో పద నిర్మాణం జరగాలి.
అన్యదేశాలు వాడితే తప్పేం టి? ఇదొక ప్రశ్న. అన్య దేశ్యాలను వాడితే పద సంపద పెరిగి భాష విస్తృతమౌతుంది. మంచిదే. కానీ ఈ వాడుక తెలుగుభాషలోని ప్రాథమిక పదజాలాన్ని దెబ్బతీయకూడదు. వాక్యాలపై ఈ ప్రభా వం అధికంగా పడుతుంది. తద్వా రా తెలుగుభాషకు సహజం కాని వాక్యాలు తెలుగులో చోటు చేసుకొని గందరగోళం సృష్టిస్తాయి.
అలాగే మౌలికమైన తెలుగు క్రియ లు మరుగున పడిపోయి, వాటి స్థానంలో ఆంగ్ల క్రియలే వ్యాప్తిలోనికి వస్తున్నాయి. మౌలిక క్రియలు వ్యవహారంలోంచి జారిపోవడం పెద్ద ప్రమాదం. ఎందుకంటే అస లు భాషలోని పదాలన్నీ క్రియలనుంచే ఉద్భవిస్తాయనే వాదం ఒకటి ఉంది.
చాలా తెలుగు పదాలకు మూలాలు నేటికీ తెలియడం లేదు. ఈ విషయంపై నామవిజ్ఞాన శాస్త్రం కొంత కృషిచేస్తోంది. అసలు క్రియలే ఎవరికీ తెలియకపోతే భాషా, సాంస్కృతిక, సామాజిక మూలాలు తెలుసుకోవడం కుదరనిపని. అందువల్ల సాధ్యమయినంతవరకు నూతన పదాలను కల్పించాలి.
మొండిగా తెలుగువాడకూడదు. కృతకంగా ఉంటే అన్యదేశ్యాన్నే స్వీకరించాలి. భాషాపరిరక్షణ విధి వ్యక్తాకరణను బాధించేదిగా ఉండకూడదుకదా! ఇది ప్ర«ధాన భాషానియమం. ఉదాహరణకు తమిళులు ప్రాణవాయువును 'పిరాణ వాయు వు' అంటారు. ఇది తద్భవరూపం. అయినా దీనికి 'ఉయిర్‌కాట్రు' అనే ఆచ్ఛిక పద ం కల్పించారు.
ఆంగ్ల పారిభాషిక పదాలకు దీటుగా నూతన పద నిర్మాణం చేయవలసిన అవసరం ప్రధానంగా రెండు విధాలుగా కన్పిస్తుంది. ఒకటి సాంకేతిక తెలుగు భాషా వ్యవహారం. రెండు సాధారణ భాషా వ్యవహారం. సాంకేతిక పదాలను సృష్టించడానికి తత్సమ పదాలనే ఎక్కువగా వాడడం వ్యాప్తిలో ఉంది. ఇలా తయారు చేసిన వాటికంటే ఆంగ్ల పదాలే సులభంగా ఉంటాయనే విమర్శ కూడా ఉంది. శాస్త్రం ఎప్పుడూ బుద్ధిగ్రాహ్యమే. సులభం గా ఉండదు.
అందువల్ల క్లిష్టమైనా తప్పనిసరిగా తెలుగు పదాలనే వాడాలి. ఇవి స్వల్ప సంఖ్యాకులకే అర్థం కావ డం వల్ల ఇబ్బంది లేదు. ఇక సామాన్య జనుల వాగ్వ్యవహారం నుంచి భాషను రక్షించుకోవాలి.
దీని కోసమే పత్రికలు , మీడియా, మేధావులు, రచయితలు కృషి చేయాలి.
నిత్య వ్యవహారంలో బంధువు లపేర్లు, శరీరభాగాల పేర్లు, ఆహారాల పేర్లు , కూరగాయల పేర్లు, పప్పుదినుసుల పేర్లు... ఇలా చెప్పుకొంటూ పోతే నిరక్షరాస్యులు సైతం తెలుగుకు మారు గా ఆంగ్ల పదాలనే వాడుతున్నా రు. 'గ్యాస్ స్టవ్' రావడంతో కుం పటి, పొయ్య గొట్టం పదాలు వాడుకను కోల్పోయాయి. 'గ్యాసు పొయ్యి' పదం స్థిరపడిం ది.
దీనిని 'గాలికుంపటి' అని వ్యవహరించవచ్చు. పనిముట్ల వాడకం తగ్గిపోయింది. ఇళ్ళు, ఆటపాటలు, వైద్యం వంటి వాటిలో వచ్చిన మార్పుల వల్ల తెలుగు పదాల వాడుక కన్పించడం లేదు. 'షాపింగ్ మాల్స్' వచ్చాక అందులోని వస్తువులపై పేర్లుకూడా ఆంగ్లంలోనే ముద్రిస్తున్నారు.
ఈ దెబ్బకి నుడికార పు నాడి దొరకడం లేదు. ఇక భాష సంగతి వేరే చెప్పా లా?! జనవ్యవహారంలో సహజసిద్ధంగా పుట్టే పదాలను వాడుకలోనికి తేవాలి. విశాఖవాసులు 'డ్రెడ్జర్'ను 'తవ్వో డ' అని, సబ్ మెరైన్‌ను 'దొంగోడ' అనీ అంటారు.
ఇవి ఎంత సహజసిద్ధమైన పద కల్పనలో చూడండి. అలాగే లంచం తీసుకోవడం అనే మాటకు తెలుగులో 30కిపైగా నుడికారాలున్నాయి. ఇటువంటి వాటిని వెలుగులోనికి తేవాలి.
పత్రికలు కూడా తెలుగు అనువాదాలు కల ఆంగ్ల పదాలను త్యజించి తెలుగు పదాలనే విధిగా వాడాలి. అసెంబ్లీ-శాసనసభ; కోర్టు-న్యాయస్థానం; ఆర్గానిక్ ఫార్మింగ్- సేంద్రియ వ్యవసాయం; వాటర్ షెడ్స్-వాలుగట్లు; చెక్ డ్యాం-వరదకట్ట మొదలయిన సమానార్థక పద సృష్టిపై తెలుగులో పత్రికలు మొదట బాగా కృషి చేశాయి. కొన్ని మార్గనిర్దేశక సూత్రాలనుకూడా ఏర్పరచుకున్నాయి. అనవసరంగా ఆంగ్ల పదాన్ని వాడకూడదు.
ముఖ్యంగా శీర్షికలలో ఇంగ్లీషు మాటల్ని త్యజించాలి. ఆంగ్ల పదాలకు సమానానార్థకాలను వాడడానికి కొన్ని సూచనలు కూడా పూర్వ పాత్రికేయులు చేశారు.
అవి: ఉన్న మాటలనే పరిమితార్థంలో వాడటం; ఉన్న మాటకు కొత్త అర్థాలు కల్పించటం; కొత్త పదాల సృష్టి; భాషానువాదం; యథానువాదం. అర్థబోధక శక్తి ఉన్న రూపాలు వ్యాకరణ విరుద్ధాలయినా వాడటమే మంచిది. సరళీకర ణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, గ్లోబలీకరణ మొదలయినవి ఇందుకు ఉదాహరణలు.
నూతన పద నిర్మాణం కోసం తమిళులు చేసే కృషి మనకు ఆదర్శం కావాలి. నేటికీ ఆంగ్ల పత్రికలలో వచ్చే పారిభాషిక పదాలకు సమానార్థకాలను కల్పించి ఎప్పటికప్పుడు ఆకాశవాణి ద్వారా ప్రసారం చేస్తున్నారు. అలాగే హిందీ, కన్నడ భాషా పత్రికలు ఇంగ్లీషు భాషా వ్యవహారాన్ని పూర్తిగా తగ్గించాయి. వీరందరూ మనకి ఆదర్శం కావాలి.
బుద్ధికి పదునుపెడితే స్థిరంగా వ్యవహారానికి వచ్చే చక్కని పదాలను ఆంగ్ల పదాలకు మారుగా సృష్టించవచ్చు. కాశీనాథుని నాగేశ్వరరావు నైట్రోజన్‌కు నత్రజ ని, నికెల్‌కు నిఖిలము, ఆక్సిజన్‌కు ప్రాణవాయువు, ఫోటోసింథసిస్‌కు కిరణజన్య సంయోగక్రియ వంటి పదా లు సృష్టించారు.
ఇవి ఎంతగా ప్రసిద్ధి పొందాయో చెప్పనక్కర్లేదు కదా. భాష ఎప్పటికప్పుడు పరిష్కరణలు చేసుకోవడం వల్లనే విస్తృతమౌతుంది. ఆంగ్ల వ్యాప్తికి కారణం కూడా ఇదే. ఈ పరిష్కరణ ప్రక్రియ తెలుగు భాషకు అత్యంతావశ్యకం. పరిశోధనాత్మక అధ్యయనం ద్వారా పరిష్కరణ పదస్థాయిలోనూ, వాక్యస్థాయిలోనూ జరగా లి. నూతన పదనిర్మాణం ద్వారా తెలుగు భాషా వినియోగాన్ని పెంచడానికి ఒక్క ప్రయత్నలోపం తప్ప వేరేమీ కన్పించదు.
నిత్య వ్యవహారంలోనూ తెలుగును విస్మరించకూడదని, విద్యాబోధనలోనూ, అభ్యాసంలోనూ తెలు గు ప్రత్యేక పాఠ్యాంశంగా ఉండాలని, ప్రతి తెలుగు వాడూ భావించాలి. దీనికోసం భాషా సంఘాలు, సాహి తీ సంస్థలు, కవులు, రచయితలు స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ కృషిచేయాలి. వివిధ చైతన్య సభల ద్వారా తెలుగు వైభవాన్ని చాటి చెప్పాలి. దీనికి ప్రభుత్వం కూడా తప్పనిసరిగా బాధ్యతగా స్వీకరించాలి. అప్పుడే తెలుగు దివ్వె ప్రతి ఇంటా దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది.
-అద్దంకి శ్రీనివాస్
(వ్యాసకర్త హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యాపకులు)
నేడు తెలుగు భాషాదినోత్సవం
ఎన్.జి.ఓ లేదా గుమాస్తా - ఆచార్య ఆత్రేయ (N.G.O play by Acharya Atreya)
ఈ మధ్యన నేను చదివిన
పుస్తకం ఆత్రేయ గారు రాసిన ఎన్జీఓ అనే నాటకం. ఆత్రేయ..ఈ పేరు వినని
తెలుగువాడు ఉండడనుకుంటా! ఆత్రేయ గురించి మనకు(నాకు!) తెలిసినంతవరకు ఏవో
సినిమా పాటలు రాసాడని.
నా మిత్రుడు ఒకడు ఈ నాటకం గురించి చెప్పడంతో చదవటం మొదలెట్టా. ఒక గంటలో పూర్తి చేశా. చాల బాగా రాసారు ఆత్రేయ గారు. ఈ నాటకం రాసింది 1948 లో. అప్పుడే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటి మధ్యతరగతి పరిస్థితులను చక్కగా ఈ నాటకంలో ప్రతిబింబింప చేసారు ఆత్రేయగారు. ఇంకా చెప్పాలంటే Hungry 30's లోని పరిస్థితులను మనం ఇందులో చూడవచ్చు.
ఆత్రేయ గారి మాటల్లో "ఎన్.జి.ఓ అనే పేరేగాని, మన మధ్యతరగతి కుటుంబాల - అందులో పట్నవాసుల అగచాట్లు, మనస్తత్వం, ప్రెస్టేజి పేరుతో పడుతూన్న ఆర్థిక సాంఘిక బాధలు చిత్రించటానికి ప్రయత్నించాను. ఏమాత్రం సఫలుణ్ణి కాగలిగానో ప్రజా బాహుళ్యమే నిర్ణయించాలి". ఆత్రేయ గారు! మీరు సఫలం ఏంటి...ఈ నాటకంతో ట్రెండ్సెట్టర్ అయ్యారు. కావాలంటే 1950 నుంచి మొన్న మొన్నటి దాక వచ్చిన సాంఘిక సినిమాలు చుస్తే అర్ధమైపోతుంది. మధ్యతరగతి మీద వచ్చిన ప్రతీ సినిమాలో ఎన్.జి.ఓ మార్కు స్పష్టంగా కనబడుతుంది.
ఇప్పుడు మనం చదివితే అంత గొప్పగా అనిపించదు ఈ నాటకం. ఎందుకంటే దీని ఆధారంగా వచ్చిన సినిమాలు, నవలలు, నాటికలు, కధలు మనం ఆల్రెడీ చాలా చూసే (చదివే) ఉంటాం కాబట్టి.
ఇక download చేసి చదవడం ప్రారంభించండి: ఎన్.జి.ఓ
ఇందులో పాత్రలు:
రంగనాథం - గుమాస్తా
గోపి - అతని తమ్ముడు (విప్లవ భావాలు కలవాడు)
ముసలాయన - అతని తండ్రి
గుప్త - అద్దెకొంప యజమాని
.
..
...
కాలం - స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత
స్థూలంగా ఈ నాటకం చెప్పాలంటే, మన కధానాయకుడైన రంగనాథం ఒక గుమస్తా. మధ్యతరగతి జీవి. అతని మాటల్లోనే చెప్పాలంటే ఇంటి ముందున్న గుడిసెలను చూసి వారి కన్నా తన స్థాయి బాగుందని తృప్తి పడలేదు. అలాగే పక్కనున్న కోటీశ్వరుడి బంగ్లా చూసి అసూయ పడకుండా ఉండలేడు. లేని పోని భేషజాలకు పోయి అనవసరమైన కష్టాలు కొని తెచ్చుకుంటారు వీరు. ఇక గోపి రంగనాథం తమ్ముడు. విప్లవ భావాలు కల్గినవాడు. చిన్న వయసులోనే జీవితం పట్ల విరక్తి కలిగినవాడు. రంగనాథం ఇంట్లో ప్రతి ఒక్కరు ఏదో ఒక రోగం తో బాధపడుతూఉంటారు. ఇన్ని కష్టాలు ఉన్నా ఎప్పుడూ లంచం తీసుకోడు రంగనాథం. చివరికి ఒకానొక పరిస్థితిలో అతనికి డబ్బులు అత్యవసరం అయినప్పుడు లంచం తీసుకుంటాడు. అప్పుడే గోపి ఒక బహిరంగ సభలో ఒక రాజకీయ నాయకుడు ఉపన్యాసం ఇస్తుంటే, అతన్ని నిలదీస్తాడు. చివరికి వీరిద్దరి పరిస్థితి ఏమయిందనేది నాటకం చదివితే తెలుస్తుంది.
Download NGO book here: NGO

బారిష్టర్ పార్వతీశం (నవల)
(వికీపీడియా నుండి)
మొక్కపాటి నరసింహశాస్త్రి సుప్రసిద్ధ తెలుగు హాస్య రచయిత. 1925 లో ప్రచురితమైన ఇతని బారిష్టర్ పార్వతీశం అన్న నవల తెలుగు హాస్య రచనలలో మరువలేని స్థానాన్ని పొందింది. .ఈ నవలలో ముఖ్య కథానాయకుడైన పార్వతీశం ఒక పల్లెటూరు నుండి బయలుదేరి ఇంగ్లండ్ వెళ్ళి న్యాయశాస్త్రం అభ్యసించి భారత దేశానికి తిరిగి వచ్చి న్యాయశాస్త్రాన్ని ప్రాక్టీసు చేసి మంచి పేరు సంపాందించి కథ చివరిభాగం లో స్వాతంత్ర్యోద్యమం లో పాల్గొంటాడు.ఈ నవల మూడు భాగాలుగా వెలువడింది.ఇందులో మొదటి భాగం అప్పటి నర్సాపురం ప్రాంతం యొక్క సామాజిక స్ధితిగతులను హాస్యరీతిలో తెలియచెప్పుతుంది. ఇది పార్వతీశం ఇంగ్లాండ్ ప్రయాణం, అతని అమాయకత్వం అయోమయం మొదలైనవాటితో వున్న గొప్ప హాస్య రచన.
బారిష్టర్ పార్వతీశం మొదటి భాగం
పార్వతీశం మొగల్తూరు నుండి బయలు దేరి నిడదవోలు మీదుగా చెన్నై వెళ్తాడు. అక్కడ నుండి ఓడ పట్టుకొని ఇంగ్లాడు చేరుతాడు.ఈ భాగం చాలా హాస్యంగా నడుస్తుంది. ముఖ్యంగా నిడదవోలు నుండి మద్రాసు వెళ్ళే రైలు ప్రయాణం చాలా హాస్యరసంగా చిత్ర్రించడం జరిగింది. మద్రాసు నుండి ఇంగ్లాండు వెళ్ళడానికి కావలసిన సరంజామా కొనుక్కొనే సన్నివేశాలు చాలా హాస్యవత్తరంగా ఉంటాయి. ఈ నవలను తెలుగు అకాడమీ పుస్తకాల్లో పదవ తరగతి తెలుగు ఉపవాచకముగా అందించారు.
బారిష్టర్ పార్వతీశం రెండవ భాగం
ఓడలో ఇంగ్లండ్ చేరు కొన్న పార్వతీశం ఓడలో చిక్కిన స్నేహితుడి వల్ల స్కాట్‌లాండ్ లో ఎడిన్‌బరా నగరంలో ఒక ఇంట్లో పేయింగ్ గెస్టు గా చేరుతాడు. ఒక లా కాలేజి లో చేరుతాడు. ఆంగ్లం కుడా రాని పార్వతీశం ఏకసంధాగ్రహి క్రింద అన్ని విషయాలు ఒక్కసారి చెప్పడం తో గ్రహించి అందరి మన్ననలు పొందుతాడు. ఒక స్నేహితురాలిని ఆసక్తికరమైన సన్నివేశం ద్వారా పొందుతాడు. హాస్యం పాళ్ళు ఈ భాగం లొ తగ్గినా ఈ భాగం రసవత్తరంగానే ఉంటుంది. ఈ భాగం చివరి అంకం లొ బారిష్టర్ పాసై ఇంటి ప్రయాణం పట్టుతాడు. తన స్నేహితురాలు వదిలి వెళ్ళే సన్నివేశాన్ని మొక్కపాటి నరసింహశాస్త్రి గారు చాలా చక్కగా చిత్రించారు.
బారిష్టర్ పార్వతీశం మూడవ భాగం
మూడవ భాగం ముఖ్యంగా ఇంటివచ్చాక తనని ఇంటి వారు ఏవిధంగా స్వీకరించారు అనే విషయాలు, అప్పటి సాంప్రదాయల ప్రకారం బయటి దేశం నుండి వచ్చిన వారు ఎదుర్కొనే సంఘటనలు చిత్రించారు. ఇంగ్లాండు నుండి వచ్చాక గ్రామంలో ఉన్నవారు అడిగే వివిధమైన విచిత్ర ప్రశ్నలు చాలా అసక్తికరంగా ఉంటాయి. తరువాత పెళ్ళి, న్యాయశాస్త్ర ప్రాక్టీసు, స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనడం, ప్రకాశం పంతులు గారిని కలవడం, తాను సంపాదించిన సంపదను స్వాతంత్ర్యోద్యమానికి ధార పోయడం, పలు మార్లు జైలుకి వెళ్ళడం అనే విషయాలు ఉంటాయి. హాస్యం పాళ్ళు ఈ భాగంలో మరింత తగ్గుతుంది.
"నా జీవిత యాత్ర" -- టంగుటూరి ప్రకాశం పంతులు ఆత్మకథ
Download Naa Jeevitha Yatra here: Naa Jeevitha Yatra
"నా జీవిత యాత్ర" ఇక్కడ డౌన్లోడ్ చేయండి: నా జీవిత యాత్ర
టంగుటూరి ప్రకాశం పంతులు (జ.ఆగష్టు 23, 1872 – మ.మే 20, 1957) సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు మరియు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి. నిరుపేద కుటుంబంలో పుట్టి, వారాలు చేసుకుంటూ చదువుకుని, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన ధీరోదాత్తుడు, టంగుటూరి ప్రకాశం పంతులు. 1940, 50లలోని ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం ఒకడు. ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణాయక పాత్ర పోషించాడు. మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకి కెదురుగా గుండెనుంచి ఆంధ్రకేసరి అని పేరు పొందినవాడు.
బాల్యం
టంగుటూరి ప్రకాశం 1872 ఆగష్టు 23 న ఇప్పటి ప్రకాశం జిల్లా కనపర్తి గ్రామంలో సుబ్బమ్మ, వెంకట నరసింహం దంపతులకు జన్మించాడు. ఆరుగురు పిల్లల్లో ప్రకాశం ఒకడు. అప్పటి గుంటూరు జిల్లాలోని టంగుటూరిలో వారి కుటుంబం వంశపారంపర్యంగా గ్రామ కరణం వృత్తి లో ఉండేవారు. ఆయన పదకొండోయేట తండ్రి మరణించడంతో, పిల్లలను తీసుకుని తల్లి ఒంగోలు చేరింది. ఒంగోలులో ఆమె భోజనశాల నడపవలసి వచ్చింది. ఆ రోజుల్లో ఇలాంటి వృత్తి చేసే వారిని సమాజం లో చాలా తేలికగా చూసేవారు. పూటకూళ్ళ వ్యాపారం చేసే తల్లి సంపాదన చాలక, ప్రకాశం ధనికుల ఇళ్ళల్లో వారాలకు కుదిరాడు. పిన్న వయసులోనే ప్రకాశం నాటకాలు వేసేవాడు. తెల్లగా అందంగా ఉండడంతో ఆడ, మగ రెండు వేషాలు కూడా వేసేవాడు. ఆటల్లో కూడా చాలా చురుగ్గా ఉండేవాడు. క్రికెట్ చాలా చక్కగా ఆడేవాడు. ఆ వయసులో అల్లరిగా తిరిగేవాడు.
చదువు
వల్లూరులో ప్రకాశం ప్రాథమిక విద్య సాగింది. అల్లరి చిల్లరి సావాసాల వల్లా, నాటకాల వ్యాపకం వల్లా, ప్రకాశానికి మెట్రిక్ పాస్ అవడం కష్టమయ్యింది. మిషను పాఠశాల ఉపాధ్యాయుడైన ఇమ్మానేని హనుమంతరావునాయుడు చలవతో ప్రకాశం ఫీజు లేకుండా ప్రీ మెట్రిక్ లో చదివాడు. నాయుడు రాజమండ్రికి నివాసం మారుస్తూ, ప్రకాశంను తనతో తీసుకువెళ్ళి, అక్కడ ఎఫ్.ఏ. లో చేర్పించాడు. తరువాత మద్రాసుకు పంపించి, న్యాయశాస్త్రం చదివించాడు. ప్రకాశం 1890లో తన అక్క కూతురైన హనుమాయమ్మను పెళ్ళి చేసుకున్నాడు. ఆ తరువాత కొద్దికాలంపాటు ఒంగోలులో న్యాయవాద వృత్తి చేసి, 1894లో మళ్ళీ రాజమండ్రి చేరాడు. వృత్తిలో బాగా పేరూ, పుష్కలంగా సంపదా సంపాదించాడు. తన 35వ ఏట రాజమండ్రి పురపాలక సంఘానికి అధ్యక్షుడయ్యాడు.
ఇంగ్లాండులో విద్యాభ్యాసం
అప్పట్లో ప్రకాశం సెకండ్ గ్రేడ్ ప్లీడరు కనుక పై స్థాయి కోర్టులలో వాదించడానికి అర్హత లేదు. బారిస్టర్‌లకు మాత్రమే ఆ అర్హత ఉండేది. ఒకమారు ప్రకాశం ప్రతిభ గమనించిన ఒక బారిస్టర్ ప్రకాశంను కూడా బారిస్టర్ అవమని ప్రోత్సహించాడు. ఆ సలహా నచ్చి ప్రకాశం 1904లో ఇంగ్లాండు వెళ్ళాడు. వెళ్ళే ముందు మహాత్మా గాంధీలాగానే మద్యం, మాంసం, పొగాకు ముట్టనని తల్లికి మాట ఇచ్చి ఒప్పించాడు. దీక్షగా చదివి బారిస్టర్ అయ్యాడు. అక్కడ భారతీయ సొసైటీలో చేరి దాదాభాయి నౌరోజీ బ్రిటీషు పార్లమెంటుకు ఎన్నిక కావడానికి ప్రచారంలో పాలు పంచుకొన్నాడు. ఈ సమయంలో ప్రకాశంకు జాతీయ భావాలు, సాంఘిక కార్యక్రమాలపై ఆసక్తి పెరిగాయి.
బారిష్టరుగా
1907లో, లండన్లో ప్రశంసాపత్రంతో బారిష్టరు కోర్సు పూర్తిచేసుకొని భారతదేశం తిరిగివచ్చాక, ప్రకాశం మద్రాసు హైకోర్టులో ప్రాక్టీసు ప్రారంభించాడు. అప్పట్లో మద్రాసులో ప్రసిద్ధి చెందిన బారిష్టరులందరూ ఆంగ్లేయులు లేదా తమిళులు. పేరుపొందిన తెలుగు బారిష్టరులలో ఈయనే ప్రప్రధముడు. ప్రకాశం పౌర మరియు నేర వాజ్యాలనన్నింటినీ చేపట్టేవాడు. ఈయన చేపట్టిన క్రిమినల్ కేసుల్లో ఆష్ హత్యకేసు ఒక ప్రసిద్ధిచెందిన కేసు. తిరునెల్వేలిలో కలెక్టరుగా పనిచేస్తున్న ఆష్, 1907లో కాల్చిచంపబడ్డాడు. ఈ సంఘటన బెంగాల్ కు చెందిన జాతీయవాద నేత బిపిన్ చంద్ర పాల్ ఆ ప్రాంతాన్ని పర్యటిస్తూ దేశభక్తిపై ఉత్తేజపూరితమైన ప్రసంగాలు చేస్తున్న సమయములో జరిగింది. ప్రకాశం ఈ హత్య కేసులో, ఒక ముద్దాయి తరఫున వాదించి ఆయనకు స్వల్పశిక్ష పడేటట్టు చేశాడు. ప్రకాశం, లా టైమ్స్ అనే న్యాయవాద పత్రిక కు కూడా సంపాదకత్వం వహించేవాడు. అదే సంవత్సరం బ్రిటీషు ప్రభుత్వం పాల్ ప్రసంగాలు రాజద్రోహాన్ని ఉసిగొల్పేవిగా, ఉద్రేకపూరితముగా ఉన్నవని భావించటం వలన, ఇతరులు ముందుకు రావటానికి భయపడే సమయంలో, ఈయన బిపిన్ చంద్ర పాల్ ఇచ్చిన ప్రసంగాలకు హాజరయ్యేవాడు. లక్నో ఒడంబడిక తర్వాత ప్రకాశం కాంగ్రెసు పార్టీ మీటింగులకు తరచుగా హాజరు కావటం ప్రారంభించి, 1921 అక్టోబరులో సత్యాగ్రహ ప్రతినపై సంతకం చేశాడు. 1921లో స్వాతంత్ర్య సమరంలో అడుగుపెట్టి వృత్తిని వదలిపెట్టేనాటికి, లక్షల్లో సంపాదించాడు. ఆ యావదాస్తినీ, దేశసేవకే ఖర్చు చేసాడు.
ప్రజాసేవలో
లాభదాయకమైన న్యాయవాద వృత్తిని వదిలి ఇంగ్లీషు, తెలుగు మరియు తమిళ భాషలలో ఏకకాలమున విడుదలవుతున్న స్వరాజ్య పత్రికకు సంపాదకత్వం చేపట్టాడు. ఈయన ఒక జాతీయ పాఠశాలతో పాటు ఒక ఖాదీ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా నడిపాడు. 1921 డిసెంబర్‌లో జరిగిన అహమ్మదాబాదు సదస్సులో కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనాడు. ఏదైనా అలజడి కానీ, కల్లోలం కానీ జరిగినప్పుడు ప్రజలను ఓదార్చేందుకు అక్కడ పర్యటించేవాడు. ఈయన అకాలీ సత్యాగ్రహమప్పుడు పంజాబ్ ప్రాంతంలో, హిందూ-ముస్లిం ఘర్షణలు తలెత్తినపుడు ముల్తాన్ లోనూ పర్యటించాడు. కేరళలో మోప్లా తిరుగుబాటు సమయములో బయటిప్రాంతాల వారిపై నిషేధం విధించినా లెక్కచేయకుండా ఆ ప్రాంతాన్ని పర్యటించి, పర్యవసానంగా ఊటీ లోని తన ఆస్థిని ప్రభుత్వానికి కోల్పోయాడు. 1922లో సహాయనిరాకరణోద్యమం సందర్భంగా గుంటూరులో 30,000 మంది స్వఛ్ఛందకులతో ఒక ప్రదర్శనను నిర్వహించాడు. 1926లో కేంద్ర శాసనసభకు కాంగ్రెసు పార్టీ అభ్యర్ధిగా ఎన్నికైనాడు. అక్కడ విఠ్ఠల్‌భాయి పటేల్, మదన్ మోహన్ మాలవ్యా, జిన్నా మరియు జి.డి.బిర్లా వంటి జాతీయ నాయకులు ప్రకాశం సహచరులు.
రాజకీయ జీవితం
1921లో ఆంధ్ర ప్రాంతీయ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1921 అక్టోబర్ 29 న స్వరాజ్య అనే దినపత్రికను ప్రారంభించాడు. కొద్ది కాలంలోనే, ఈ పత్రిక మంచి ఆదరణ చూరగొన్నది. దీని తెలుగు, తమిళ సంచికలకు ప్రజలు ఎగబడ్డారు. 1928లో మద్రాసులో సైమన్ కమిషను బహిష్కరణ ఉద్యమంలో పాల్గొని, తుపాకికి ఎదురు నిలిచి, కాల్చమని సవాలు చేసాడు. ఆయన ధైర్యసాహసాలకు మెచ్చి ఆంధ్ర ప్రజలు ఆయనకు ఆంధ్ర కేసరి అనే బిరుదునిచ్చి గౌరవించారు.
1937లో కాంగ్రెసు అధికారంలోకి వచ్చినపుడు, రాజాజీ మంత్రివర్గంలో ఆయన రెవిన్యూమంత్రి అయ్యాడు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు. 1946లో మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికై, 13 నెలలపాటు ఆ పదవిలో కొనసాగాడు. ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాడు. స్వంతపార్టీలోని అంతర్గత రాజకీయాలకు ఆయన ప్రభుత్వం బలయ్యాక, పార్టీ నుండి బయటకు వచ్చి, స్వంతంగా ప్రజాపార్టీని స్థాపించాడు.
ఆంధ్రకేసరి
సైమన్ కమీషను, భారత దేశాన్ని సందర్శించవచ్చినప్పుడు కాంగ్రెసు పార్టీ సైమన్, గోబాక్ (సైమన్, తిరిగివెళ్లు) అన్న నినాదముతో ఆ కమీషన్ను బహిష్కరించటానికి నిర్ణయించింది. కాంగ్రెసు పార్టీ ఈ కమీషనును బహిష్కరించటానికి అనేక కారణాలున్నాయి అయితే ఆ కమీషనులో ఒక్క భారతీయ ప్రతినిధి కూడా లేకపోవటం ప్రధానమైనది. కమీషన్ వెళ్లినచోటల్లా నల్లజెండాలతో నిరసన ప్రదర్శనలు స్వాగతం పలికాయి. 1928, మార్చి 2న కమీషన్ బొంబాయిలో అడుగుపెట్టినపుడు పోలీసులు మద్రాసు వంటి సున్నిత ప్రదేశాలలో నిరసన ప్రదర్శనలను అనుమతించలేదు. అయితే, ప్యారీస్ కార్నర్ వద్ద మద్రాసు హైకోర్టు సమీపములో మూక విపరీతముగా పెరిగిపోయినది. వాళ్లను చెల్లాచెదురు చేయటానికి పోలీసులు కాల్పులు జరిపారు. పార్థ సారథి అనే యువకుడు కాల్పులకు గురై అక్కడికక్కడే మరణించాడు. ఆ యువకుని మృతదేహాన్ని సమీపించిన వారెవరినైనా కాల్చుతామని పోలీసులు హెచ్చరించారు. దీనిపై కోపోద్రిక్తుడైన ప్రకాశం, తన చొక్కా చించి ధైర్యంగా రొమ్ము చూపించి, కాల్చమని సవాలు చేశాడు. పరిస్థితిని అర్ధం చేసుకున్న పోలీసులు ప్రకాశం మరియు ఇతర అనుచరులకు తోవనిచ్చారు. ఈ సంఘటన తర్వాత ప్రజలు ఈయనను "ఆంధ్ర కేసరి" అన్న బిరుదు తో గౌరవించారు.
1930లో కాంగ్రెసు పార్టీ తమ శాసనసభ్యులందరినీ రాజీనామా చేయమన్నప్పుడు ప్రకాశం కూడా రాజీనామా చేశాడు కానీ పార్టీ యొక్క ప్రత్యామ్నాయ ప్రణాళిక నచ్చక తిరిగి ఉప ఎన్నికలలో పోటీచేసి గెలిచాడు. మదన్ మోహన్ మాలవ్యా నేతృత్వములోని జాతీయ పార్టీలో చేరాడు. గాంధీ మరియు కాంగ్రెసు పార్టీ దండి యాత్రతో ఉప్పు సత్యాగ్రహము చెయ్యాలని నిర్ణయించిన తర్వాత జాతీయ పార్టీకి రాజీనామా చేసి, తనతో పాటు ఇతరులను కూడా రాజీనామా చేయటానికి ప్రోద్బలం చేశాడు. ప్రకాశం శాసనసభ్యునిగా కూడా రాజీనామా చేసి మద్రాసులో స్వయంగా ముందుండి ఉప్పు సత్యాగ్రహం నడిపించాడు. అదే సమయంలో ప్రభుత్వము పెద్ద మొత్తములో ధరావత్తు నగదు ఆపేక్షించటంతో స్వరాజ్య పత్రికను నిలిపివేయాల్సి వచ్చింది. 1931లో ఇర్విన్ ఒడంబడిక తర్వాత పత్రికను పునరుద్ధరించాడు. కానీ ధన సమస్యల వల్ల తిరిగి నిలిపివేశాడు. 1935లో మరలా దీన్ని పునరుద్ధరించటానికి విఫలయత్నాలు సాగాయి.
1937లో కాంగ్రెసు పార్టీ ప్రాంతీయ ఎన్నికలలో పోటీ చేసి ఇతర ప్రాంతాలతో పాటు మద్రాసు ప్రెసిడెన్సీలో కూడా ఆధిక్యత తెచ్చుకున్నది. ముఖ్యమంత్రి పదవికి అభ్యర్ధిగా ప్రకాశం ముందున్నప్పటికీ, క్రియాశీల రాజకీయాలకు తిరిగివచ్చిన రాజాజీ ముఖ్యమంత్రి అయ్యేందుకు అనువుగా, కాంగ్రెసు అధిష్టానవర్గం కోరిక మేరకు తప్పుకున్నాడు. రాజాజీ మంత్రివర్గములో ప్రకాశం రెవిన్యూ శాఖామంత్రిగా పనిచేశాడు. మంత్రిగా ఈయన చేసిన పనులలో ముఖ్యమైనది, బ్రిటీషు ప్రభుత్వము పాటించే జమిందారీ వ్యవస్థ వలన వ్యవసాయరంగములో జరుగుతున్న అవకతవకలను పరిశీలించటానికి ఒక విచారణా సంఘాన్ని ఏర్పాటు చేసి, దానికి అధ్యక్షత వహించటం. రెండవ ప్రపంచ యుద్ధం రావడంతో కాంగ్రెసు మంత్రివర్గాలు, యుద్ధంలో భారతదేశం పాల్గొనటం గురించి తమను సంప్రదించలేదని రాజీనామా చేశాయి. 1941లో యుద్ధ ప్రయత్నాలకు వ్యతిరేకముగా వ్యక్తిగత సత్యాగ్రహం చేసిన ప్రముఖ దక్షిణ భారతదేశ నాయకులలో ప్రకాశం ప్రధముడు.
1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు ప్రకాశంను అరెస్టు చేసి మూడు సంవత్సరాలు జైల్లో పెట్టారు. 1945 లో జైలునుండి విడుదలైన తర్వాత, ప్రజలకు చేరువకావటానికి దక్షిణ భారతదేశమంతా పర్యటించాడు. 1946లో కాంగ్రెసు పార్టీ తిరిగి మద్రాసు ప్రెసిడెన్సీలో పోటీచేసి గెలిచింది. ఈ తరుణంలో 1946 ఏప్రిల్ 30న ప్రకాశం మద్రాసుముఖ్యమంత్రిగా ఎన్నికైనాడు. ఈయనతో పాటు తమిళ నాయకుడైన కె.కామరాజ్, జాతీయ నాయకులైన గాంధీ మరియు నెహ్రూల అభ్యర్ధి అయిన రాజాజీ ముఖ్యమంత్రి అవటాన్ని వ్యతిరేకించారు. అయితే, పార్టీలోని వివిధ వర్గాల విభిన్న అభిమతాలకు అనుగుణంగా పనిచేయలేక ప్రకాశం ప్రభుత్వం కేవలం 11 నెలలే మనగలిగింది.
స్వాతంత్ర్యానంతరం
సామాన్య ప్రజల సంక్షేమార్ధమై ప్రకాశం, తన వ్యక్తిగత భద్రతను, జవహర్ లాల్ నెహ్రూ చేసిన హెచ్చరికలనూ,, లెక్కచేయకుండా 1948లో నిజాం పాలనలో ఉన్న హైదరాబాదు రాష్ట్రాన్ని సందర్శించాడు. నిజాం యొక్క సహాయసహకారాలతో సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న రజాకార్ల నాయకుడు ఖాసిం రిజ్వీని కలిసి, రిజ్వీ తన అదృష్టాన్ని చాలా దూరం లాగుతున్నాడని హెచ్చరిక చేశాడు. ఈ సందర్భంలో ప్రకాశం ధైర్యానికి మెచ్చుకోలుగా రజాకార్లు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు.
1952లో ప్రజాపార్టీని స్థాపించి అధికారములో ఉన్న కాంగ్రెసు పార్టీ మంత్రులందరూ ఎన్నికలలో ఓడిపోయేట్టు చేశాడు. అయితే ప్రజాపార్టీకి సొంతగా అధికారానికి వచ్చే మద్దతు చేకూరకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అయితే బలనిరూపణకు ముందే ఈ సంకీర్ణం కూలిపోయింది.
అంతలో 1952 డిసెంబర్లో పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనకై ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ మరణించటంతో ఉద్యమం తీవ్రతరమైంది. ఉద్యమ ఫలితంగా 1953 అక్టోబర్ 1 న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు దానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం నియమితుడయ్యాడు. ఆయన పాలనా కాలంలో ప్రముఖ సంఘటనలెన్నో జరిగాయి. రాష్ట్రావతరణ మొదటి వార్షికోత్సవాన 2000 మంది ఖైదీలకు క్షమాభిక్ష, తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం స్థాపన, సేద్యపు నీటి ప్రాజెక్టుల నిర్మాణం, విజయవాడ వద్ద కృష్ణా నది పై బారేజి నిర్మాణం వీటిలో ప్రముఖమైనవి. కమ్యూనిష్టులు ఈయన పాలనను వ్యతిరేకించటం, సోషలిస్టులు మద్దతు ఉపసంహరించటం వలన ముఖ్యమంత్రి అయిన 14 నెలలకే అవిశ్వాస తీర్మానంతో ఆయన ప్రభుత్వం కూలిపోయింది.
1955లో మధ్యంతర ఎన్నికలు నిర్వహించే సమయానికి ప్రకాశం క్రియాశీల రాజకీయాలనుండి విరమించుకున్నాడు. 1956, నవంబర్ 1న అప్పటి హైదరాబాదు రాష్ట్రంలోని తెలంగాణా ప్రాంతం, ఆంధ్ర రాష్ట్రంలో కలిసిపోయి ఆంధ్ర ప్రదేశ్ అవతరించింది. ప్రకాశం అనుయాయి అయిన నీలం సంజీవరెడ్డి సమైక్య రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయినాడు. రాజకీయాలనుండి వైదొలిగినా, ప్రకాశం చురుకుగా రాష్ట్రమంతటా పర్యటించినాడు. అలాంటి ఒక ఒంగోలు పర్యటనలో వడదెబ్బకు గురై, నీరసించి హైదరాబాదులో ఆసుపత్రిలో చేర్పించబడ్డాడు. అక్కడే ప్రకాశం 1957, మే 20న పరమపదించాడు.
ఆత్మకథ
ఆయన ఆత్మకథ "నా జీవిత యాత్ర"పేరిట నాలుగు భాగాల పుస్తకంగా విడుదల అయింది. ఇందులో మూడు భాగాలను ఆయన రాయగా, నాలుగో భాగం మాత్రం తెన్నేటి విశ్వనాథం వ్రాసాడు. దీనిలో స్వాతంత్రోద్యమ నాయకుల మనస్తత్వాలు అప్పటి ప్రజల స్థితిగతులు వివరించబడినవి. తెలుగు సమితి హైదరాబాదు ఆగష్టు 2006 లో ప్రచురించింది. ఈ పుస్తకం హిందీలోకి కూడా అనువదింపబడింది.
ప్రకాశం జిల్లా ఏర్పాటు
స్వాతంత్ర్య సమరయోధునిగా ప్రకాశం యొక్క ఉత్తరదాయిత్వం నేటికీ ఆంధ్ర దేశములో వెలుగొందుతూ ఉంటుంది. టంగుటూరి ప్రకాశం పంతులు జాతికి చేసిన సేవలకు గుర్తుగా 1972 డిసెంబర్ 5న ఒంగోలు జిల్లా పేరును ప్రకాశం జిల్లాగా మార్చారు. గుంటూరు జిల్లాలో మూడు తాలూకాలు (అద్దంకి, చీరాల, ఒంగోలు), నెల్లూరు జిల్లాలో నాలుగు తాలూకాలు (కందుకూరు, కనిగిరి, పొదిలి, దర్శి), కర్నూలు జిల్లాలో రెండు తాలూకాలు (మార్కాపురం, గిద్దలూరు) కలిపి ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేశారు.

'ఈనాడు' దినపత్రిక లో కొత్త తెలుగు పదాలు
internet -- అంతర్జాలం
cellphone -- సంచారవాణి
air hostess -- గగనసఖి
browser -- విహారిణి
gel -- జిగురు ద్రవం
wrong direction -- అపసవ్య దిశ
refund -- వాపసు చేయటం
contract workers -- ఒప్పంద కార్మికులు/ఉద్యోగులు
No frills -- శూన్య మొత్తం
Information Technology -- సమాచార సాంకేతిక విజ్ఞాన రంగం
outsource -- పొరుగు సేవ
lubricant -- కందెన
(Dinner) Menu -- విందు జాబితా
Mass copying -- మూక చూచిరాత
value added services -- విలువ జత చేరిన సేవలు
Non-convertible debentures -- మార్పిడికి వీలు లేని రుణ పత్రాలు
BPO (Business process outsourcing)
-- వ్యాపార పొరుగు సేవలు
Board -- నామసూచిక
fonts -- ఖతులు
మీరు కూడా ఇలాంటి పదాలు గమనిస్తే క్రింద comments లో చెప్పండి!