banner

Saturday, 1 December 2012

తెలుగు కవితలు

Sneham KavithaMaranam Kavitha
Sneham KavithaOpriya KavithaSwathi Muthyam Kavitha
Nee Duram Kavitha



Veedi Vilasam

ఆలోచించు మిత్రమా.. ఆత్మహత్యే శరణ్యమా..!!

ఓడిపోయిన క్షణం కాదు
ఈ జీవితం అంతం...
ఆ ఓటమే నీ
విజయానికి తొలి అంకం...
నిప్పు తాకనిదే
పసిడి మెరవదు
నీరు తాకనిదే
విత్తు మొలవదు...
ఓటముండనిదే
గెలుపూ ఉండదు...
సంకల్పం నీ బలమైతే
సహనం నీ గుణమైతే
నిలిచేనా నీ
ఎదుట పరాజయం...
చూపవోయి నీలోని
మృత్యుంజయం...
నిను గన్నోళ్ళ
దీవెనలు
నిను నమ్మిన
హృదయాలు
చేయూతనిచ్చే
నేస్తాలు
నీవెంట నడిచే
పాదాలు
నీ గెలుపు చూసే
నయనాలు
పంచభూతాలై
తోడుండగా
చావన్నదే మార్గమా...
నువు బలికావడం న్యాయమా...
అరచేతిలో పిచ్చి గీతల్ని చూసి
అవే నీ రాతలనుకుంటే ఎలా?!
అర నిమిషం ఆలోచిస్తే
తలరాత మారే దారే దొరకదా
ఆలోచించు మిత్రమా
ఆత్మహత్యే శరణ్యమా...

ఆలోచనలను అక్షరాలతో,
కట్టిపడేస్తే కవిత

ఊహకు రంగులు జోడిస్తే చిత్రం,
స్నెహానికి ప్రాణం పోస్తే నీ రూపం 

    
జాబిలి పంచే చెలిమికి కలువ రేకులు వికసిస్తాయని ............
సూర్యుడు పంచే చెలిమి వెంటే ప్రొద్దు తిరుగుడు పయనిస్తుందని .....
తెలిసిన వారే స్నేహితులంట .......
మనసు తెలిసిన వారే మన తోడంట.......
ఎన్ని ప్రేమలు తమ పవిత్రతను ప్రశ్నించుకున్నాయో .......
మోహపు జాడలు లేని ఈ స్నేహపు ప్రేమను చూసి ........
ఎన్ని బంధాలు తమ అనుబంధాన్ని శంకిచాయో.......
రక్తపు సంభందం లేని ఈ బంధాన్ని చూసి .......
ఎన్ని కాలాలు ఎంతగ కక్ష కట్టాయో........
ఊసు పోని కబుర్లు తమని కరిగించే సాధనాలని తెలుసుకొని ........
ఎన్ని లోకాలు ఎంతగా కుళ్ళు కున్నాయో ........
ఎదురయ్యే ప్రతి కస్ట నష్టాల భారం సగమైపోతుందని ..........
నీ ఆత్మను నీ మనసు నవ యవ్వనం సంతరించుకొనేలా చేస్తున్న
ఈ స్నేహం
యే జన్మ ఫలమో యే దేవుడి వరమో.........    

                               ప్రేమ
ప్రేమ వ్యవ(సాయం)హారం..........!!!!
ప్రేమ, పైరూ ఒకలాంటివే. "ముందు మనసనే భూమినిదున్నాలి.

స్నేహమనే విత్తనం వేయాలి. చిరునవ్వుల ఎరువులు జల్లాలి.

ఆప్యాయంతో వర్షంలా కురవాలి. అపార్థాల కలుపు తీయాలి.

కులమతం, రాజకీయం అనే చీడల నుండిరక్షించుకోవాలి.

అప్పుడుగానీ ప్రేమ అనే పైరుచేతికిరాదు.”

ప్రేమంటే హృదయాన్ని పారేసుకోవటం కాదు.

నువ్వు లేనప్పుడు నవ్వుని, నువ్వున్నప్పుడు                  కాలాన్నీ పారేసుకోవడం.

ప్రేమించటానికి హృదయం ఉండాలి. ప్రేమింపబడటానికి వ్యక్తిత్వం ఉండాలి.



ఇష్టం ప్రేమగా మారాలంటే దానికి గౌరవం తోడవ్వాలి.

కళ కన్న ప్రేమ గొప్పది. ప్రేమ కన్నా జీవితం గొప్పది.

ప్రేమ కోపాన్ని చంపుతుంది. చిరునవ్వుని పుట్టిస్తుంది.



ప్రేమించడం పాపం కాదు. ఎందుకంటే అది పెరిగేది కడుపులో కాదు, హృదయంలో...

ఈ ప్రపంచంలో ప్రేమకు కూడా ఏదో వ్యతిరేకత, అర్హత ఉండాలంటే ఇంత మంది ప్రేమించేవారు కాదు. ప్రేమించబడేవారు కాదు.



ఒకరి అందం, అర్హతల వల్ల మొదట ఆకర్షణ ఏర్పడి, వారి ప్రవర్తన వల్ల అది స్నేహంగా మారి వ్యక్తిత్వం వల్ల ప్రేమగా మారుతుంది.

ప్రేమ ఇంధ్రధనస్సు అయితే ఆ ఏడు రంగులూ - "ఆకర్షణ, అవగాహన, ఇష్టం, తాదాత్మ్సత, స్పర్శ, కామం, ఓదార్పు”

ప్రేమంటే సముద్రపు చెరో రెండు అంచుల చివర నిలబడ్డా, ఈ దరి నుంచి ఆ దరికి ప్రవహించే తరంగాల్లా ఒకరి స్మృతులు మరొకరికి చేరాలి.

ప్రేమ

నా ప్రేమకు అర్ధం లేదు
నీ తోడు లేకుంటే...
నా జీవిత గమనానికి గమ్యం లేదు
నీతో ఏడు అడుగులు వెయ్యకుంటే...

నా నిదురలో స్వప్నం లేదు
నీ ద్యాస లేకుంటే...
నా మనసుకు ఓదార్పు లేదు
నీ స్వరం వినపడకుంటే...

నా దేహనికి జీవం లేదు

నీ శ్వాస తోడవకుంటే...
నీకై ఎదురు చూస్తూ నీ....................!!!

అమ్మ

జన్మ ఏదైనా అమ్మ పేరు అమ్మే
అమ్మ లేకుంటే బొమ్మ చేయడు బ్రహ్మ
తల్లీ అంటేనే తల్లడిల్లేది అమ్మ
బాధ నీదైనా చేమ్మగిల్లేది అమ్మ
తన ప్రాణమే మరచి నీ ప్రాణమే కోరి
నీ ఉసురు పోసేది అమ్మ
తన పాలతో పెంచి మురిపాలనే పంచు
అనురాగ దైవమే అమ్మ
కని పెంచి కనిపించు
నీ పాలి దేవతే అమ్మ......... 

నీ కోసమే నిరీక్షణ


నీ కోసమే నిరీక్షణ
గడిచిన కాలాన్ని అడిగితే
నీ జ్ఞాపకాలు చూపింది
కారే ప్రతి కన్నీటి బొట్టుకీ
కారణం నువ్వే అంది
నిన్ను మరవాలి అన్న నా తపన
నన్ను నా ఆత్మని వేరు చేసింది
నన్ను వీడిన నా ఆత్మ
నీ కోసమే వెతుకుతోంది.
 

నీ నవ్వుల హరివిల్లు

నీ నవ్వుల హరివిల్లు
కురిపించెను చిరు జల్లు
నీ పెదవుల సరిగమలు
తిలకించెను నా కళ్ళు
నీ నల్లని కురులు
మెరిసే మేఘమల్లె త్రుళ్ళు
నీ నడకలోని హొయలు
దోచెను అందరి మనసులు
నీ రసరమ్య గానాలు
స్పృసించెను నా చెవులు
నీ సిరిమువ్వల ఘల్లు
తెరిపించెను గుండె గళ్ళు
నీ పరువపు పరవళ్ళు 
కవ్వించెను నా వొళ్ళు 
 

వాన చినుకు,ఓ ప్రియతమా ,నువ్వు -నేను

వాన చినుకున రాలిని సరిగమలు నా ప్రేమను తాకి,
నీ చెంత చేరివొరగా వింతున్న నీ చెవులను పులకరించి
నా హ్రుదయ రాగలు నీ పలకరింపు తో
నీ హ్రుదయన్ని స్పందిస్తే నా జన్మ తరిస్తుంది
ఓ ప్రియతమా
ఓ ప్రియతమా నీ కంటి చూపు చెబుతున్నది
నాకోసం నీవు ఎదురు చూస్తున్నావని
నీ కను రెప్పలు చేసే ప్రతి అలికిడినా కనులు చూసి తిలకిస్తుంది
నీ మువ్వల సవ్వది న మదిని తాకినా గుండె ఝల్లుమంతుంది
నువ్వు లేచిన మొదలేనాకు కలిగెను సుర్యొదయం .
నీ నడక తాకిడేనాకు వేచే చల్లని చిరుగాలి .
అ గాలిలోని వీన లా మొగే నీ తియ్యని మాటలు
నా హ్రుదయముకు చేరిను నీ ప్రేమ ఓలలు
ఇక ఆనందం తో కురిసెనుఆకాసం నుంచి భువికి అమ్రుథపు వాన జల్లులు,
నువ్వు -నేను
నువ్వు వెన్నెలవైతే... నేను చందమామను నౌతా...
నువ్వు వసంతం అయితే... నేను కొకిల నౌతా...
నువ్వు నవ్వితే ... నేను నీ చిరునవ్వు నౌతా...
నువ్వు బాధ పడినప్పుడు... నేను నీ కన్నీటి బొట్టు నౌతా..
నువ్వు నింగివైతే... నేను నేల నౌతా...
నువ్వు నక్షత్రానివి అయితే..నేను మెరుపు నౌతా...నువ్వు నేనైతే.... నేను నువ్వవుతా...మనప్రేమకు పూల బాట వేస్తా.................