banner

Monday, 29 October 2012

ఆంధ్ర ప్రదేశ్

District Map of Andhra Pradesh


District Map of Andhra Pradesh

Proposed Telangana State Map

Proposed Telangana State Map

ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్ర ప్రదేశ్
Map of India with the location of ఆంధ్ర ప్రదేశ్ highlighted.
రాజధాని
 - అక్షాంశరేఖాంశాలు
హైదరాబాదు
 - 17.22° ఉ 78.26° తూ
పెద్ద నగరముహైదరాబాదు
జనాభా (2011)
 - జనసాంద్రత
8,46,55,533 (5వది)
 - 308/చ.కి.మీ
విస్తీర్ణము
 - జిల్లాలు
275,068 చ.కి.మీ (4వది)
 - 23
సమయ ప్రాంతంIST (UTC +5:30)
అవతరణ
 - గవర్నరు
 - ముఖ్యమంత్రి
 - చట్టసభలు(సీట్లు)
నవంబర్ 1 ,1956
 - ఎక్కడు శ్రీనివాసన్ లక్ష్మీ నరసింహన్
 - నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
 - రెండు సభలు (294 + 90)
అధికార బాష (లు)తెలుగు
పొడిపదం (ISO)IN-AP
వెబ్‌సైటుwww.aponline.gov.in
Ap seal.jpg
Kumbham.jpg

ఆంధ్ర ప్రదేశ్ రాజముద్ర
ఆంధ్ర ప్రదేశ్భారతదేశంలోని ఒక రాష్ట్రం. దీనికి ఉత్తరాన మహారాష్ట్రఛత్తీస్‌గఢ్ఒరిస్సా రాష్ట్రాలు, తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన తమిళనాడురాష్ట్రం, పశ్చిమాన కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ భారతదేశంలో నాలుగవ అతి పెద్ద రాష్ట్రమై ఉత్తర, దక్షిణాలకు వారధిలా ఉన్నది. ఈ రాష్ట్రంలోని ముఖ్యమైన నదులు గోదావరికృష్ణ. ఆంధ్రప్రదేశ్ 12°37', 19°54' ఉత్తర అక్షాంశాల మధ్య, 76°46', 84°46' తూర్పు రేఖాంశాల మధ్య వ్యాపించి ఉంది. భారత ప్రామాణిక రేఖాంశమైన 82°30' తూర్పు రేఖాంశం రాష్ట్రంలోనికాకినాడ గుండా పోతుంది.
1956, నవంబర్ 1న అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలొని తెలంగాణ ప్రాంతాన్ని మరియు మద్రాస్ నుండి వేరుపడ్డ ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ అధికార భాష తెలుగు.హైదరాబాదు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని. దేశంలోనే ఐదవ పెద్ద నగరము. మేలైన సంస్కృతీ సాంప్రదాయాలు, ధీటైన చరిత్ర, పారిశ్రామికాభివృద్ధి, మరియు సాంకేతిక పరిజ్ఞానం సహజీవనం సాగించే విభిన్నమైన అతి కొద్ది నగరములలో హైదరాబాదు ఒకటి. గతిశీల నాయకత్వంతో రాష్ట్రం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఫార్మసూటికల్స్, బిజినెస్ మేనేజ్‌మెంట్, నిర్మాణము తదితర రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ, అపారమైన వ్యాపార అవకాశాలకు నెలవై ఉన్నది.

విషయ సూచిక

  [దాచు] 

ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర

Guntupalli Buddist site 8.JPG
ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
----------- కాలరేఖ -----------
చరిత్ర పూర్వ యుగముక్రీ.పూ.1500వరకు
పూర్వ యుగముక్రీ.పూ.1500-క్రీ.త.650
• మౌర్యులకు ముందుక్రీ.పూ.1500-క్రీ.పూ.322
• మౌర్యులు• క్రీ.పూ.322 - క్రీ.పూ. 184
• శాతవాహనులు• క్రీ.పూ.200 - క్రీ.త.200
• కళింగులు• క్రీ.పూ.180? - క్రీ.త.400?
• ఇక్ష్వాకులు• 210 - 300
• బృహత్పలాయనులు• 300 - 350
• అనందగోత్రులు• 295 - 620
• శాలంకాయనులు• 320 - 420
• విష్ణుకుండినులు• 375 - 555
• పల్లవులు• 400 - 550
పూర్వమధ్య యుగము650 - 1320
• మహాపల్లవులు
• రేనాటి చోడులు
• చాళుక్యులు
• రాష్ట్రకూటులు
• తూర్పు చాళుక్యులు• 624 - 1076
• పూర్వగాంగులు• 498 - 894
• చాళుక్య చోళులు• 980 - 1076
• కాకతీయులు• 1083 - 1323
• అర్వాచీన గాంగులు
ఉత్తరమధ్య యుగము1320 - 1565
• ముసునూరి నాయకులు• 1320 - 1368
• ఓఢ్ర గజపతులు• 1513
• రేచెర్ల పద్మనాయకులు• 1368 - 1461
• కొండవీటి రెడ్డి రాజులు• 1324 - 1424
• రాజమహేంద్రవరం రెడ్డి రాజులు• 1395 - 1447
• బహమనీ రాజ్యము
• విజయనగర సామ్రాజ్యము• 1336 - 1565
ఆధునిక యుగము1540 – 1956
• అరవీటి వంశము• 1572 - 1680
• కుతుబ్ షాహీ యుగము• 1518 - 1687
• నిజాము రాజ్యము• 1742-1948
• బ్రిటిషు రాజ్యము
• స్వాతంత్ర్యోద్యమము• 1800 - 1947
• ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు• 1912-1953
• హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు• 1948-1952
• ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ• 1953-1956
• ఆంధ్ర ప్రదేశ్ ఇటీవలి చరిత్ర• 1956-
తెలుగు సాహిత్యం
నన్నయకు ముందు
నన్నయ యుగము • శివకవి యుగము
తిక్కన యుగము • ఎఱ్ఱన యుగము
శ్రీనాధ యుగము • రాయల యుగము
దాక్షిణాత్య యుగము • క్షీణ యుగము
ఆధునిక యుగము • 21వ శతాబ్ధి
చారిత్రిక నగరాలు
భట్టిప్రోలు • వేంగి • ధాన్యకటకము
కొలనుపాక • ఓరుగల్లు • విజయపురి
హంపి • సింహపురి • హైదరాబాదు
చారిత్రిక వ్యక్తులు
గణపతిదేవుడు • రుద్రమదేవి • కృష్ణదేవరాయలు
శాలివాహనుడు •

అమరావతీ పట్టణమున బౌద్ధులు
విశ్వవిద్యాలయములు స్థాపించు నాఁడు

ఓరుగల్లున రాజవీర లాంఛనములుగాఁ
బలు శస్త్రశాలలు నిలుపునాఁడు
విద్యానగర రాజ వీధులఁ గవితకు
పెండ్లి పందిళ్ళు కప్పించు నాఁడు
పొట్నూరికి సమీపమున నాంధ్ర సామ్రాజ్య
దిగ్జయ స్తంభమెత్తించునాఁడు

ఆంధ్ర సంతతికే మహితాభిమాన
దివ్యదీక్షా సుఖస్పూర్తి తీవరించె
నా మహావేశ మర్ధించి యాంధ్రులార!
చల్లుఁడాంధ్ర లోకమున నక్షతలు నేఁడు!

-- రాయప్రోలు సుబ్బారావు

అంధ్ర ప్రదేశ్ లేక తెలుగునాటి చరిత్ర తొలుత చరిత్ర పూర్వయుగము మరియు చారిత్రకయుగము అను రెండు భాగములుగా విభజింపవచ్చును. ఇందు చరిత్ర పూర్వయుగకథనానికి లిఖిత ఆధారాలు లభింపలేదు. ఇది క్రీస్తు పూర్వము మూడవ శతాబ్ది ఆరంభము వరకు కొనసాగిన ప్రాచీన కాలము. క్రీస్తు పూర్వము మూడవ శతాబ్దినుండి ఆధునికకాలము వరకు నడచినది చారిత్రక యుగము. ఈ యుగమును మరల సౌకర్యార్ధమై పూర్వయుగము, మధ్యయుగము మరియు ఆధునికయుగము అని మూడు భాగములుగా విభజింపవచ్చును. మధ్య యుగాన్ని మళ్ళీ పూర్వ మధ్య యుగం (కాకతీయుల కాలం) మరియు ఉత్తర మధ్య యుగం (విజయ నగర రాజ్య కాలం)గా విభజిస్తారు.

విషయ సూచిక

 [దాచు] 

[మార్చు]చరిత్ర పూర్వయుగము

ప్రధాన వ్యాసం: ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర - చరిత్ర పూర్వ యుగము
క్రీ.పూ. 10,000 - క్రీ.పూ. 8,000 - పాత రాతి యుగము - కడప, కర్నూలు, గుంటూరు, నెల్లూరు, అనంతపూర్, నల్గొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాలలో ఈ కాలంనాటి పనిముట్లు దొరికాయి. కడప, కర్నూలు ప్రాంతాలలో పలుగురాయి, కృష్ణానది ఉత్తరాన సున్నపురాయి అధికంగా వాడారు. డోర్నకల్ సమీపంలోని నందికనుమ (గిద్దలూరు) ప్రాంతం పాతరాతి పనిముట్లకు ప్రధాన కేంద్రం అనిపిస్తున్నది. క్రీ.పూ. 8,000 - క్రీ.పూ. 6,000 - సూక్ష్మ రాతి యుగము కాలంలో చిన్న పరిమాణం ఉన్న పనిముట్లు వాడారు. గిద్దలూరు, నాగార్జునకొండ, కొండాపూర్ ప్రాంతాలలోను, అదిలాబాద్ జిల్లాలోను ఈ కాలం అవశేషాలు లభించాయి.

క్రీ.పూ. 6,000 - క్రీ.పూ. 2,000 - కొత్త రాతి యుగము - గిద్దలూరులోను, బళ్ళారి జిల్లా సంగనకల్లులోను ఈ కాలం అవశేషాలు లభించాయి. ఈ యుగంలో పెక్కు నూతన పరికరాలు వాడారు. పసువులను పెంచేవారు. మహబూబ్‌నగర్ జిల్లా ఉట్నూరు వద్ద పేడకుప్పలను తగలబెట్టిన మసిదిబ్బలను కనుగొన్నారు. క్రీ.పూ. 2,000 - క్రీ.పూ. 1,000 - రాగి యుగము - బ్రహ్మగిరి, పుదుచ్చేరిల వద్ద రాగి, కంచు పనిముట్లు లభించాయి. కర్నూలు జిల్లా పాతపాడు వద్ద అలంకరించిన మట్టి పాత్రలు లభించాయి.

క్రీ.పూ. 1,000 - క్రీ.పూ. 500 - ఇనుప యుగము - "రాక్షసిగుళ్ళు" అనే సమాధులు ఈ కాలంలో నిర్మించారు. దాదాపు ఆంధ్రదేశం (విశాఖ మినహా) అందటా ఈ కాలం ఆనవాళ్ళు లభించాయి. తెలంగాణ ప్రాంతంలో ఇనుప పనిముట్ల తయారీ ఆధారాలు అధికంగా దొరికాయి. వ్యవసాయం అభినృద్ధి చెందింది.

[మార్చు]ఆంధ్ర, తెలుగు జాతి

ప్రధాన వ్యాసం: ఆంధ్రుల జాతీయత
ఒక జాతి అనేది ఒక్కమారుగా ఉద్భవించిన సమూహం కాదు. చరిత్రలో జరిగిన అనేక సాంఘిక, రాజకీయ, ఆర్ధిక, స్థానచలన, సాంస్కృతిక ఘటనల ద్వారా జాతులు రూపుదిద్దుకొన్నాయి. ఆంధ్రుల జాతీయతను గురించి లభించిన వివిధ (చాలా వరకు అస్పష్టమైన) ఆధారాల ద్వారా చరిత్రకారులు ఆంధ్రజాతి ఇలా ఏర్పడిందని భావిస్తున్నారు -
నాగులు, ఆంధ్రులు, ద్రావిడులు, తెలుగులు, యక్షులు మరియు శబరులవంటి ఇతర వనవాస జాతులు కాలక్రమంలో వివిధ సంబంధాల ద్వారా, ప్రధానంగా భాషాపరంగా, కలసినందువలన ఆంధ్ర లేదా తెలుగు జాతి రూపుదిద్దుకొంది. వీరిలో నాగులు పంజాబు ప్రాంతంలో (క్రీ.పూ. 600 నాటికి) ఉండి ఆర్యులను ప్రతిఘటించారు. ఆంధ్రులు మహాభారత యుద్ధకాలంలో యమునా నదితీరాన ఉండేవారు. యుద్ధానంతరం నెలకొన్న రాజకీయ కల్లోలం వలనా, మిడతల దండు కారణంగా ఏర్పడిన ఆహార లోపం వలనా క్రమంగా దక్షిణాపధానికి వలస వచ్చారు. యక్షులు భట్టిప్రోలు ప్రాంతంలో తూర్పు తీరాన ఉండేవారు. కళింగులు, తెలుగులు ఉత్తర తీరాంధ్రంలో వ్యవసాయం, ఇతర వృత్తులలో నిపుణులైన స్థిరనివాస జాతి. ద్రవిడులు రాయలసీమ ప్రాంతంలో ఉండేవారు.[1]

క్రీ. పూ. 6వ శతాబ్దంలో ఉద్భవించిన బౌద్ధ, జైన మతాలకు ఆరంభ కాలంనుండి ఈ దక్షిణాపధంలో అనన్యమయన ఆదరణ లభించింది. బౌద్ధమతం బోధించిన వర్ణరహిత జీవనం ఈ జాతుల మధ్య సహజీవనానికీ, సమాగమనానికీ మరింత ఊపునిచ్చింది. ఆంధ్రులు యుద్ధ నిపుణులైనా గాని దండెత్తి వచ్చినవారుకారు. బ్రతుకు తెరువుకోసం వచ్చినవారు. అయితే అప్పటికే స్థిరనివాసం ఏర్పరచుకొన్న తెలుగుల భాష మరింత పరిపక్వత చెందిఉండాలి. కనుక తెలుగు భాష ఈ జాతుల ఏకీకరణకు మార్గం మరింత సుగమం చేసింది. రాజకీయ అధికారం ఆంధ్రులు సాధించినా భాష మాత్రం తెలుగే నిలిచింది[2]. ఈ నేపధ్యంలోనే ఆంధ్రజాతి రూపు దిద్దుకొంది.

[మార్చు]పూర్వ యుగము

ప్రధాన వ్యాసం: ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర - పూర్వ యుగము
మొట్ట మొదటిగా ఆంధ్రుల ప్రస్తావన క్రీ.పూ. 1500 - క్రీ.పూ. 800 మధ్య కాలంలోదిగా భావించబడుతున్న ఐతరేయ బ్రాహ్మణంలో విశ్వామిత్రుడు, శునస్సేపుడు కధలో ఉంది. ఇక్కడ ఆంధ్రులు శబర, మూతిబ, పుండ్ర, పుళింద జాతులతో కలిసి ఆర్యావర్తం దక్షిణాన నివశిస్తున్నట్లు అర్ధం చెప్పుకోవచ్చును. మహాభారతంలో ఆంధ్రులు కౌరవుల పక్షాన ఉన్నట్లు (ఆంధ్రాశ్చ బహవః) ఉన్నది.
క్రీ.పూ. 600 - జైన, బౌద్ధ మతాల ఆరంభం భారత దేశ చరిత్రలో ఒక ప్రభంజనం.మొదటినుండీ ఈ మతాలు ఆంధ్రదేశంలో విస్తరించాయి. ఈ కాలంలో ఉత్తర, దక్షిణ దేశాల మధ్య సంబంధం పెరిగింది. క్రీ.పూ. 500 - 400 - బౌద్ధ జాతక కధలలో ఆంధ్రాపధం (భీమసేన జాతకం) , ఆంధ్రనగరి (సెరివణిజ జాతకం) ప్రస్తావన ఉన్నది. భట్టిప్రోలు శాసనం ద్వారా క్రీ.పూ. 400 నాటికి కుబ్బీరుడు (యక్షరాజు) తీరాంధ్రంలో రాజ్యం చేస్తున్నాడు. అయితే పెద్దయెత్తున ఔత్తరాహులు ఆంధ్రాపధంపై దండెత్తిన ఆధారాలు లేవు. కొద్దిపాటి ఘర్షణలు జరిగి ఉండవచ్చును. క్రీ.పూ. 300 నాటికే బౌద్ధంజైనం ఆంధ్రాపధంలో అమితంగా ఆదరణ పొందాయి.
మౌర్యకాలము క్రీ.పూ.322 - 184
ప్రధాన వ్యాసం: మౌర్యులు
చంద్ర గుప్తుడు క్రీ.పూ. 322లో మౌర్య వంశం స్థాపించాడు. క్రీ.పూ. 300 - మెగస్తనీసు చంద్రగుప్తుని ఆస్తానంలో ఉన్న యాత్రికుడు. ఆంధ్రుల గురించి ఇలా వ్రాశాడు - "ఆంధ్రులకు 30 నగర దుర్గాలు, 10 వేల పదాతి సైన్యం, 2వేల గుర్రపు దళం, వేయి ఏనుగులు ఉన్నాయి" క్రీ.పూ. 272 - క్రీ.పూ.232 అశోకుని పాలన కాలం. అశొకుని 13వ శిలాశాసనం ప్రకారం ఆంధ్రులు "రాజవిషయం"లో ఉన్నారు. క్రీ.పూ.400 - 200 సమయంలో బౌద్ధమతం ఆంధ్రదేశంలో అంతటా ఉచ్ఛదశలో ఉంది. ఆంధ్రుల ఏకీకరణకు మార్గం సానుకూలమయ్యంది. ఈ సమయంలో ఇనుము పరిశ్రమ, వ్యవసాయం, వాణిజ్యం బాగా అభివృద్ధి చెంది దేశం సుభిక్షమయ్యింది. ఉత్తర దేశంనుండి సింహళానికి వెళ్లేమార్గంలో ఆంధ్రదేశం ముఖ్యమైన మజిలీగా ఉండేది.
శాతవాహనులు - క్రీ.పూ.200 - క్రీ.శ.200
ప్రధాన వ్యాసం: శాతవాహనులు
మౌర్య సామ్రాజ్యం పతనమైన తరువాత శాతవాహనులు విశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించారు. వీరి పాలన క్రీ.పూ. 2వ శతాబ్ది నుండి క్రీ.శ.2వ శతాబ్ది వరకు షుమారు 400 సంవత్సరాలు సాగింది. షుమారు క్రీ.పూ. 271-248 మధ్య సిముకుడు అనే రాజు అప్పటి ఆంధ్రరాజ్యాలనన్నింటినీ ఏకం చేసి రాజై శాతవాహనుల వంశాన్ని స్థాపించాడు. అతని మొదటి రాజధాని అమరావతి వద్ద ధరణికోట కావచ్చును. తరువాత మహారాష్ట్రలోని ప్రతిష్టానపురం (ఔరంగాబాద్ జిల్లాలోని పైఠాన్)కు రాజధాని మార్చబడింది. వీరిలో ఆరవ రాజైనరెండవ శాతకర్ణి (క్రీ.పూ.184) గొప్ప రాజు. నందులుమౌర్యులుశుంగులుకణ్వులు తరువాత విశాల భారత సామ్రాజ్యాన్ని శాతవాహనులు సాధించగలిగారు. క్రీ.శ.62లో అధికారానికి వచ్చిన 23వ రాజు గౌతమీపుత్ర శాతకర్ణి కాలంలో శాతవాహనుల ప్రాభవం తిరిగి పుంజుకుంది. నాసిక్ శాసనం ప్రకారం ఇతని రాజ్యంలో అసిక, అస్సక, ములక, సౌరాష్ట్ర, కుకుర, అపరాంత, అనూప, విదర్భ, అకర, అవంతి దేశాలూ మరియు వింధ్య, అచవత, పారియాత్ర, సహ్య, కన్హగిరి, సిరితన, మలయ, మహేంద్ర, శత, చకోర పర్వతాలూ ఉన్నాయి (దక్షిణ ప్రాంతమే కాక గుజరాత్రాజస్థాన్మధ్యప్రదేశ్ఒరిస్సా ప్రాంతాలు). అతని రాజ్యం తూర్పు సముద్రం నుండి పశ్చిమ సముద్రం వరకు విస్తరించింది. క్రీ.శ. 2వ శతాబ్దానికి శాతవాహనుల సామ్రాజ్యం పూర్తిగా పతనమయ్యింది.

శాతవాహనుల కాలంలో దేశాంతర వాణిజ్యం బాగా సాగింది. తీరాంధ్ర, కళింగ ప్రాంతాలలోని అనేక రేవులు, కృష్ణా గోదావరి మధ్య ప్రాంతంలో పెక్కు నగరాలు వాణిజ్యకేంద్రాలుగా విలసిల్లాయి. చేతిపనులు అభివృద్ధి చెందాయి. రాజులు వైదిక మతాన్ని అవలంబించినా గాని బౌద్ధం కూడా వర్ధిల్లింది. రెండు మతాలనూ రాజులు ఆదరించారు. అనేక గొప్ప చైత్యాలు, స్తూపాలు, విహారాలు నిర్మింపబడ్డాయి. సాహిత్యంశిల్పం కూడా ప్రభవించాయి. ఈ కాలంలో బౌద్ధమతంలో జరిగిన మరొక విశేష తత్వశాస్త్ర వికాసం ఆచార్య నాగార్జునుడుబోధించిన మహాయానం.
ప్రధాన వ్యాసం: నాగార్జునుడు
కళింగులు క్రీ.పూ. 200 - క్రీ.శ.420
మహానది, గోదావరి నదుల ముఖ ద్వారాల మధ్య భాగాన్ని కళింగ దేశమని చెప్పవచ్చును. కళింగులు నేటి ఉత్తరాంధ్ర, ఒరిస్సా ప్రాంతాలను పాలించిన రాజులు.
ప్రధాన వ్యాసం: ఖారవేలుడు
తొలి శాతవాహనులకు సమకాలికులుగా కళింగ దేశాన్ని ఛేది (సద) రాజులు పాలించారు. వీరిలో ప్రసిద్ధుడు ఖారవేలుడు. అశొకుని సామ్రాజ్యం క్షీణించిన తరువాత క్రీ.శ. 183లో ఖారవేలుడు కళింగ రాజయ్యాడు. ఖారవేలుడు జైన మతస్థుడు. వృషభ లాంఛనుడు. సమర్ధుడైన పాలకుడు. రాజ్యవిస్తరణ చేశాడు. ఇతని రాజధాని ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాపర్లాకిమిడి వద్దనున్న ముఖలింగం. ఖారవేలునికి శాతవాహనులలో సమకాలీనుడు శాతకర్ణి. వారి మధ్య పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో "పిథుండ" నగరాన్ని ఖారవేలుడు నాశవం చేశాడని హథీగుంఫ శాసనం (క్రీ.పూ. 183) ద్వారా తెలుస్తుంది.
ఖారవేలుని తరువాత కళింగ రాజ్యం చిన్న చిన్న రాజ్యాలుగా చీలిపోయింది. తరువాతి కాలంలో కొంతకాలం పిష్ఠపురంలో మాఠరులు అధికారంలో ఉన్నారు (క్రీ.శ.400-450). దేవపురిలో వాసిష్ఠులు పాలించారు (క్రీ. శ. 300-450).
ఇక్ష్వాకులు క్రీ. శ. 225 - 300
ప్రధాన వ్యాసం: ఇక్ష్వాకులు
శాతవాహనుల పతనం తరువాత తీరాంధ్రప్రాంతంలో ఇక్ష్వాకులు నాగార్జునకొండ వద్ద విజయపురి రాజధానిగా 50 సంవత్సరాలు పాలించారు. ఇక్ష్వాకులు క్రీ.శ.225 ప్రాంతంలో విజృంభించారు. మొదటివాడైన శ్రీ ఛాంతమూలుడు (క్రీ. శ. 225-245) గొప్ప వీరుడు. ఇతడు రాజనీతిపరుడు. ఇతని కాలంలో వైదికమతం పునరుద్ధరణ పుంజుకొంది. తరువాత వీరపురుషదత్త (క్రీ. శ. 245-265) కాలం ఆంధ్రబౌద్ధ చరిత్రలో సువర్ణఘట్టం. అతని రాణులు ఇతర అంతఃపుర స్త్రీలు పెద్దయెత్తున బౌద్ధారామాలకు దానాలు చేశారు. ఆ కాలంలో శ్రీపర్వతం (నాగార్జునకొండ) గొప్ప బౌద్ధక్షేత్రంగా విలసిల్లి దూరదేశాలనుండి యాత్రికులను ఆకర్షించింది. సింహళం, చైనా, కాశ్మీరం, గాంధారం, తొసలి, వనవాస, అపరాంతం, వంగ, యవన, తమిళ దేశాలనుండి వచ్చే యాత్రికులకోసం వారు ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించారు. మాహదేవుడనే బౌద్ధభిక్షువు పల్లవబొగ్గ (పలనాడు)లో చాలాకాలం ప్రచారం చేసి, 14లక్షల 60వేల మంది భిక్షువులతో కలిసి సింహళదేశం వెళ్ళాడని మహావంశం అనే బౌద్ధగ్రంధంలో ఉన్నది. ఇక్ష్వాకుల శాసనాలు శాతవాహనుల శాసనాలవలె అధికంగా ప్రాకృతంలోనే ఉన్నాగాని వాటిలో తెలుగు పదాల వినియోగం హెచ్చింది. సంస్కృతం కూడా చోటు చేసుకోసాగింది.
బృహత్పలాయనులు - క్రీ.శ. 275 ప్రాంతం
ఇక్ష్వాకుల రాజ్యము అంతరించిన తరువాత క్రీ. శ. నాలుగవ శతాబ్ది ప్రథమ పాదములో కృష్ణానది ఉత్తర తటప్రాంతమును బృహత్పలాయనులు పాలించారు. కొండముదిలో దొరికిన ప్రాకృత శాసనము ప్రకారము జయవర్మ కూదూరు (కృష్ణా జిల్లా, మచిలీపట్నం తాలూకా లోని గూడూరు)రాజధానిగా పాలించాడు. ఇతని మహాసైన్యాధిపతి భాపహానవర్మ "మహాతలవర" మరియు "మహాదండనాయక" అని చెప్పబడ్డాడు. నాగార్జునకొండ వద్ద దొరికిన ఒక ఇక్ష్వాకుల శాసనములో "బహఫల సగోత్తాయ సిరివమ్మ భటాయా" అని ఉన్నది. ఈమె కుటుంబమువాడే జయవర్మ అయిఉండవచ్చును. జయవర్మ తరువాత బృహత్పలాయన సగోత్రులు ఎవరైనా రాజ్యము చేశారేమో తెలియదు. వీరి రాజ్యము శాలంకాయనుల విజృంభణ వల్ల అంతరించి ఉండవచ్చును.

అనందగోత్రులు క్రీ.శ. 295 - 620

చేజెర్ల లొ దొరికిన ఐదవ శతాబ్ది చివరికాలపు సంస్కృత శాసనము ప్రకారము అనంద మహర్షి గోత్రీకుడగు కందరరాజు ధాన్యకటక యుద్ధములో శత్రువులను జయించి త్రికూటపతి అయ్యాడు. ఈతని రాజ్యము కృష్ణానది దక్షిణ తీరము నుండి త్రికూట పర్వతము (కోటప్పకొండ) వరకు వ్యాపించి ఉన్నది. రాజధాని కందరపురము. ఇది గుంటూరు జిల్లానర్సారావుపేట వద్దనున్న చేజెర్లచేబ్రోలుకంతేరు లలో ఒకటి కావచ్చును. తరువాతి రాజులు దామోదరవర్మ, అత్తివర్మ. వీరు వైదికమతాభిమానులైనను బౌద్ధమును ఆదరించారు. బౌద్ధమత క్షీణదశ అప్పటికి ప్రారంభము కాలేదు. వీరికి పల్లవులతో యుద్ధాలు జరిగాయి. చాళుక్యరాజు సత్యాశ్రయ పులకేశి యొక్క సేనాపతి పృథ్వీయువరాజు దండెత్తినపుడు కందారరాజు చేత ఓడిపోయాడు. కాని తరువాతి దండయాత్రలో పులకేశి తమ్ముడు కుబ్జవిష్ణువర్ధనుడు స్థానిక రాజులందరిని ఓడించి ఆంధ్రదేశాన్ని స్వాధీనం చేసుకొన్నాడు. తరువాత దక్షిణాంధ్రాన్ని పల్లవులు, కృష్ణామండలం ప్రాంతాన్ని శాలంకాయనులు ఆక్రమించారు. క్రీ. శ. అయిదవ శతాబ్ది చివరకు శాలంకాయనుల ధాటికి వీరి రాజ్యము అంతరించినది.

శాలంకాయనులు క్రీ. శ.300 - 420
"శాలంకాయన" అనేది గోత్రనామము. వీరు వేంగి రాజధానిగా గోదావరి, కృష్ణా జిల్లాలను పాలించారు. వీరు ఆనంద గోత్రజులకు ఇంచుమించు సమకాలికులు. వీరికాలంలో వేంగినగరం గొప్ప విజ్ఞానకేంద్రంగా ఉండేది. వీరు వేంగిలో చిత్రరధస్వామిని ఆరాధించారు. గుంటుపల్లెలోని ఆరామాలకు భూరి విరాళాలిచ్చారు. హస్తివర్మ క్రీ.శ.320లో విజృంభించి వేంగి ప్రాంతంలోని ఇక్ష్వాకులను ఓడించి రాజ్యపాలన ప్రారంభించి ఉండవచ్చును. సముద్ర గుప్తుని దక్షిణదేశ దండయాత్రలగురించి అలహాబాదు ప్రశస్తిలో చెప్పబడిన వైగేయిక హస్తివర్మ ఇతడే. అంతర్యుద్ధాలవల్ల, ఉత్తరాన పిష్ఠపురంలో మాఠరులు, కర్మరాష్ట్రంలో విష్ణుకుండినులు బలవంతులై తరచు యుద్దాలు చేయడం వలన శాలంకాయనుల రాజ్యం పతనమయ్యింది. ఈ కాలంలో బౌద్ధం భారత దేశంలో క్షీణిస్తూ ఇతర దేశాలలో విస్తరించడం ప్రాంభమైంది.
విష్ణుకుండినులు క్రీ. శ. 375-613
ప్రధాన వ్యాసం: విష్ణుకుండినులు
శాలంకాయనులతరువాత వేంగీదేశమును విష్ణుకుండినులు క్రీ. శ. 375 నుండి క్రీ. శ. 613వరకు పాలించారు. విష్ణుకుండినుల రాజ్యము తూర్పున విశాఖపట్టణము మొదలుగ పడమట గుంటూరు వరకును, నైరుతిన గోలకొండ వరకు విస్తరించిఉన్నది. సంస్కృత భాషను ఆదరించారు. వైదిక సంస్కృతికి పట్టుకొమ్మలై వేదవిద్యలు పోషించారు. విష్ణుకుండినులు మతసహనము గలవారు. ప్రజలలో అప్పటికి ఆదరణపొందుచుండిన బౌద్ధమతాన్ని ఆదరించారు. గుహాలయములు నిర్మించి గుహాలయ వాస్తువుకు ప్రోత్సాహమిచ్చారు. మొగల్రాజపురము, ఉండవల్లి గుహాలయాలు వీరు నిర్మించినవే. విష్ణుకుండినులు రాగిమలాము చేసిన ఇనుప నాణెములు వాడారు. భారతదేశములో ఇలాంటి నాణెములు తొలుతగా ప్రవేశబెట్టినవారు విష్ణుకుండినులు. విష్ణుకుండినుల రాజధాని "ఇంద్రపురం" ప్రస్తుత నల్గొండ జిల్లా (రామన్నపేట తాలూకా) ఇంద్రపాలగుట్ట కావచ్చునని ఒక అభిప్రాయం.
క్రీ. శ. 514 నాటికి గోదావరికి ఉత్తరాన కళింగ రాజ్యం వేరయ్యింది. కృష్ణానది దక్షిణ భాగం పల్లవుల వశమయ్యింది. కృష్ణా గోదావరి మధ్యభాగం విష్ణుకుండినుల పాలనలో ఉంది. పశ్చిమాన ప్రస్తుత తెలంగాణా ప్రాంతం వాకాటకుల పాలనలో ఉంది. ఈ పరిస్థితి 7వ శతాబ్దం వరకు కొనసాగింది.
పల్లవులు
ప్రధాన వ్యాసం: పల్లవులు'
సాతవాహనాంతరికులలో తక్కిన రాజవంశములలో వైశాల్యమున అధికతరమగు రాజ్యమును దీర్ఘ కాలము పాలించిన వారు పల్లవులు. ఉచ్చదశలో కృష్ణానది ఉత్తరపు ఎల్లగా, కావేరీనది దక్షిణపు సరిహద్దుగా వర్తించాయి. ఆంధ్ర-తమిళ ప్రాంతమునే గాక కర్ణాట ప్రాంతముపై కూడ కొంతకాలము ఆధిపత్యము నిర్వహించారు.

[మార్చు]పూర్వమధ్య యుగము

ప్రధాన వ్యాసం: ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర - పూర్వమధ్య యుగము
మహాపల్లవులు
6వ శతాబ్దం చివరి భాగంలో పల్లవుల రాజ్యం తిరిగి బలపడింది. కంచి కేంద్రంగా సింహవిష్ణు నాయకత్వంలో వర్ధిల్లిన ఈ వంశాన్ని అనంతర పల్లవులు లేదా "మహా పల్లవులు" అంటారు. వీరిలో వీరకుర్చుడు మొదటి రాజు. త్రిలోచన పల్లవుడు అందరికంటే ప్రసిద్ధుడు. మంచికల్లు (మాచర్ల వద్ద) లభించిన శాసనం పల్లవుల గురించి తెలిపే మొదటి ఆధారం. క్రీ. శ. 600-630 ప్రాంతంలో సింహవిష్ణు కొడుకైన మహేంద్రవర్మ కృష్ణానది దక్షిణ భాగాన్నంతటినీ జయించాడు. విస్తరణ దశలో ఉన్నరెండు వంశాలైన పల్లవులకూ, చాళుక్యులకూ మధ్య అధిపత్యం కొరకు తీవ్రమైన యుద్ధాలు జరిగాయి. కాని బాదామి చాళుక్యుల రాజ్యాన్ని పశ్చిమాన రాష్ట్రకూటులు అంతం చేయడంతో పల్లవుల రాజ్యం సుస్థిరమయ్యే అవకాశం లభించింది. 9వ శతాబ్దం వరకు పల్లవుల పాలన సాగింది. తరువాత తంజావూరు చోళులు వారిని జయించి కాంచీపురాన్ని ఆక్రమించారు.
రేనాటి చో(డు)ళులు
ప్రధాన వ్యాసం: రేనాటి చోళులు
రేనాడు అని వ్యవహరింపబడిన (కడప మండలములోని పులివెందుల, అమలాపురము, ప్రొద్దుటూరు, జమ్ములమడుగు తాలూకాలు, చిత్తూరు మండలములోని మదనపల్లి, వాయల్పాడు తాలూకాలు) దేశ విభాగములో తెలుగు భాష శాసనభాషగా పరిణతి చెందింది. క్రీ. శ. ఆరవ శతాబ్దమునుండి తొమ్మిదవ శతాబ్దము వరకు చోళవంశమునకు చెందిన ఒక శాఖ ఈ ప్రాంతములో రాజ్యం చేసి క్రమంగా ఏరువ, పొత్తపి, నెల్లూరు, కొణిదెన, నిడుగల్లు, కందూరు అను ప్రాంతీయ వంశములుగా ఏర్పడ్డారు.
చాళుక్యులు
ప్రధాన వ్యాసం: చాళుక్యులు
వీరు తొలుత విజయపురి ఇక్ష్వాకు రాజులకడ సామంతులుగా వుండి రాయలసీమ ప్రాంతమములోని చాళుక్యవిషయమును పరిపాలించారు[3]. తూర్పుననున్న పల్లవుల ధాటికి తాళలేక కర్ణాట రాజ్యము ప్రవేశించి కదంబులనోడించి ఒక మహాసామ్రాజ్యసంభూతులైరి. చాళుక్యులకెల్ల మూలమైనది బాదామి రాజవంశము. క్రీ.శ. 624 సంవత్సరములో పులకేశి వేంగి, కళింగ రాజ్యములు జయించి తన తమ్ముడైన కుబ్జవిష్ణువర్ధనుని వేంగిలో పట్టాభిషిక్తుని గావించి, కమ్మనాడు వైపు మరలి చిరకాలశత్రువులగు పల్లవులను దక్షిణమునకు తరిమివేశాడు. క్రీ. శ. 755లో చాళుక్యసామ్రాజ్యమంతరించువరకు పల్లవులతో ఎడతెగని యుద్ధాలు సాగాయి. ఆంధ్రదేశములో మాత్రము తూర్పు చాళుక్యులపేర క్రీ. శ. 1076 వరకు స్థిరముగా పాలించారు.
ప్రధానమైన చాళుక్య రాజ్యాలే కాకుండా ప్రస్తుత కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలలోని ప్రాంతాన్ని వేములవాడ రాజధానిగా పాలించిన వంశాన్ని వేములవాడ చాళుక్యులు అంటారు. 755-968 మధ్య కాలంలో వీరు రాష్ట్రకూటులకు నామమాత్రపు సామంతులుగా ఉన్నారు. మిగిలిన చాళుక్యులు చంద్రవంశపు రాజులమని చెప్పుకొనేవారు. కాని వేములవాడ చాళుక్యులు రాష్ట్రకూటులలాగా తమది సూర్యవంశమని చెప్పుకొన్నారు.
రాష్ట్రకూటులు
ప్రధాన వ్యాసం: రాష్ట్రకూటులు
రాష్ట్రకూట వంశము బహు ప్రాచీనమైనది. క్రీ.శ. 6వ శతాబ్దము నుండియు ఈవంశపు రాజులు దక్షిణ హిందూదేశమున పెక్కుచోట్ల చిన్నచిన్న సంస్థానములు స్థాపించి పాలన చేయుచుండిరి. వీరు తొలుత చాళుక్యులకు సామంతులు. ఇప్పటి మహారాష్ట్ర లోని ఎల్లోరా ప్రాంతమునేలుచున్న దంతిదుర్గుడు బాదామి చాళుక్యుల కడపటి రాజు రెండవ కీర్తివర్మను కూలద్రోసి రాజ్యము చేశాడు. ఇతనిని దంతివర్మ అని కూడ అందురు. అద్వితీయ బల పరాక్రమ సంపన్నుడు. ఖడ్గావలోక, వైరమేఘ అను బిరుదులున్నాయి. క్రీ.శ. 758లో యుద్ధములో మరణించాడు. రాజ్యము చేసిన కొద్దికాలములోనే కాంచీ, కళింగ, కోసల, శ్రీశైల, మాళవ, లాట, టంక, సింధుదేశములను జయించాడు. ఇతనికి వేములవాడ చాళుక్య వంశమునకు మూలపురుషుడైన వినయాదిత్య యుద్ధమల్లుడు తోడ్పడ్డాడు.
పూర్వ చాళుక్యులు
ప్రధాన వ్యాసం: తూర్పు చాళుక్యులు
ప్రధాన వ్యాసం: వేంగి
తూర్పుచాళుక్యులు వేంగి రాజధానిగా 7వ శతాబ్దములో తీరాంధ్ర ప్రాంతాన్ని పాలించిన రాజవంశము. ప్రసిద్ధి గాంచిన బాదామి చాళుక్య రాజైన రెండవ పులకేశి (క్రీ.శ.608–644) తూర్పు దక్కన్ ప్రదేశాన్ని(ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా జిల్లాలను) క్రీ.శ. 616 సంవత్సరంలో, విష్ణుకుండినులను ఓడించి, తన అధీనంలోకి తీసుకొన్నాడు. రెండవ పులకేశి సోదరుడైన కుబ్జ విష్ణువర్ధనుడు అక్కడ తన అన్న అనుమతితో స్వతంత్ర రాజ్యం ఆరంభించాడు. క్రమంగా సంపదలు, సైనిక సంపత్తి ఏర్పరచుకొని వేంగి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చెయ్యగలిగారు. తరువాతి కాలంలో కుటుంబ కలహాల వల్ల, మరియు పొరుగు రాజ్యాలతో - ముఖ్యంగా రాష్ట్రకూటులు మరియు కళింగులతోను తరువాత చోళులతోను యుద్ధాలవల్ల వేంగి రాజ్యం క్రమంగా క్షీణించింది.
తూర్పు చాళుక్యులు తెలుగు సాహిత్యానికి తొలిపలుకులు పలికారు. తొమ్మిదో శతాబ్దం రెండవ అర్థభాగంలో రెండవ విజయాదిత్యుని పరిపాలనాకాలంలో తెలుగులో కవిత్వం ప్రారంభం అయిందని అద్దంకి, కందుకూరులలో నున్న పాండురంగ శిలాశాసనాలు చెబుతున్నాయి. 11వ శతాబ్దంలో కవిత్రయంలో మొదటి వాడైన నన్నయ్య మహాభారతాన్ని తెనిగించడం ప్రాంరంభించాడు. ఇది తెలుగు సాహితీ రంగంలో ఒక సువర్ణ ఘట్టం. శైవం బాగా ప్రబలి ఉన్న రోజులు కావడంచేత తూర్పు చాళుక్యులు ఎక్కువగా శివాలయాలు నిర్మించారు.

పూర్వ గాంగులు
వేంగిలో తూర్పు చాళుక్యుల రాజ్యానికి సమాంతరంగా ఈశాన్యాన తూర్పు (పూర్వ) గాంగులు, దక్షిణాన పల్లవులు పరిపాలించారు. పూర్వ గాంగులు 5వ శతాబ్దం చివరలో ఒరిస్సా ప్రాంతంలో పాలకులుగా ఉన్నారు. ఆధారాలు లభించినంత వరకు ఆంధ్ర ప్రాంతపు మొదటి రాజు అనబడుతున్న ఇంద్రవర్మ (6వ శతాబ్దం) రాజధాని "దంతిపురం". తరువాత రాజధానిని కళింగ నగరం (శ్రీకాకుళం వద్దనున్న ముఖలింగం) కు మార్చబడింది. షుమారు 5 వందల సంవత్సరాలు గాంగుల పాలన ఈ ప్రాంతంలో సాగింది. తరువాత 11వ శతాబ్దం చివరిలో వారి రాజ్యానికి ఒరిస్సాలోని కటక్ ప్రధాన కేంద్రమయ్యింది.
చాళుక్య చోళులు
1వ రాజరాజ చోళుని (క్రీ. శ. 985 - 1016) నాయకత్వంలో దక్షిణాన చోళులు బలవంతమైన పాలకులయ్యారు. తూర్పు చాళుక్యుల అంతఃకలహాల కారణంగా శక్తివర్మ అనే రాజు వేంగి సింహాసనం సాధించడానికి రాజరాజచోళుని సహాయం అర్ధించాడు. ఇది అవకాశంగా రాజరాజు వేంగిని జయించి శక్తివర్మను వేంగికి పాలకుడిగా చేశాడు. తరువాత చోళులకు, కళ్యాణీ చాళుక్యులకు వేంగి రాజ్యం యుద్ధరంగమయ్యింది. వేంగి చాళుక్యులతో చోళులు వివాహ సంబంధాలు ఏర్పరచుకొన్నాక వారిని చాళుక్యచోళులు అని వ్యవహరిస్తున్నారు. చాళుక్య చోళ రాజు రాజేంద్రుడు క్రీ. శ. 1070లో 1వ కులోత్తుంగ చోళునిగా చోళసింహాసనం అధిష్టించాడు. క్రీ. శ. 1076వరకు వేంగిలో చాళుక్యచోళుల పాలన (చోళుల రక్షణ, అధీనంలో) సాగింది.
కాకతీయులు
ప్రధాన వ్యాసం: కాకతీయులు
కాకతీయ వంశము ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రాంతమును క్రీ. శ. 1083 నుండి క్రీ. శ. 1323 వరకు పరిపాలించిన రాజవంశము[1]. క్రీ. శ. 9వ శతాబ్దము ప్రాంతములో రాష్ట్రకూటుల సేనానులుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కాకతీయులు ఆంధ్రదేశాన్ని అంతటిని ఒకే త్రాటిపైకి తెచ్చి పరిపాలించారు. శాతవాహనుల అనంతరం ఆంధ్రదేశాన్ని, జాతినీ సమైక్యం చేసి, ఏకచ్ఛత్రాధిత్యం క్రిందికి తెచ్చిన హైందవ రాజవంశీయులు కాకతీయులొక్కరే. కాకతీయుల కాలంలోనే ఆంధ్ర, త్రిలింగ పదాలు సమానార్థకాలై, దేశపరంగా, జాతిపరంగా ప్రచారంపొందాయి. వీరు ఆంధ్రదేశాధీశ్వర బిరుదం ధరించినారు. వీరి రాజధాని ఓరుగల్లు (నేటి వరంగల్).
కాకతీయ సామ్రాజ్యంలో మూడు ముఖ్యమైన ఘట్టాలున్నాయి
  • క్రీ. శ. 1000 - 1158 - తెలంగాణ విమోచన: ఈ దశలో నలుగురు రాజులు పాలించారు - కాకర్త్య గుండన, మొదటి ప్రోలరాజు, రెండవ బేతరాజు, రెండవ ప్రోలరాజు - ఈ సమయంలో తెలంగాణ ప్రాంతం కాకతీయుల వశమయ్యింది. తెలుగునాట పశ్చిమ చాళుక్యుల పాలన అంతమయ్యింది. ముఖ్యంగా రెండవ ప్రోలరాజు పెద్ద రాజ్యాలకు ప్రతినిధులైన నలుగురు సామంతులను ఓడించి ఈ నిజయం సాధించాడు. అంతకు ముందు తీరాంధ్రంలో మాత్రమే స్వతంత్ర రాజ్యాలున్నాయి. కన్నడ ప్రాంతపు చాళుక్యులు, మహారాష్ట్ర నుండి రాష్ట్రకూటులు తీరాంధ్రంపై జరిగిన దండయాత్రలకు తెలంగాణా మార్గంగానే ఉంది. కనుక తెలంగాణ ప్రాంతంలో ఆర్ధిక, సాంస్కృతిక ప్రగతి కుంటువడి స్తబ్దంగా మారింది. ప్రజలలో పుట్టి కష్ట సుఖాలెరిగిన కాకతీయులు సాధించిన స్వతంత్రతతో తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయం, సాహిత్యం, వ్యాపారం ఒక్కమారుగా ఊపందుకొన్నాయి. ఇప్పటికీ కాకతీయులు త్రవ్వించిన చెరువులే చాలా మండలాలలో ముఖ్యనీటివనరులు.
  • క్రీ. శ. 1159 - 1261 తీరాంధ్రంలో విజయం : ఈ దశలో కాకతీయులు ఉత్తరాన గంజాం నుండి దక్షిణాన కంచి వరకు జయించారు. రాయల సీమ, తెలంగాణ మరియు తీరాంధ్ర ప్రాంతాలు ఒక పాలనలోకి వచ్చాయి. ఈ దశలో ముగ్గురు పాలకులున్నారు. వారిలో గణపతి దేవుడు ప్రసిద్ధుడు. ఈ కాలంలో అన్ని ప్రాంతాల వారి మధ్య సంబంధ బాంధవ్యాలు పెరిగాయి. కాని కులాల మధ్య విద్వేషాలు ఈ కాలంలో పెరగ సాగాయి.
  • క్రీ. శ. 1262 - 1323 సామ్రాజ్య పతనం: ఈ సమయంలో రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు పాలించారు. ఇద్దరూ సమర్ధులైన ప్రభువులు మరియు యుద్ధ కోవిదులు, కాని ఉప్పెనలా ముంచుకొచ్చిన ఉత్తర దేశపు దండయాత్రల కారణంగా కాకతీయ సామ్రాజ్య పతనాన్ని ఆపలేకపోయారు. వివిధ కులాల మధ్య కలహాలు ఈ పతనానికి మరింత తోడ్పడ్డాయి.
అర్వాచీన గాంగులు
12వ శతాబ్దంలో అంతటా గందరగోళం నెలకొంది. కళ్యాణి చాళుక్యులు తూర్పు చాళుక్యులను జయించారు. 17 సంవత్సరాల తరువాత కళ్యాణి చాళుక్యులను చోళులు, వారి స్థానిక మిత్రులు కలిసి జయించారు. చందవోలు (గుంటూరు) ప్రాంతాన్ని చోళుల సామంతులు అయిన వెలనాటి చోళులు పాలించారు. క్రీ. శ. 1135-1206 కాలంలో వెలనాటి చోళుల నామమాత్రపు అధిపత్యంలో ఆంధ్రదేశాన్ని అనేక చిన్నచిన్న రాజకుటుంబాలు పాలించాయి. రాజకీయ, సాంఘిక కారణాల వల్ల వారి మధ్య జరిగిన ఘోరమైన యుద్ధమేపల్నాటి యుద్ధం.

[మార్చు]ఉత్తరమధ్య యుగము

ప్రధాన వ్యాసం: ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర - ఉత్తరమధ్య యుగము
ఇక్ష్వాకులు, ఛాగి, పరిచ్చేదులు, విష్ణుకుండినులు, తూర్పు చాళుక్యులు, కోటవంశస్తులు, కాకతీయులు వంటి క్షత్రియ సామ్రాజ్యాల పతనానంతరం వారి వద్ద సేనానులుగా పనిచేసిన కమ్మ, రెడ్డి, వెలమ కులస్తులు స్వతంత్ర రాజ్యాలు స్థాపించుకున్నారు.
ముసునూరి నాయకులు
ప్రధాన వ్యాసం: ముసునూరి నాయకులు‎
ప్రతాపరుద్రుని పరాజయము తరువాత ఆంధ్రదేశము అల్లకల్లోలమైనది. తురుష్కుల ఆగడాలు చెప్పనలవి గానివి. ప్రోలయనాయకుని విలస తామ్ర శాసనములో ఆనాటి తెలుగు వారి దయనీయ స్థితి వర్ణించబడింది. విషమ పరిస్థితులలో బెండపూడి అన్నయ మంత్రి మరియు కొలను రుద్రదేవుడను ఇద్దరు దేశాభిమానులు చెల్లాచెదరైన తెలుగు నాయకులను ఐక్యపరచి వారికి నాయకునిగా ముసునూరి ప్రోలానీడు అను మహాయోధుని ఎన్నుకొన్నారు. ప్రోలానీడు ఓరుగల్లు విముక్తి గావించుటకు పలు వ్యూహములల్లాడు. పెక్కు యుద్ధముల పిదప క్రీ. శ. 1326 లో తురుష్కులను దక్షిణభారతము నుండి తరిమివేయుటలో నాయకులు సఫలమయ్యారు. ప్రోలయనాయకుని మరణానంతరం క్రీ. శ. 1333లో కాపయనాయకుడు మళ్ళీ ఓరుగల్లు రాజయ్యాడు. హిందూమతము రక్షించబడింది. దేవాలయములు పునరుద్ధరించబడ్డాయి. బ్రాహ్మణులకు అగ్రహారములీయబడెను. అనితల్లి కలువచేరు శాసనములో ప్రోలానీడి వీరత్వము, దేశాభిమానము, ప్రజారంజకమగు పరిపాలన విపులముగా కొనియాడబడ్డాయి.
ఓఢ్ర గజపతులు, రేచెర్ల వెలమలు, కొండవీటి రాజ్యము, రాజమహేంద్రవర రాజ్యము
ఇవన్నీ దాదాపు ఆంధ్ర దేశపు వివిధ ప్రాంతాలలో ఏకకాలంలో నడచిన రాజ్యాలు. ముసునూరు నాయకులను తొలగించి రేచెర్ల నాయకులు రాజులయ్యారు. క్రీ. శ. 1325 నుండి 1474 వరకు తెలంగాణా మొత్తం వారి అధీనంలో ఉంది. రాజధాని రాచకొండ. తీరాంధ్ర దేశం క్రీ. శ. 1325 - 1424 మధ్య కాలంలో కొండవీటి రెడ్ల పాలనలో ఉంది. మొదట వారి రాజధాని అద్దంకి. తరువాత కొండవీటికి మార్చబడింది. అదే సమయంలో రాజమండ్రి ప్రాంతం ఇతర రెడ్ల పాలనలోకి వచ్చింది. ఉత్తరాంధ్ర ప్రాంతం గజపతుల అధీనంలో ఉంది. ఒరిస్సా కటక్‌నుండి పాలిస్తున్న గజపతులు క్రీ. శ. 1448లో రాజమండ్రి రెడ్లను జయించారు. కాని క్రమంగా అన్ని ప్రాంతాలు విజయనగర రాజుల అధీనంలోకి వెళ్ళాయి. కొండవీటి రెడ్ల కాలంలోని ముఖ్య కవులు శ్రీనాధుడు, ఎర్రా ప్రగడ.
బహమనీ రాజ్యము
ప్రధాన వ్యాసం: బహుమనీ సామ్రాజ్యము
క్రీ. శ. 1323లో ఓరుగల్లు పతనానంతరం ఆంద్రులు మొట్టమొదటి సారిగా ముస్లిముల పాలనలోకి వచ్చారు. క్రీ. శ. 1347లో ఢిల్లీ సుల్తానులనుండి స్వాతంత్ర్యం ప్రకటించుకొని అల్లావుద్దీన్ హసన్ గంగు బహమనీ రాజ్యం స్థాపించాడు. క్రీ. శ. 1347 నుండి దాదాపు క్రీ. శ. 1425 వరకు బహుమనీల రాజధాని ఎహసానాబాద్‌ (గుల్బర్గా). ఆ తరువాత రాజధానిని మహమ్మదాబాద్‌ (బీదర్‌)కు తరలించారు. బహుమనీలు దక్కన్‌ మీద ఆధిపత్యానికై దక్షిణాన ఉన్న హిందూ విజయనగర సామ్రాజ్యముతో పోటీ పడేవారు. ఈ సల్తనత్ యొక్క అధికారము మహమూద్‌ గవాన్ యొక్క వజీరియతులో (క్రీ. శ. 1466–1481) ఉచ్ఛస్థాయి చేరుకొన్నది. క్రీ. శ. 1518 తర్వాత అంతఃకలహాల వలన బహుమనీ సామ్రాజ్యము ఐదు స్వతంత్ర రాజ్యాలుగా విచ్ఛిన్నమైనది. ఆ ఐదు రాజ్యములు అహ్మద్‌నగర్ (నిజాం షాహి), బీరార్ (ఇమాద్ షాహి), బీదర్ (బారిద్ షాహి), బీజాపూర్ (అహమ్మద్ షాహి), మరియు గోలకొండ (కుతుబ్ షాహి) - ఇవి దక్కన్‌ సుల్తనత్ లుగా పేరు పొందాయి. వీటిలో కుతుబ్ షాహి వంశం ఆంధ్రుల చరిత్రలో ముఖ్యమైన ప్రభావం కలిగి ఉంది.
విజయనగర సామ్రాజ్యము
ప్రధాన వ్యాసం: విజయనగర రాజులు
విజయనగర సామ్రాజ్యానికి భారతదేశ చరిత్రలో విశేష స్థానమున్నది. భారతావనియెల్లా తురుష్కుల దండయాత్రలకు ఎరయై సనాతన ధర్మము, సంస్కృతి, వేషభాషలు, ఆచారములు కనుమరుగై పోవు స్థితిలో హిందూమత సంరక్షణకు నడుముగట్టి నాలుగు శతాబ్దములు నిర్విరామముగా స్వరక్షణకై పోరాటములు సల్పి చాలావరకు కృతకృత్యులయిన దేశాభిమానుల చరిత్ర విజయనగర ఇతిహాసము. విజయనగర సామ్రాజ్యాన్ని హరిహర (హక్క) మరియు బుక్క అనే అన్నదమ్ములు క్రీ. శ. 1336 లో స్ధాపించారు. వారి రాజధాని మొదట ఆనెగొంది. ఆనెగొంది ప్రస్తుతము తుంగభద్ర ఉత్తర తీరమున ఒక చిన్న పల్లె. సామ్రాజ్యము బుక్కరాయని పరిపాలనలో అభివృద్ధి చెందిన తరువాత రాజధానిని తుంగభద్ర దక్షిణ తీరమున గల విజయనగరము నకు తరలించారు.
తరువాత రెండు శతాబ్దాలలో, విజయనగర సామ్రాజ్యము యొక్క ఆధిపత్యము దక్షిణ భారత దేశమంతటా ప్రకాశించింది. యావద్భారత ఉపఖండములోనే విజయనగరము బలీయమైన రాజ్యంగా వెలిసింది. ఈ కాలంలో గంగా మైదానం నుండి వచ్చిన టర్కీ సుల్తానుల దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్నది. దక్కను లోని ఐదుగురు సుల్తానుల నుండి నిరంతరంగా ఘర్షణలను ఎదుర్కొంది. ఒక బలీయమైన శక్తిగా నిలబడింది. శ్రీ కృష్ణదేవరాయలు కాలంలో ఈ సామ్రాజ్యం ఉచ్ఛస్థితికి చేరింది. దక్కనుకు తూర్పున కొండవీడు, రాచకొండ, కళింగుల అధీనంలోగల ప్రాంతాలను, తమిళదేశమును వశపరచుకున్నాడు. సామ్రాజ్యపు గొప్ప గొప్ప నిర్మాణాలు ఆయన తోటే మొదలయ్యాయి. విజయనగరం లోని హజార రామాలయం, కృష్ణ దేవాలయం, ఉగ్ర నరసింహ మూర్తి విగ్రహం వీటిలో కొన్ని.
క్రీ. శ. 1530 లో అచ్యుతరాయలు ఆయనకు వారసుడయ్యాడు. క్రీ. శ. 1542 లో రామరాయలు గద్దెనెక్కాడు. ఇతడు దక్కను సుల్తానులను అనవసరంగా రెచ్చగొట్టి వారి శత్రుత్వం కొనితెచ్చుకున్నట్లు కనిపిస్తుంది. క్రీ. శ. 1565 తళ్ళికోట యుద్ధంలో విజయనగర సైన్యాన్ని సుల్తానుల సమాఖ్య చిత్తుగా ఓడించారు. రాజధానిని ఆరు నెలలబాటు కొల్లగొట్టి, నేలమట్టం చేశారు. ఈ సామ్రాజ్యపు స్థాపన వివరాలూ, దాని చరిత్రలో ఎక్కువ భాగం అస్పష్టంగా ఉన్నాయి; కానీ దాని శక్తీ, అర్ధిక పుష్ఠి లను పోర్చుగీసు యాత్రికులైన డోమింగో పేస్‌, నూనిజ్‌ వంటి వారే కాక మరి కొందరు కూడా నిర్ధారించారు. విద్యా, సాంస్కృతిక పరంగా విజయనగర సామ్రాజ్య కాలాన్ని స్వర్ణయుగంగా పరిగణిస్తారు.

[మార్చు]ఆధునిక యుగము

ప్రధాన వ్యాసం: ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర - ఆధునిక యుగము
ఈ వ్యాసం ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో ఒక భాగం
ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
Hitec city.jpg
ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు
హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు
ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ
ఇటీవలి చరిత్ర

ముఖ్యమంత్రులు    పుణ్యక్షేత్రాలు
సుప్రసిద్ధ ఆంధ్రులు    కోటలు

అరవీటి వంశము

గోలకొండ రాజ్యము

నిజాము రాజ్యము
ప్రధాన వ్యాసం: నిజాము

బ్రిటిషు రాజ్యము

స్వాతంత్ర్యోద్యమము

[మార్చు]ఆంధ్రోద్యమములు

మధ్య యుగంలో కాకతీయులువిజయనగర రాజులుచోళులుచాళుక్యులురెడ్డి రాజులు,కుతుబ్ షాహీలు మొదలైన అనేక వంశాల పాలనలో ఉంటూ వచ్చిన ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్‌19 వ శతాబ్దం ఆరంభం నాటికి కొంత భాగం బ్రిటిషు వారి పాలనలోను, కొంత నిజాము నవాబు ఏలుబడిలోను ఉంది. సర్కారులు గాను, రాయలసీమ గాను, హైదరాబాదు(నైజాం)గాను విడిపోయి ఉన్న ఈ ప్రాంతాలను కలిపే మూలసూత్రం - వీరి మాతృభాష అయిన తెలుగు. ఒకే రాష్ట్రంగా ఏర్పడాలన్న ఆకాంక్ష అన్ని ప్రాంతాల ప్రజలలోను బలంగా ఉండేది.

ప్రధాన వ్యాసము: ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు
బ్రిటిషు పరిపాలనా కాలంలో కోస్తా, రాయలసీమ ప్రాంతాలు మద్రాసు ప్రెసిడెన్సీ లో భాగంగా, బ్రిటిషు వారి అధికారంలో ఉండేవి. మద్రాసు ప్రెసిడెన్సీలో ఈ జిల్లాలు ఉండేవి. -శ్రీకాకుళంవిశాఖపట్నంతూర్పు గోదావరిపశ్చిమ గోదావరికృష్ణాగుంటూరునెల్లూరుచిత్తూరుఅనంతపురంకడపకర్నూలు.
మద్రాసు ప్రెసిడెన్సీలో తమిళుల ప్రాబల్యం అధికంగా ఉండేది. జనాభా లోను, విస్తీర్ణం లోను ఆంధ్ర ప్రాంతమే హెచ్చుగా ఉన్నప్పటికీ, పరిపాలన లోను, ఆర్ధిక వ్యవస్థ లోను తమిళుల ఆధిపత్యం సాగేది. సహజంగానే, తమకంటూ ప్రత్యేక రాష్ట్రం ఉంటేనే, రాజకీయంగాను, ఆర్ధికంగాను గుర్తింపు లభిస్తుందని వారు ఆశించారు.

1912 లో ఆధికారికంగా ప్రత్యేక రాష్ట్ర పోరాటం మొదలయింది. ఉద్యమానికి టంగుటూరి ప్రకాశం పంతులుభోగరాజు పట్టాభి సీతారామయ్యనీలం సంజీవరెడ్డి వంటి నాయకులు సారథ్యం వహించారు. 40 సంవత్సరాల పోరాటం, రెండు సుదీర్ఘ నిరాహార దీక్షలు, అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం, విధ్వంసానికి దారితీసిన ప్రజల కోపం తరువాత 1952అక్టోబర్ 1 న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది, ఆంధ్రుల చిరకాల స్వప్నం ఫలించింది.
ప్రధాన వ్యాసం: హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు
హైదరాబాదు సంస్థానం కథ వేరుగా ఉండేది. నిజాము ఏలుబడిలో ఉన్న ప్రజలు, స్వాతంత్ర్యం తరువాత ప్రత్యేక దేశంగా ఏర్పడాలన్న నిజాము ఆలోచనకు వ్యతిరేకంగాను, నిజాము యొక్క రజాకార్ల దౌష్ట్యాన్ని ఎదిరించేందుకు గాను నడుం కట్టారు. నిజాము పాలన నుండి బయటపడి భారత దేశంలో విలీనం కావాలన్నదే అప్పటి వీరి ప్రధాన లక్ష్యం.
1947 ఆగష్టు 15న భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా హైదరాబాదు నిజాము పాలన నుండి విముక్తి కాలేదు. ప్రత్యేక దేశంగా ఏర్పడాలన్న నిజాము, తన ఆలోచనకు తగినట్లుగా ప్రయత్నాలు చేసాడు. ఐక్యరాజ్యసమితి యొక్క భద్రతా మండలికి సమస్యను నివేదించడం, సైన్యం, ఆయుధాల సమీకరణ వంటి ప్రయత్నాలు వీటిలో కొన్ని. దీనికి తోడు రజాకార్ల హింస పెచ్చుమీరడంతో, హైదరాబాదు ప్రజలు కమ్యూనిస్టుల నాయకత్వంలో సాయుధ పోరాటం జరిపారు.

పరిస్థితి విషమిస్తున్న దశలో భారత ప్రభుత్వం 1948 సెప్టెంబరు 13 న పోలీసు చర్యకు దిగింది. భారత సైన్యం హైదరాబాదు ను ముట్టడించి, నిజామును ఓడించింది. 5 రోజుల్లో ముగిసిన పోలీసు చర్యతో సెప్టెంబరు 18 న హైదరాబాదు సంస్థానం భారత దేశంలో విలీనమయింది.

మేజర్‌ జనరల్‌ జె.ఎన్‌. చౌదరి హైదరాబాదు సైనిక గవర్నరుగా బాధ్యతలు స్వీకరించి, 1949 చివరి వరకు ఆ పదవిలో ఉన్నాడు. 1950 జనవరిలో ఎం.కె.వెల్లోడి ముఖ్యమంత్రి అయ్యాడు. నిజామును రాజ్‌ ప్రముఖ్‌ గా ప్రకటించారు. 1952 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మొదటి ఎన్నికైన ప్రభుత్వం బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి గా అధికారంలోకి వచ్చింది.

[మార్చు]విశాలాంధ్ర, ఆంధ్ర ప్రదేశ్

ప్రధాన వ్యాసం: పెద్దమనుషుల ఒప్పందం
ప్రధాన వ్యాసం: ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ
1953 డిసెంబరు‌ లో సయ్యద్‌ ఫజల్‌ ఆలీ నేతృత్వంలో రాష్ట్రాల పునర్విభజన కమిషను ఏర్పాటయింది. విశాలాంధ్ర ఏర్పాటు లోని ప్రయోజనాలను అది గుర్తించినా, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును అది సమర్థించింది. దీని నివేదికపై తెలంగాణా, విశాలాంధ్ర వాదులు తమతమ వాదనలను తీవ్రతరం చేసారు. కమ్యూనిస్టు లు తీవ్రంగా ప్రతిస్పందిస్తూ, హైదరాబాదు శాసనసభకు రాజీనామా చేసి, ఈ విషయంపై ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. హైదరాబాదు శాసనసభలో అధిక శాతం సభ్యులు విశాలాంధ్రను సమర్ధించారు.

కాంగ్రెసు అధిష్ఠానం కూడా విశాలాంధ్రనే సమర్థించి, ఆంధ్ర, తెలంగాణా నాయకులను తమ విభేదాలను పరిష్కరించుకొమ్మని ఒత్తిడి చేసింది. ఆ విధంగా వారిమధ్య పెద్దమనుషుల ఒప్పందం కుదిరి, 1956 నవంబరు 1 న ఆధికారికంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది.

భారత దేశ స్వాతంత్ర్యానంతరము


1947లో భారత దేశానికి ఆంగ్లేయుల నుండి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత నిజాము, హైదరాబాదు సంస్థానాన్ని తమ పాలనలోనే ఉంచుకోవటానికి ప్రయత్నించాడు. పోలీసు చర్యద్వారా హైదరాబాదు 1948 భారత దేశంలో విలీనమై, హైదరాబాదు రాష్ట్రంగా అవతరించింది.
మద్రాసు రాజధానిగా ఉండే ఆంధ్ర రాష్ట్రం కోసం అమరజీవి' పొట్టి శ్రీరాములు 58 రోజుల నిరాహార దీక్ష చేసి మరణించారు, కానీ కర్నూలును రాజధానిగా చేసి 1953 అక్టోబరు 1నమద్రాసు రాష్ట్రంలో ఉత్తరాన ఉన్న 11 జిల్లాలతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం చేశారు. గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేసారు. టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి.
తెలుగు ప్రజల కోరికపై 1956నవంబరు 1 న హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను ఆంధ్ర రాష్ట్రంలో కలిపి ఆంధ్ర ప్రదేశ్ ను ఏర్పాటు చేసారు. కొత్త రాష్ట్రానికి హైదరాబాదు రాజధానిగా అవతరించింది. ఈ విధంగా భాష ఆధారముగా ఏర్పడిన రాష్ట్రములలో ఆంధ్ర ప్రదేశ్ మొదటి రాష్ట్రము అయినది. నీలం సంజీవరెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి.
1960 వ సంవత్సరంలో పటాస్కర్ కమీషన్ తీర్పుమూలంగా చిత్తూరు జిల్లా తిరుత్తణి తాలూకాలోని ఎక్కువ భాగాన్ని తమిళనాడు కు ఇచ్చి, తమిళనాడుకు చెందిన తిరువళ్లూర్ తాలూకాలోని కొన్ని గ్రామాలను ఆంధ్ర ప్రదేశ్ లో చేర్చారు. ఆంధ్ర ప్రదేశ్ ఆవిర్భవించినప్పుడు 20 జిల్లాలే ఉన్నాయి. తరువాత, 1970ఫిబ్రవరి 2న ప్రకాశం జిల్లా, 1978 ఆగష్టు 12నరంగారెడ్డి జిల్లా1979 జూన్ 1న విజయనగరం జిల్లాలు ఏర్పడడంతో మొత్తం 23 జిల్లాలయ్యాయి

రాజకీయాలు

నీలం సంజీవరెడ్డి ఆంధ్ర ప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రి1982 వరకు అన్నీ కాంగ్రెసు ప్రభుత్వాలే ఆంధ్ర ప్రదేశ్ ను పరిపాలించాయి. 1982 వరకు కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలము పనిచేశాడు. ఆయన తరువాత పి.వి.నరసింహారావు ముఖ్యమంత్రిగా కొంతకాలం పనిచేసారు. తరువాతి కాలంలో ఆయన భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేసారు.
అయితే 1982 వరకు రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెసుకు ఉన్న బలాన్ని సవాలు చేయటానికి నందమూరి తారక రామారావు అదే సంవత్సరములో తెలుగుదేశం అనే పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించాడు. స్థాపించిన తొమ్మిది నెలలలోనే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారపగ్గాలు చేపట్టడంతో ఒక బుడతడి దెబ్బకు వస్తాదు కుప్పకూలినట్లయింది.
2004 అసెంబ్లీ ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెసుతెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉధృతంగా పోరాడుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో కలిసి పోటీ చేసింది. కాంగ్రెసు, తెరాస కూటమి పదవిలోకి రావడంతో, కాంగ్రెసుకు చెందిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు. ఐదేళ్ళ అనతరం 2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీచేయగా, తెలుగుదేశం పార్టీ, తెరాస, ఉభయ కమ్యూనిష్టు పార్టీలు కలిసి మహాకూటమి తరఫున పోటీచేశాయి. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ, భాజపాలు కూడా పోటీచేయడంతో బహుముఖ పోటీలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ సొంతంగా మెజారిటీ స్థానాలు సంపాదించి వరుసగా రెండోసారి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు.సెప్టెంబరు 22009న రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 14 నెలలు పాలించిన తరువాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా మార్చడం జరిగింది .

భౌగోళిక పరిస్థితి

ఆంధ్ర ప్రదేశ్ లో మూడు ముఖ్య ప్రాంతములు కలవు: కోస్తా ఆంధ్ర, తెలంగాణ మరియు రాయలసీమ. రాష్ట్రములో 23 జిల్లాలు కలవు. హైదరాబాదు, రాష్ట్ర రాజధాని మరియు అతి పెద్ద నగరము. ఇతర ముఖ్య నగరాలు విశాఖపట్నం,విజయవాడ,కాకినాడఏలూరు,రాజమండ్రి,తిరుపతి,కర్నూలునెల్లూరువరంగల్లుగుంటూరు మఛిలీపట్నం. .గోదావరికృష్ణ వంటి మహానదులు రాష్టంలో ప్రవహిస్తూ కొన్ని లక్షల హెక్టేరుల భూమి సాగు చేయుటకు తోడ్పడుతున్నాయి.


రాష్ట్ర ప్రభుత్వము మరియు కార్య నిర్వహణ వ్యవస్థ

ప్రధాన వ్యాసం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అధినేత ముఖ్యమంత్రి కాగా, రాష్ట్ర పరిపాలన గవర్నరు పేరున జరుగుతుంది. ఆంధ్ర ప్రదేశ్శాసనసభ (దిగువ సభ) లో 294 స్థానాలు, విధాన మండలి (ఎగువ సభ)లో 90[1] స్థానాలు ఉన్నాయి.దీనికి తోడు, ఆంగ్లో-ఇండియన్ వర్గం నుంచి ఒకరిని శాసన సభకు నామినేటు చేస్తారు.ఆ రకంగా శాసన సభ లో సభ్యుల సంఖ్య 295. ఆంధ్ర ప్రదేశ్ కు పార్లమెంటులో 60 స్థానాలు కలవు (లోక్ సభ లో 42 మరియు రాజ్య సభలో 18). ఈ-ప్రభుత్వపాలన ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించటానికి ఆంధ్రప్రదేశ్ అంతర్జాలంలో గవాక్షాన్ని కలిగివుంది. దీనినిఎపి ఆన్లైన్అంటారు. దీనిలో ఇంగ్లీషు, తెలుగులలో, ప్రభుత్వ సమాచారాన్నిపొందుపరిచారు. శాఖలు పోలీస్
కృష్ణా గోదావరి నదులు (ఉపగ్రహ ఛాయాచిత్రం)

జిల్లాలు

ప్రధాన వ్యాసం: ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు
1956 లో 20 జిల్లాలతో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడింది.తరువాత 1970 లో ప్రకాశం జిల్లా, 1978లో రంగారెడ్డి జిల్లా, 1979 లో విజయనగరం జిల్లా ఏర్పడ్డాయి.ప్రస్తుతం 23 జిల్లాలున్నాయి.

రాష్ట్ర గుర్తులు

విభాగంపేరుబొమ్మ(అనుకూలమైతే)
రాష్ట్ర భాషతెలుగు
రాష్ట్ర గుర్తుపూర్ణకుంభం
రాష్ట్ర గీతంమా తెలుగు తల్లికి మల్లె పూదండ
రాష్ట్ర జంతువుకృష్ణ జింకBlackbuck (Antilope cervicapra)- Male & female in Hyderabad, AP W IMG 7268.jpg
రాష్ట్ర పక్షిపాలపిట్టBlue Jay-27527-2.jpg
రాష్ట్ర వృక్షంవేప చెట్టుNeemtree.jpg
రాష్ట్ర ఆటచెడుగుడుKabaddi in villages.jpg
రాష్ట్ర నృత్యంకూచిపూడిAn.JPG
రాష్ట్ర పుష్పముకలువ పువ్వుWaterlily.jpg
రాష్ట్ర జల చరముడాల్ఫిన్Comdolph.jpg

ఆర్ధిక రంగము

రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు వ్యవసాయం ఆయువుపట్టు. భారత దేశములోని రెండు ప్రధాన నదులు, గోదావరి మరియు కృష్ణ రాష్ట్రం గుండా ప్రవహిస్తాయి. వరిపొగాకుప్రత్తిమిర్చి, మరియు చెరుకు రాష్ట్రంలో పండించే ముఖ్యమైన పంటలు. ఇటీవల ఆంధ్ర ప్రదేశ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు బయోటెక్నాలజీ రంగాల్లో కొత్తపుంతలు తొక్కుతున్నది.


భాష-సంస్కృతి


తెలుగు రాష్ట్ర అధికార భాష. ఉర్దూ మాట్లాడే ముస్లింలు ఎక్కువగా హైదరాబాదులో ఉన్నారు. కవిత్రయమని పేరుగన్న నన్నయతిక్కనఎర్రాప్రగడ మహా భారత కావ్యాన్ని తెలుగులోకి అనువదించారు. మహా భాగవతమును బమ్మెర పోతన అనువదించాడు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు విశ్వనాథ సత్యనారాయణడా.సి.నారాయణరెడ్డి మొదలైనవారు తెలుగులో ఆధునిక రచయితలు. ఆంధ్రప్రదేశ్ కు గొప్ప సాంస్కృతిక వారసత్వము కలదు. అన్నమాచార్యత్యాగరాజు,రామదాసు తదితర గొప్ప కర్ణాటక సంగీతకారులు తెలుగు భాషలో కృతులు రచించి, భాషను సుసంపన్నం చేశారు. కూచిపూడి రాష్ట్ర శాస్త్రీయ నృత్యం. అలాగే నటరాజ రామకృష్ణ గారి కృషి వల్ల ఆంధ్రనాట్యం కూడా ప్రజాదరణ పొందింది.
ఆంధ్రులు గత 70 సంవత్సరాలుగా సినిమాను విపరీతముగా పెంచి పోషించారు. రాష్ట్రంలో సంవత్సరానికి సుమారు 130 సినిమాలు రూపొందుతాయి. ఆదాయపరంగా తెలుగు సినిమా ఒక పెద్ద పరిశ్రమ, కానీ తక్కిన భారత దేశములో పెద్దగా గుర్తింపు పొందలేదు. రాష్ట్రం నుండి ఉద్భవించిన కొందరు ప్రముఖ సినీ కళాకారులు నాగయ్యఎన్.టి.రామారావు(మాజీ ముఖ్యమంత్రి), అక్కినేని నాగేశ్వరరావు ("ఏ.ఎన్.ఆర్"), దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత), ఎస్.వి.రంగారావు ("ఎస్.వి.అర్) జగ్గయ్యచిరంజీవిఘంటసాల ]]ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంసుశీల జానకి సావిత్రిభానుమతి అంజలి జమునశారదషావుకారు జానకివాణిశ్రీ జయప్రద యల్.వి.ప్రసాద్ కె.వి.రెడ్డి బి.యన్.రెడ్డి బి.నాగిరెడ్డి బాపువిశ్వనాథ్ మొదలైనవారు.
ఆంధ్ర ప్రదేశ్ లో పలు సంగ్రహాలయాలు (మ్యూజియం) కలవు, అందులో సాలార్ జంగ్ మ్యూజియంపురావస్తుశాఖ మ్యూజియం ముఖ్యమైనవి. వీనిలో పలు శిల్పాలు, చిత్రాలు, హిందూ మరియు బౌద్ధ మత శిల్పాలు, కళాఖండాల సేకరణలు ప్రదర్శంచబడినవి. ఈ రెండు సంగ్రహాలయాలు హైదరాబాదులో ఉన్నాయి.

విద్యారంగము


ప్రధాన వ్యాసం: ఆంధ్ర ప్రదేశ్ లో విద్య
ఆంధ్రప్రదేశ్ లో విద్యా నిర్వహణ ప్రభుత్వ శాఖలద్వారా జరుగుతుంది.
  1. పాఠశాల విద్యాశాఖ[2] (సర్వ శిక్షా అభియాన్[3]
  2. ఇంటర్ మీడియట్ విద్యా మండలి[4]
  3. సాంకేతిక విద్యా మండలి[5]
  4. ఉన్నత విద్యా పరిషత్ [6]

పర్యాటక రంగము

ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి,భద్రాచలముద్వారక తిరుమల,శ్రీశైలంశ్రీ కాళహస్తిసింహాచలముఅన్నవరంఅహొబిలముయాదగిరి గుట్టవేములవాడ , మహానందికానిపాకం,బసర్,విజయవాడ ‍‍‍మొదలైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. తిరుపతి లోని తిరుమల తిరుపతి దేవస్థానము ప్రపంచములోకెల్లా ఐశ్వర్యవంతమైన హిందూ దేవాలయము. వరంగల్నగరమునందలి వేయిస్తంభాల దేవాలయమురామప్ప దేవాలయము కాకతీయుల కాలమునాటి శిల్పకళకు నిదర్శనాలుగా నిలుస్తున్నాయి.దక్షిణ భారత దేశంలో ఎకైక మందిరముబాసర లొ జ్ఞాన సరస్వతి మాతా మందిరము కలదు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక అభివృద్ధి సంస్థ [7]రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధికి ముఖ్య పాత్ర వహిస్తున్నది.


ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు

నేపథ్యం


బ్రిటిషు పరిపాలనా కాలంలో ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్‌ వివిధ ప్రాంతాల ఏలుబడిలో ఉండేది. తెలంగాణా ప్రాంతం ఇప్పటి కర్ణాటకమహారాష్ట్రలలోని కొన్ని ప్రాంతాలతో కలిసి నిజాము పాలనలో ఉండేది. కోస్తారాయలసీమ ప్రాంతాలు మద్రాసు ప్రెసిడెన్సీ లో భాగంగా, బ్రిటిషు వారి అధికారంలో ఉండేది.

మద్రాసు ప్రెసిడెన్సీలో కింది జిల్లాలు ఉండేవి.

మద్రాసు ప్రెసిడెన్సీలో తమిళుల ప్రాబల్యం అధికంగా ఉండేది. జనాభాలోను, విస్తీర్ణంలోను ఆంధ్ర ప్రాంతమే హెచ్చుగా ఉన్నప్ప్పటికీ, పరిపాలనలోను, ఆర్ధిక వ్యవస్థ లోను తమిళుల ఆధిపత్యం సాగేది. సహజంగానే, ఆంధ్రులలో అభద్రతా భావం కలిగింది. తమకంటూ ప్రత్యేక రాష్ట్రం ఉంటేనే, రాజకీయంగాను, ఆర్ధికంగాను గుర్తింపు లభిస్తుందని వారు ఆశించారు. తెలుగు మాట్లాడే వారందరికీ ప్రత్యేక రాష్ట్రం – విశాలాంధ్ర - కావాలనే కోరిక తలెత్తి క్రమంగా బలపడసాగింది

అంకురార్పణ


మొట్టమొదటి సారిగా ప్రత్యేక రాష్ట్ర ప్రతిపాదన అధికారికంగా 1912 మే లో నిడదవోలు లో జరిగిన గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లా నాయకుల సదస్సులో వచ్చింది. అయితే ఎటువంటి తీర్మానాన్ని ఆమోదించకుండానే సభ ముగిసింది. ఆన్ని తెలుగు జిల్లాల ప్రతినిధులతో ఏర్పాటైన సమావేశంలో మాత్రమే తీర్మానం చెయ్యాలని నిర్ణయించి తీర్మానాన్ని వాయిద వేసారు.

నిడదవోలు సభలో నిర్ణయించిన ప్రకారం 1913 మే 20న గుంటూరు జిల్లా బాపట్లలో సమగ్ర ఆంధ్ర మహాసభను నిర్వహించారు. ప్రత్యేకాంధ్రపై విస్తృతంగా చర్చ జరిగింది. అయితే రాయలసీమ, గంజాము, విశాఖపట్నం లకు చెందిన ప్రతినిధులు ప్రత్యేకాంధ్ర ప్రతిపాదనకు అంత సుముఖత చూపలేదు. తరువాతి రోజుల్లో పట్టాభి సీతారామయ్య ఈ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజాభిప్రాయాన్ని కూడగట్టాడు. ఆంధ్రోద్యమానికి శ్రీకారం చుట్టారు.

ఆ తరువాత జరిగిన సభల్లో కూడా ప్రత్యేక రాష్ట్రం గురించిన చర్చలు జరిగాయి. రెండవ ఆంధ్ర మహాసభ 1914లో విజయవాడ లో జరిగింది. ఆ సభలో ప్రత్యేకాంధ్ర రాష్ట్రం కావాలని అత్యధిక మద్దతుతో ఒక తీర్మానం చేసారు. కాకినాడలో జరిగిన నాలుగవ ఆంధ్ర మహాసభలో భోగరాజు పట్టాభి సీతారామయ్యకొండా వెంకటప్పయ్య కలిసి భారత రాష్ట్రాల పునర్ణిర్మాణం పేరిట ఒక కరపత్రాన్ని తయారుచేసారు. దీన్ని దేశవ్యాప్తంగా కాంగ్రెసు వాదులకు పంచిపెట్టారు

కాంగ్రెసుకు చేరిన ఉద్యమం

1914లో మద్రాసులో జరిగిన భారత జాతీయ కాంగ్రెసు సమావేశంలో మొదటి సారిగా ప్రత్యేకాంధ్ర ప్రస్తావన వచ్చింది. ఆంధ్ర ప్రాంతానికి ప్రత్యేక కాంగ్రెసు విభాగం ఉంటే, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని భావించి, దాని గురించి తమ వాదనను వినిపించి, దానిపై అభిప్రాయాన్ని కూడగట్టగలిగారు. ఈ సభతో ప్రత్యేకాంధ్ర ఉద్యమం ఆంధ్ర మహాసభ నుండి, కాంగ్రెసు పార్టీ సభలోకి చేరింది. అయితే ఈ ప్రతిపాదన కాంగ్రెసు పరిశీలనకు వచ్చినా, దానిపై నిర్ణయం తీసుకోడానికి మరో నాలుగేళ్ళు పట్టింది. కాంగ్రెసు పెద్దల వ్యతిరేకతను అధిగమించి, 1918 జనవరి 22 న ఆంధ్రకు ప్రత్యేకంగా కాంగ్రెసు విభాగాన్ని ఏర్పాటు చేయించడంలో ఆంధ్ర నాయకులు కృతకృత్యులయ్యారు



చట్ట సభల్లో చర్చ


1918లో ప్రత్యేకాంధ్రోద్యమం మరో మెట్టెక్కింది. ఫిబ్రవరి 6 న మద్రాసు శాసనసభలో భాష ప్రాతిపదికన ప్రత్యేక రాష్ట్ర స్థాపన గురించి బి ఎన్‌ శర్మ ఒక ప్రతిపాదన ప్రవేశపెట్టాడు. ఆ ప్రతిపాదన ఇది:

The redistribution of provincial areas on a language basis wherever... and to the extent possible, especially where the people speaking a distinct language and sufficiently large in number desire such a change

విభజించు, పాలించు అనే బ్రిటిషు వారికి భాష ప్రాతిపదికపై ప్రజలు ఏకమవడం సహజంగానే రుచించక, ఆ ప్రతిపాదన వీగిపోయింది

ఆంధ్రుల్లో అనైక్యత


అయితే, ప్రత్యేకాంధ్ర ఉద్యమానికి అన్ని ప్రాంతాల వాళ్ళూ కలిసి రాలేదు. అభ్వృద్ధి విషయంలో కోస్తా జిల్లాల కంటే వెనకబడి ఉన్న రాయలసీమ ప్రాంతం ప్రత్యేకాంధ్ర మరింత వెనకబడి పోతుందనే ఉద్దేశ్యంతో, తమకూ ప్రత్యేక కాంగ్రెసు విభాగం కావాలనే ప్రతిపాదనను 1924 లో రాయలసీమ నాయకులు లేవదీసారు.

ఈ అపోహలకు, అనుమానాలకు తెరదించుతూ ,november 16,1937 లో చారిత్రాత్మకమైన శ్రీబాగ్‌ ఒడంబడిక కుదిరింది. కోస్తా, రాయలసీమ నాయకుల మధ్య మద్రాసులో కుదిరిన ఈ ఒప్పందంతో రాయలసీమ నాయకులు సంతృప్తి చెందారు. ప్రత్యేకంధ్ర ఏర్పడితే, రాయలసీమకు ఎటువంటి ప్రత్యేకతలు ఉండాలనేదే ఈ ఒడంబడికలోని ముఖ్యాంశాలు.

1939 లో కృష్ణా జిల్లా కొండపల్లిలో జరిగిన సభలో ప్రత్యేకాంధ్ర కోరుతున్న అన్ని సంస్థలూ విలీనమై ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ సంఘం గా ఏర్పడ్డాయి. 1939 అక్టోబర్‌ కల్లా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయ్యేలా ప్రయత్నించాలని ఆంధ్ర శాసనసభ్యులను కోరింది.


స్వాతంత్ర్యం తరువాత


1947 ఆగష్టు 15న స్వాతంత్ర్యం వచ్చినపుడు, తమ చిరకాల వాంఛ తీరుతుందని ఆశించారు. అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూకు, ఉప ప్రధాని వల్లభ్‌భాయి పటేల్‌కు ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకపోయింది.
భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుపై కేంద్రప్రభుత్వం ఎస్‌.కె.దార్‌ నేతృత్వంలో ఏర్పాటు చేసిన భాషాప్రయుక్త రాష్ట్రాల కమిషను ఏర్పాటు చేసింది. ఆంధ్ర మహాసభ తమ విజ్ఞప్తిని కమిషనుకు అందజేసింది. ఇక్కడ ఆంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య గల విభేదాలు మళ్ళీ బహిర్గతమయ్యాయి. నీలం సంజీవరెడ్డి నాయకత్వం లోని రాయలసీమ నాయకులు సమర్పించిన విజ్ఞాపనలో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును వాయిదా వెయ్యాలని కోరుతూ, ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు చెయ్యాలని కోరింది. ఆంధ్రులలోని అనైక్యతను గమనించిన కమిషను భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును వ్యతిరేకించింది. ఈ కమిషను నివేదికతో ఆందోళన చెందిన ఆంధ్రులను బుజ్జగించడానికి కాంగ్రెసు పార్టీ నాయకులు, నెహ్రూ, పటేల్‌, భోగరాజు పట్టాభి సీతారమయ్య లతో ఒక అనధికార సంఘాన్ని ఏర్పాటు చేసింది. జె.వి.పి కమిటీగా పేరొందిన ఈ సంఘం 1949 ఏప్రిల్‌లో కాంగ్రెసు వర్కింగు కమిటీకి కింది సూచనలు చేసింది.

  • భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును కొన్నేళ్ళు వాయిదా వెయ్యాలి.
  • కాని ఆంధ్ర రాష్ట్రాన్ని మాత్రం ఏర్పాటు చయ్యాలి – అయితే ఒక నిబంధన మీద..
  • నిబంధన: మద్రాసును ఆంధ్రులు వదులుకోవాలి
మద్రాసును వదులుకొనేందుకు ఇష్టపడని ఆంధ్రుల్లో ఈ నివేదిక అలజడి సృష్టించింది. ఈ పరిస్థితుల మధ్య అప్పటి మద్రాసు ముఖ్యమంత్రి, కుమారస్వామి రాజా నాయకత్వంలో ఒక విభజన సంఘం ఏర్పాటయింది. ఆంధ్రుల తరపున టంగుటూరి ప్రకాశం పంతులుబెజవాడ గోపాలరెడ్డికళా వెంకటరావునీలం సంజీవరెడ్డి ఈ సంఘంలో సభ్యులు. ఈ సంఘం ఒక నిర్దుష్ట ఒప్పందానికి రాలేకపోయింది. ప్రకాశం మిగిలిన సభ్యులతో విభేదించి, అసమ్మతి లేవనెత్తాడు. ఆయన అసమ్మతిని అవకాశంగా తీసుకొని కేంద్రప్రభుత్వం మొత్తం వ్యవహారాన్నే అటకెక్కించింది.

దీనితో అసంతృప్తి చెందిన ప్రముఖ గాంధేయవాది, స్వామి సీతారాం (గొల్లపూడి సీతారామశాస్త్రి) ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొన్నాడు. దీంతో ఉద్రిక్త భరిత వాతావరణం ఏర్పడింది. 35 రోజుల తరువాత, 1951 సెప్టెంబర్ 20న ఆచార్య వినోబా భావే అభ్యర్ధనపై ఆయన తన దీక్షను విరమించాడు. ఈ దీక్ష, ప్రజల్లో తమ నాయకుల పట్ల, కేంద్రప్రభుత్వం పట్ల అపనమ్మకం పెంచడం మినహా మరేమీ సాధించలేక పోయింది.

కృష్ణా-పెన్నా ప్రాజెక్టు వివాదం



1952లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికలలో, కాంగ్రెసును ఓదించి, ఆంధ్రులు వారిపై గల తమ అసంతృప్తి వెలిబుచ్చారు. మద్రాసు శాసనసభ లో ఆంధ్ర ప్రాంతం నుండి ఉన్న 140 స్థానాలలో కాంగ్రెసు 43 మాత్రమే పొందగా, కమ్యూనిస్టులు పోటీ చేసిన 60 స్థాల్లోను 40 ని గెలుచుకున్నారు. మొత్తం శాసనసభలో కాంగ్రెసు బలం 152 కాగా, కాంగ్రెసేతర సభ్యులు 164 మంది. వీరంతా ఐక్య ప్రజాస్వామ్య ఫ్రంటు గా ఏర్పడి టంగుటూరి ప్రకాశాన్ని తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. అయితే అప్పటి గవర్నరు, రాజాజీ ని శాసన మండలికి నామినేట్‌ చేసి, మంత్రివర్గ ఏర్పాటుకు ఆయనను ఆహ్వానించాడు.

రాజాజీ ముఖ్యమంత్రి అయ్యాక, కృష్ణా-పెన్నా ప్రాజెక్టు కట్టి, కృష్ణా నీళ్ళను తమిళ ప్రాంతాలకు మళ్ళించే ఆలోచన చేసాడు. ఆ ప్రాజెక్టు కడితే తమ నోట మన్నే అని గ్రహించిన ఆంధ్రులు ఆందోళన చేసారు. సమస్య పరిశీలనకై కేంద్రప్రభుత్వం ఎ.ఎన్‌ ఖోస్లా నాయకత్వంలో ఒక నిపుణుల సంఘాన్ని నియమించింది. ప్రాజెక్టును ప్రతిపాదిత స్థలంలో కట్టకూడదనీ, నందికొండ (ఇప్పటి నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఉన్న ప్రదేశం) వద్ద కట్టాలనీ ఈ కమిటీ సూచించింది. రాజాజీ ప్రభుత్వం తమపై సవతి ప్రేమ చూపిస్తున్నదనే ఆంధ్రుల భావన మరింత బలపడింది. మద్రాసు రాష్ట్రం నుండి వేరు పడాలనే ఆంధ్రుల భావన మరింత బలపడసాగింది.

పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం


ఈ సమయంలో 1952 అక్టోబర్ 19న పొట్టి శ్రీరాములు అనే గాంధేయవాది, మద్రాసు రాజధానిగా ఉండే ప్రత్యేకాంధ్ర సాధనకై మద్రాసులో ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించాడు."మద్రాసులేని ఆంధ్ర తలలేని మొండెం" అన్నాడు. ఈ దీక్ష ఆంధ్ర అంతటా కలకలం రేపినా, కాంగ్రెసు నాయకులు, కేంద్రప్రభుత్వంలో మాత్రం చలనం రాలేదు. 1952 డిసెంబర్ 15న58 రోజుల అకుంఠిత దీక్ష తరువాత పొట్టి శ్రీరాములు అమరజీవి అయ్యాడు. ఆయన మృతి ఆంధ్రుల్లో క్రోధాగ్ని రగిలించి, హింసాత్మక ఆందోళనకు దారితీసింది. ప్రజల్లో అనూహ్యంగా వచ్చిన ఈ స్పందనను గమనించిన నెహ్రూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా లోక్‌సభలో 1952 డిసెంబర్ 19న ప్రకటించాడు. 11 జిల్లాలు, బళ్ళారి జిల్లాలోని 3 తాలూకాలు ఇందులో భాగంగా ఉంటాయి.

శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలు, బళ్ళారి జిల్లాలోని రాయదుర్గం, ఆదోని, ఆలూరు తాలుకాలు కలిపి 1953 అక్టోబర్ 1నఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. బళ్ళారి జిల్లాలోని బళ్ళారి తాలూకా ఎల్‌.ఎస్‌ మిశ్రా సంఘం నివేదిక ననుసరించి మైసూరు రాష్ట్రంలో కలిపేసారు.

1937 నాటి శ్రీబాగ్‌ ఒడంబడిక ననుసరించి కొత్త రాష్ట్రానికి కర్నూలు ముఖ్యపట్టణం అయింది. టంగుటూరి ప్రకాశంముఖ్యమంత్రి అయ్యాడు. సి.ఎం.త్రివేది గవర్నరు అయ్యాడు. నెహ్రూ చేతుల మీదుగా జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో ఆంధ్రుల చిరకాల స్వప్నం  ఫలించింది.










హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు

హైదరాబాదు పోలీసు చర్య (ఆపరేషన్ పోలో)


1946 1948ల మధ్య హైదరాబాదు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల పట్ల ఆంధ్రులు కలత చెందారు. హైదరాబాదుకు స్వతంత్ర ప్రతిపత్తి కావాలని ఆసిస్తూ, దాన్ని ప్రత్యేక దేశంగా గుర్తించాలని నిజాము ప్రతిపాదించాడు. ఇత్తెహాదుల్‌ ముస్లిమీను, దాని సైనిక విభాగమైన రజాకార్ల కు చెందిన ఖాసిం రజ్వి ద్వారా దీన్ని సాధించాలని నిజాము ప్రయత్నించాడు.

రాష్ట్రానికి చెందిన అధిక శాతం ప్రజలు భారతదేశంలో కలిసిపోవాలని ఉద్యమం మొదలుపెట్టారు. స్వామి రామానంద తీర్థ నాయకత్వంలో కాంగ్రెసు నాయకులు ఉద్యమంలో పాలుపంచుకునారు. రాష్ట్ర కాంగ్రెసును నిజాము నిషేధించడం చేత, ఈ నాయకులు విజయవాడ, బొంబాయి వంటి ప్రదేశాల నుండి ఉద్యమాన్ని నడిపించారు. రజాకార్ల దాడులను ఎదుర్కోడానికి కమ్యూనిస్టులు గ్రామ రక్షక దళాలను ఏర్పాటు చేసారు.

భారత ప్రభుత్వానికి, నిజాముకు మధ్య జరిగిన అన్ని చర్చలూ విఫలమయ్యాయి. భారత దేశంలో విలీనానికి నిజాము అంగీకరించలేదు. మజ్లిస్‌ ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ మరియు రాజాకార్ల కార్య కలాపాలు శాంతికి, సామరస్యానికి భంగకరంగా తయారయ్యాయి. వాస్తవ పరిస్థితిని నిజాముకు అర్ధమయ్యేలా చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించి,1947 నవంబర్‌ 29న యథాతథ స్థితి ఒప్పందం కుదిరింది. 1947 ఆగష్టు 15కు పూర్వపు పరిస్థితికి ఒక సంవత్సరం పాటు కట్టుబడి ఉండాలనేది ఈ ఒప్పంద సారాంశం. ఒప్పందంలో భాగంగా హైదరాబాదులో భారత్ తరపున ఏజంట్ జనరల్‌గా కె.ఎం.మున్షీ నియమితుడయ్యాడు. విదేశాల్లో ఆయుధాలు కొనుగోలు చేసి, హైదరాబాదుకు దొంగతనంగా తరలించే సమయం పొందడమే ఈ ఒప్పందంతో నిజాము ఉద్దేశ్యం. ఈలోగా పరిస్థితిని ఐక్యరాజ్యసమితి యొక్క భద్రతా సమితికి నివేదించడానికి నిజాము ఒక బృందాన్ని పంపించాడు.

1948 ఆగష్టు 9 న టైంస్‌ ఆఫ్‌ లండన్‌ లో వచ్చిన వార్త ప్రకారం హైదరాబాదు 40,000 సైన్యాన్ని, ఆయుధాలను సమకూర్చుకుంది. హైదరాబాదు ప్రధాన మంత్రి లాయిక్‌ ఆలీ ఇలా అన్నాడు భారత ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి లక్ష మందితో సైన్యం సిద్ధంగా ఉంది, బొంబాయిపై బాంబులు వెయ్యడానికి సౌదీ అరేబియా కూడా సిద్ధంగా ఉంది

నిజాము చేపట్టిన ఈ చర్యలకు తోడు రజాకార్ల హింస, హైదరాబాదుపై పోలీసు చర్యకు కేంద్ర ప్రభుత్వం నడుం కట్టింది. 1948 సెప్టెంబర్ 13న హైదరాబాదుపై పోలీసు చర్య మొదలైంది. దీనికి ఆపరేషన్ పోలో అని పేరు పెట్టారు. మేజర్‌ జనరల్‌ జె.ఎన్‌. చౌదరి నాయకత్వంలో భారత సైన్యం మూడు వైపుల నుండి హైదరాబాదును ముట్టడించింది. 1948సెప్టెంబర్ 18న నిజాము లొంగిపోయాడు. పోలీసు చర్య ఐదు రోజుల్లో ముగిసింది. 1373 మంది రజాకార్లు హతమయ్యారు. మరో 1911 మంది బందీలుగా పట్టుబడ్డారు. హైదరాబాదు సైన్యంలో 807 మంది చనిపోగా, 1647 మంది పట్టుబడ్డారు. భారత సైన్యం 10 మంది సైనికులను కోల్పోయింది. ఆతని ప్రధానమంత్రి మీర్‌ లాయిక్‌ ఆలీ, రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ అరెస్టయ్యారు. తరువాత ఖాసిం రిజ్వీ కొన్నాళ్ళు భారత దేశంలో జైలు జీవితం గడిపి, విడుదలయ్యాక, పాకిస్తాను వెళ్ళి స్థిరపడ్డాడు. కొన్నాళ్ళకు అక్కడే అనామకుడిలా మరణించాడు.

సెప్టెంబర్ 23న భద్రతా సమితిలో తన ఫిర్యాదును నిజాము ఉపసంహరించుకున్నాడు. హైదరాబాదు భారతదేశంలో విలీనం అయినట్లుగా ప్రకటించారు. మేజర్‌ జనరల్‌ జె.ఎన్‌. చౌదరిహైదరాబాదు సైనిక గవర్నరుగా బాధ్యతలు స్వీకరించి, 1949 చివరి వరకు ఆ పదవిలో ఉన్నారు.

ప్రజాప్రభుత్వ ఏర్పాటు

1950 జనవరిలో ఎం.కె.వెల్లోడి అనే సీనియరు ప్రభుత్వ అధికారిని ముఖ్యమంత్రిగా నియమించి, నిజామును రాజ్‌ ప్రముఖ్‌ గా ప్రకటించారు. 1952 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మొదటి ఎన్నికైన ప్రభుత్వం బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చింది.


తెలంగాణా సాయుధ పోరాటం


తెలంగాణా సాయుధ పోరాటం 1946-51 మధ్యన కమ్యూనిస్టుల నాయకత్వంలో ఏడవ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కు వ్యతిరేకంగా జరిగింది.ఈ పోరాటంలో నాలుగున్నర వేల మంది తెలంగాణ ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారు.హైదరాబాద్‌ స్టేట్‌లో అంతర్భాగంగా తెలంగాణ ప్రాంతం బ్రిటిష్‌ పాలనతో ఎలాంటి సంబంధం లేకుండా ఆసఫ్‌ జాహీల పాలనలో ఉంది.నిజాం హాలీ సిక్కా, ఇండియా రూపాయి రెండూ వేర్వేరు.1948లో కలకత్తాలో అలభారత కమ్యూ నిస్టు పార్టీ మహాసభ "సంస్థానాలను చేర్చుకోవడానికి ఒత్తిడి చేసే అధికారం యూనియన్‌ ప్రభుత్వానికి లేదు' అని తీర్మానించింది.మఖ్దుం మొహియుద్దీన్‌ సహా మరో ఐదుగురు కమ్యూనిస్టు నాయకులపై ఉన్న వారంట్లను నిజాం ప్రభుత్వం ఎత్తివేసింది.కమ్యూనిస్టు పార్టీ మీద ఉన్న నిషేధాన్ని తొలగించింది. హైదరాబాద్‌ రాజ్యం స్వతంత్రంగా ఉండాలని, అదే కమ్యూనిస్టు పార్టీ విధానమని రాజబహదూర్‌ గౌర్‌ప్రకటించారు.ఖాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లు,దేశ్ ముఖ్ లు,జమీందారులు,దొరలు గ్రామాలపై పడి నానా అరాచకాలు సృష్టించారు.ఫలితంగా ఆనాటి నుంచి కమ్యూనిస్టుల వైఖరిలో మార్పు వచ్చింది.రజాకార్‌ సైన్యాన్ని ప్రజాసైన్యంగా అభివర్ణించిన కమ్యూనిస్టులు సాయుధ పోరాటాన్ని ప్రారంభించారు.[1]


పుట్టు పూర్వోత్తరాలు


మొదట నల్లగొండ జిల్లాలో పుట్టిన సాయుధ విప్లవం త్వర త్వరగా వరంగల్బీదర్ జిల్లాలకు వ్యాపించింది. రైతులు, రైతు కూలీలు నిజాం నవాబుకు, ప్రాంతీయ ఫ్యూడల్ జమీందారులకు వ్యతిరేకంగా సాహసోపేతమైన పోరాటం చేసారు. వారి పోరాటం వెట్టి చాకిరి కి వ్యతిరేకంగా మొదలైంది. అయితే వెట్టి చాకిరీ నుంచి విముక్తి చేయడానికి ఆనాటి రాజులు, జమీందారులు సిద్ధంగా లేరు.
మన కొంపలార్చిన, మన స్త్రీల చెరచిన,
మన పిల్లలను చంపి మనల బంధించిన
మానవాధములను మండలాధీశులను
కండ కండగ కోసి కాకులకు వెయ్యాలె,
కాలంబు రాగానే కాటేసి తీరాలె” -- కాళోజీ

పోరాట ఉధృతి

అదే సమయంలో నిజాం నవాబు హైదరాబాద్ రాజ్యాన్ని భారత దేశంలో విలీనం చేసే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. భారత ప్రభుత్వం సెప్టెంబరు 1948 లో నిజాం పైకి తన సైన్యాన్ని పంపింది. అయితే కమ్యూనిస్టుల నాయకత్వంలో గెరిల్లా యుద్ధ తంత్రంతో 3000 లకు పైగా గ్రామాలను విముక్తం కాబడ్డాయి. ఈ ప్రాంతంలోని జమీందారులను దొరికిన వారిని దొరికినట్టుగా చంపి వేసారు. చావగా మిగిలిన వారు పారి పోయారు. విముక్తి చేయ బడిన గ్రామాల్లో సోవియట్ యూనియన్ తరహా కమ్యూన్లు ఏర్పరచారు. ఈ కమ్యూన్లు కేంద్ర నాయకత్వం క్రింద పని చేసేవి. ఈ పోరాటానికి 'ఆంధ్ర మహాసభ' పేరుతో భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం వహించింది. ఈ పోరాటానికి నాయకత్వం వహిచిన వారిలోమగ్దూం మొహియుద్దీన్రావి నారాయణరెడ్డిఆరుట్ల రామచంద్రారెడ్డి మరియు హసన్ నాసిర్ లు ముఖ్యులు


వరవరరావు వాదన

రజాకారు సేన ను తయారు చేసి మత విద్వేషాన్ని రెచ్చగొట్టి, దాడులు, హత్యలు, హత్యచారాలు నిర్వహించిన వాడు కాశీం రజ్వీ. ప్రోత్సాహించినవాడు మీర్ ఉస్మాన్ అలీఖాన్. 1947 ఆగస్టు15 నుంచి 1948 సెప్టెంబర్ 17 వరకు ఈ రాజాకార్లకు గ్రామాల్లో దొరలు, పెత్తందార్లు నాయకత్వం వహించారు.ఈ దొరలు, పెత్తం దార్లు 17 సెప్టెంబర్ 1948 దాకా షేర్వానిలు, చుడేదార్ పైజామా లు వేసుకుని కుచ్చుటోపీలు పెట్టుకొని నైజాం సేవ చేశారు. 1948 సెప్టెంబర్ 17 తర్వాత గ్రామాల్లో ఖద్దరు బట్టలు, గాంధీ టోపీల తో ప్రవేశించి ప్రజలు స్వాధీనం చేసుకున్న భూమిని అక్రమించి 1951 అక్టోబర్ దాకా యూనియన్ సైన్యాలు కమ్యూనిస్టులను వేటాడడంలో సహకరించారు. ముస్లింలను వేటాడడంలో పురికొల్పారు. ముఖ్యంగా మరట్వాడలో లక్షలాదిమంది ముస్లింలను హత్య చేయడంలో కేంద్ర బలగాలకు అండగా నిలిచారు. 1956 దాకా మీర్ ఉస్మాన్ అలీఖాన్ రాజప్రముఖ్‌గా ఉన్నట్లుగానే- జమీందారీ, జాగీర్దారీ చట్టం రద్దయి రక్షిత కౌల్దారీ చట్టం వచ్చేదాకా-దేశ్‌ముఖ్, దేశ్‌పాండే, ముక్తేదార్‌లుగా దొరలు కొనసాగారు. మీర్ ఉస్మాన్ అలీఖాన్ రాజభరణాలు ప్రభుత్వం నుంచి పొందినట్లుగా వీళ్లు నష్టపరిహారాలు, ఇనాములు పొందారు.[2]


పోరాట ఫలితం

కమ్యూనిస్టులు హైదరాబాదుని ఆక్రమించే చివరి దశలో ప్రాణాలపై ఆశ వదులుకున్న నిజాం నవాబు భారత ప్రభుత్వానికి లొంగి పోతున్నట్టుగా ప్రకటించాడు. తద్వారా 1949 లో హైదరాబాదు రాష్ట్రం భారత దేశంలో కలవడం, తెలంగాణా సాయుధ పోరాటానికి ముగింపు జరిగాయి.1952 మార్చి 6 న హైదరాబాద్‌ రాజ్యంలో బూర్గుల రామకృష్ణారావునేతృత్వంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది.


తెలంగాణ విమోచనోద్యమం



నిజాం సంస్థానం
హైదరాబాద్ సంస్థానాధీశుడు ఏడవ నిజాం నవాబు ఉస్మాన్ ఆలీ ఖాన్ నుంచి విముక్తి కోసం సంస్థాన ప్రజలు 1946 నుంచి 1948మధ్య వీరోచిత పోరాటం చేశారు. దీన్నే తెలంగాణ విమోచనోద్యమంగా పిలుస్తారు. రెండు వందల సంవత్సరాల దోపిడి, అణిచివేతకు నలభై ఏడు సంవత్సరాల తిరుగుబాటు, సాయుధపోరాటం ఒక దశ మాత్రమే. వివిధ సంఘాల, పార్టీల, ప్రజాస్వామికవాదుల, రచయితల, ప్రజల సంఘటిత క్రమ-పరిణామపోరాటమది. హైదరాబాద్ సంస్థానంలో ప్రస్తుత తెలంగాణాతో పాటు మరాఠ్వాడ (మహారాష్ట్ర), బీదర్ (కర్ణాటక) ప్రాంతాలు ఉండేవి. 3 భాషా ప్రాంతాలకు చెందిన మొత్తం 16 జిల్లాలకు గాను 8 జిల్లాలు తెలంగాణా ప్రాంతానికి చెందినవి కాగా, మరాఠా, కన్నడ ప్రాంతాలకు చెందినవి 8 జిల్లాలుండేవి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిననూ నిజాం సంస్థానంలోని ప్రజలకు మాత్రం స్వాతంత్ర్యం లేకపోవడాన్ని ఇక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. దేశమంతటా స్వాతంత్ర్యోత్సవాలతో ప్రజలు ఆనందంతో గడుపుచుండగా నిజాం సంస్థాన ప్రజలు మాత్రం నిరంకుశ బానిసత్వంలో కూరుకుపోయారు. హైదరాబాదు రాజ్యాన్ని పాలిస్తున్న ఏడవ నిజామ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రాజ్యాన్ని సొంతం చేసుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తూ రజాకార్లను ఉసిగొల్పాడు. నిజాంకు అండగా ఖాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లు గ్రామాలపైబడి దోపిడిచేయడం, ఇండ్లు తగలబెట్టడం[1] నానా అరాచకాలు సృష్టించారు.[2] అతని మతోన్మాద చర్యలు కోరలాల్చి వెయ్యి నాల్కలతో విషంకక్కాయి.[3] హీనమైన బతుకులు వెళ్ళదీస్తున్న జనం గురించి అస్సలు పట్టించుకోకుండా ప్రజల నుండి బలవంతంగా వసూలుచేసుకున్న సొమ్ముతో విలాసాలు, జల్సాలు, భోగభాగ్యాలు చేసుకొనేవారు. దీనితో రామానందతీర్థ నేతృత్వంలో ఆర్యసమాజ్ ఉద్యమాలు, కమ్యూనిష్టుల ఆధ్వర్యంలో సాయుధపోరాటాలు ఉధృతమయ్యాయి. మొదట నల్గొండ జిల్లాలో ప్రారంభమైన ఉద్యమం శరవేగంగా నైజాం సంస్థానం అంతటా విస్తరించింది. రావి నారాయణరెడ్డిచండ్ర రాజేశ్వరరావుమల్లు స్వరాజ్యంఆరుట్ల కమలాదేవి,బొమ్మగాని ధర్మభిక్షంమాడపాటి హనుమంతరావుదాశరథి రంగాచార్యకాళోజి నారాయణరావుషోయబుల్లాఖాన్సురవరం ప్రతాపరెడ్డి తదితర తెలంగాణ సాయుధ పోరాటయోధులు వారికి స్పూర్తినిచ్చే కవులు, రచయితలు మూలంగా 1948లో ఉధృతరూపం దాల్చి చివరికి భారత ప్రభుత్వం సైనిక చర్యతో నైజాం సంస్థానాన్ని సెప్టెంబర్ 18, 1948న భారత్ యూనియన్‌లో విలీనం చేసుకుంది.

నిజాం పాలనలో దురాగతాలు

నీ బాంచన్ కాల్మొక్త అంటూ బతుకులీడ్చిన ప్రజలు నిజాం పాలనపై ఎదురు తిరగడానికి అంతులేని దురాగతాలే కారణం. నిజాం పాలన చివరి దశలో మానవరక్తాన్ని తాగే రాకాసి మూకలైన రజాకారు దళాల దురాగతాలకు అంతు ఉండేదికాదు. రైతులు పండించిన పంటలకు కూడా వారికి దక్కనిచ్చేవారు కాదు. నాడు వేలమంది మహిళలు మానభంగాలకు గురయ్యారు. హిందూ మహిళలను నగ్నంగా బతుకమ్మ ఆడించేవారు. నిజాం పాలకులు ఉద్యమాలను ఆపడానికి ఉద్యమకారులను చిత్రహింసలకు గురిచేసేవారు. గోళ్ళ కింద గుండుసూదులు, బ్లేడ్లతో శరీరంపై కోసి గాయాలపై కారం పోసేవారు. సిగరెట్లతో కాల్చేవారు. బొటనవేళ్లకు తాళ్ళు కట్టి తలకిందులుగా వేలాడదీసేవారు.[4] ప్రజల వద్ద నుంచి ముక్కుపిండి పన్నులు వసూలుచేసేవారు. ధాన్యాలను బలవంతంగా లాక్కొనేవారు. ప్రజలు తిండిలేక అలమటిస్తే పట్టించుకొనేవారు కాదు. నిజాంచే ఉసిగొల్పిన రజాకార్లు విచ్చలవిడిగా గ్రామాలపై పడి ఇండ్లు తగలబెట్టి, అందినకాడికి దోచుకొనేవారు. ఈ భయంకర పరిస్థితిని చూసి వందేమాతరం రామచంద్రరావు ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు నిజాం దుర్మార్గాలపై లేఖ అందించాడు.
తమ జల్సాలకు విలాస జీవితానికి సరిపోయే విధంగా 90 రకాల పన్నులు విధించారు. ప్రజల బతుకు అధ్వాన్నమైంది. పన్నుల కట్టలేని పరిస్థితిలో గోళ్ళూడగొట్టారు. లెవీ కొలువకపోతే ఊరి మీద పడి రైతులు తినడానికి ఉంచుకున్న ధాన్యాన్ని దోచుకెళ్ళిన సంఘటనలనేకం. ఎదిరించినందుకు బైరాన్‌పల్లిలో 108 మందిని కాల్చి చంపారు, నిర్మల్‌లో వెయ్యిమందిని ఉరితీశారు, గాలిపెల్లిని తగులబెట్టారు. ఇలాంటి సంఘటనలు లెక్కలేనివి. శవాలను కూడా బూటుకాళ్ళతో తన్నిన నరహంతకులు, కిరాతకులు రజాకార్లు.[5] నిజాం రాజుల దృష్టిలో ప్రజలంతా ‘బాంచె’లు(బానిసలు). సామాజికంగా 'వెట్టి' అనే బానిసత్వ పద్ధతి అమల్లో ఉండింది. యార్‌జంగ్ నేతృత్వంలోని మజ్లిస్ ఇత్తెహాదుల్ బైనుల్ముస్లమీన్ సంస్థ బలవంతంగా హిందువులను ముస్లింమతంలోకి మార్పిడి చేసేది. ఎదురు తిరిగిన వారిపై అరాచకంగా ప్రవర్తించేవారు. రజాకార్ మూఠాలు స్త్రీలను మానభంగాలకు గురిచేసి, వివస్త్రలను చేసి ఎత్తుకుపోయేవారు.[6]
చెట్లకు కట్టేసి కింద మంటలు పెట్టేవారు, జనాన్ని వరసగా నలబెట్టి తుపాకులతో కాల్చేవారు, బహిరంగంగా సామూహిక మానభంగాలు జరిపేవారు.[7] దోపిడీ దృష్టి తప్ప స్థానిక ప్రజల పట్ల గౌరవం ఏమాత్రంలేదు. సంస్థాన ఉద్యోగాల్లో స్థానిక ప్రజల్ని పెట్టుకోకుండా ఉత్తర భారతం నుండి అపాకీలను రప్పించి నియమించారు. స్థానిక భాషల్ని, సంస్కృతులను అన్ని దశల్లోనూ నిర్దాక్షిణ్యంగా అణిచివేశారు. ‘అరబ్బీ-అమృతం, పారశీ-తేనె ఉర్దూ-కండశర్కర, తక్కిన భాషలన్నీ ఒంటికాలికింది దుమ్ము’ అని ఈసడించుకున్నారు. స్థానిక ఉర్దూను సైతం హీనంగా చూశారంటే తెలుగు పరిస్థితికి దిక్కులేదు. తుర్రేబాజ్‌ ఖాన్ ‌, బందగి , షోయబుల్లాఖాన్‌ లాంటి అనేక మంది ముస్లింలు కూడా నిజాం నిరంకుశ పాలనలో హత్యచేయబడ్డారు. 1942లో షేక్ బందగీ ని విసునూరు రామచంద్రారెడ్డి అనే భూస్వామికి చెందిన గూండాలు హత్యచేశారు
.



సర్దార్ పటేల్ పాత్ర,



సైనిక చర్య విజయవంతం కావడానికి అప్పటి బారత హోంశాఖా మంత్రి సర్దార్ పటేల్ కృషి ఎంతో ఉంది. సర్దార్ వల్లభ్ భాయిపటేల్ రాజకీయ చతురతతో పోలీసు చర్య జరిపి నిజాం పాలనకు చరమగీతం పలికాడు. హైదరాబాదును ప్రత్యేక దేశంగా ఉంచాలని కనీసం పాకిస్తాన్‌లోనైన విలీనం చేయాలని విశ్వప్రయత్నం చేసిన నిజాం పన్నాగాలను పటేల్ బద్దలు కొట్టాడు. నిజాం ఐక్యరాజ్యసమితికి భారతదేశంపై ఫిర్యాదు చేయడానికి దూతలను కూడా పంపాడు. భారతదేశంపై పోరాటానికి విదేశాల నుంచి ఆయుధ దిగుమతికి ప్రయత్నాలు చేశాడు. అయినా అతని ఆటలు, నిజాం ప్రధాని లాయక్‌అలీ నాటకాలు పటేల్ ఎదుట పనిచేయలేవు. పోలీసు చర్యలో భాగంగా నలువైపులా నుంచి వస్తున్న భారత బలగాలను చూసి నిజాం కింగ్‌కోఠి నుంచి బయటకు వచ్చి భారత ప్రతినిధి కె.ఎం.మున్షీని కలిశాడు. అప్పటికే సమాచారసాధనాలు తెగిపోవడంతో ఎటూ అర్థంకాక కాళ్ళబేరానికి దిగాడు.[8]లొంగుబాటుకు మించిన తరుణోపాయం లేదను మున్షీ చెప్పడంతో నిజాం ఒప్పుకోకతప్పలేదు. బొల్లారం వద్ద నిజాం నవాబు సర్దార్ పటేల్ ఎదుట తలవంచి లొంగిపోవడంతో సెప్టెంబరు 17, 1948న హైదరాబాదు రాజ్యం భారత యూనియన్‌లో విలీనమైంది. అప్పుడు ఇక్కడి ప్రజలకు అసలైన స్వాతంత్ర్యం లభించింది. నిజాం ప్రధాని లాయక్‌అలీని తొలిగించడమే కాకుండా ప్రజలకు నరకయాతన చూపించిన ఖాసింరజ్వీని అరెస్టు చేశారు. ఆ తర్వాత హైదరాబాదు అసెంబ్లీని రద్దుచేయబడింది. హైదరాబాదు రోడ్లమీద ఇక తలెత్తుకుతిరగలేమని భావించిన లాయక్‌అలీ, ఖాసింరజ్వీలు మూటాముల్లెలు సర్దుకొని పాకిస్తాన్ పారిపోయారు.

ఆపరేషన్ పోలో

నిజాం సంస్థానంపై భారత ప్రభుత్వం జరిపిన సైనిక చర్యకు ఆపరేషన్ పోలో అని పేరు. జనరల్ జె.ఎన్.చౌదరి నేతృత్వంలో సెప్టెంబర్ 13, 1948న సైనిక చర్య మొదలైంది. సైన్యం రెండు భాగాలుగా విడిపోయి విజయవాడ నుంచి ఒకటి, బీదర్ దిశగా రెండోది కలిసింది. మొదటి రెండు రోజులు నిజాం సైన్యం తిరగబడినా ఆ తర్వాత క్షీణించింది. తాను ఓటమి అంచుల్లో ఉన్నట్లు గమనించి నిజాం నవాబు దిక్కుతోచని స్థితిలో లేక్‌వ్యూ అతిథి గృహంలో బంధించిన భారత ఏజెంట్ మున్షీని కలిసి లొంగిపోతున్నట్లు ప్రకటించాడు. దీనితో ఆపరేషన్ పోలో విజయవంతమైంది.సెప్టెంబర్ 13న జె.ఎన్.చౌదరి నాయకత్వాన ప్రారంభమైన దాడి సెప్టెంబర్ 17న నిజాం నవాబు లొంగిపోవడంతో ఆపరేషన్ పోలో పేరుతో చేపట్టిన చర్య పూర్తయింది.సెప్టెంబర్ 18న సైనిక చర్యకు నేతృత్వం వహించిన జె.ఎన్.చౌదరి సైనిక గవర్నర్‌గా పదవీ ప్రమాణం చేశాడు. ఎం.కె.వెల్లోడి ప్రధానిగా నియమించబడ్డాడు.

ఉద్యమ స్పూర్తి ప్రధాతలు

తెలంగాణ సాయుధ పోరాటంలో పురుషులు, స్త్రీలు, పిల్లలు అనే తేడాలు లేకుండా తుపాకులు, బడిసెలు పట్టి రజాకార్ల మూకలను తరిమికొట్టారు. మహబూబ్ నగర్ జిల్లాలోఅప్పంపల్లిఆదిలాబాదు జిల్లాలో నిర్మల్, సిర్పూర్, కరీంనగర్ జిల్లాలో మంథని, మహమ్మదాపూర్, నల్గొండ జిల్లాలో మల్లారెడ్డిగూడెం, నిజామాబాదు జిల్లా ఇందూరు, తదితర ప్రాంతాలలో పోరాటం పెద్దఎత్తున సాగింది. జమలాపురం కేశవరావు, లక్ష్మీనరసయ్య, ఆరుట్ల కమలాదేవి, రావి నారాయణరెడ్డి, ధర్మబిక్షం, చండ్ర రాజేశ్వరరావు, బద్దం ఎల్లారెడ్డి,మగ్దూం మొహియుద్దీన్ , షోయబ్ ఉల్లాఖాన్ , మల్లు స్వరాజ్యం, రాంజీగోండ్, విశ్వనాథ్ సూరి, దొడ్డి కొమరయ్య, బెల్లం నాగయ్య, చండ్ర రాజేశ్వరరావు, కిషన్ మోదాని తదితరులు తెలంగాణ విమోచనానికి కృషిచేశారు. వీరందరి కృషి, దాశరథి, కాళోజీల కవితల స్పూర్తితో సామాన్య ప్రజలు సైతం ఊరుఊరున, వాడవాడన నిజాం పాలనపై తిరగబడ్డారు. కర్రలు, బరిసెలు, గుత్పలు, కారం ముంతలు, వడిసెలను ఆయుధాలుగా మలుచుకొని పోరాడారు. బర్మార్లు, తుపాకులను సంపాదించుకొని యుద్ధరంగంలోకి దిగారు.

వివిధ జిల్లాలలో తెలంగాణ సాయుధపోరాటాలు

ఆదిలాబాదు జిల్లా

ఆదిలాబాదు జిల్లాలో తెలంగాణా సాయుధ పోరాటానికి ఊపిరిలూదిన వ్యక్తులుగా రాంజీ గోండు, కొమరంభీం ప్రసిద్ధిచెందినారు.[9] నిర్మల్ కేంద్రంగా చేసుకొని ఎందరో పోరాటయోధులు రజాకార్లను ఎదిరించారు. బ్రిటీష్ వారికి తొత్తులుగా ఉంటూ నైజాం సంస్థానాన్ని నడిపించిన వారిపై తిరగబడ్డారు. జల్-జమీన్-జంగల్ కోసం గిరిజనుల తరఫున పోరాడిన కొమరంభీం, రాంజీగోండుల పోరాటాలు, త్యాగాలు గుర్తుచేసుకోవడానికి సెప్టెంబర్ 17న పలు రాజకీయపార్టీలు పోటాపోటీ ఏర్పాట్లుచేసుకుంటాయి. రాంజీగోండుతో పాటు అతని వెయ్యిమంది అనుచరులను మర్రిచెట్టుకు సామూహికంగా ఉరితీశారు. ఆ మర్రి "గోండ్ మర్రి", "ఉరులమర్రి"గా ప్రసిద్దిచెందింది.[10] ఇదే వెయ్యి ఉరులమర్రి సంఘటనగాప్రసిద్ధిచెందింది. ప్రస్తుతం ఆ చెట్టు లేదు.[11] ఆ ప్రాంతంలో అమరవీరుల స్తూపం ఉంది. గోపిడి గంగారెడ్డి, గంగిశెట్టి విఠల్‌రావు, రాంపోశెట్టి, భీంరెడ్డి తదితరులు తెలంగాణ విమోచనోద్యమ పోరాటంలో ప్రాణాలు కోల్పోయారు. నిజాం సంస్థానంపై పోలీసుచర్య ప్రారంభమై విమోచన పూర్తయ్యే వరకు 5 రోజులపాటు ఆసిఫాబాదు వాసులు ప్రాణాలకు పణంగా పెట్టి అలుపెరుగని పోరాటం చేసి రజాకార్లను ముప్పుతిప్పలు పెట్టారు.

కరీంనగర్ జిల్లా
కరీంనగర్ జిల్లాలో తెలంగాణా సాయుధ పోరాటానికి హుస్నాబాదు మండలం మహ్మదాపూర్ గ్రామానికి ప్రత్యేకస్థానం ఉంది. నిజాం నిరంకుశపాలనకు వ్యతిరేకంగా ఈ ప్రాంత ప్రజలు సాయుధపోరాటం బాటపట్టారు. నిజాం అరాచకాలు భరించలేక వారికి తరిమికొట్టేందుకు సిద్ధమయ్యారు. తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామానికి చెందిన అనభేరి ప్రభాకరరావు, సింగిరెడ్డి భూపతిరెడ్డిల నాయకత్వంలో ప్రజాసైన్యం మార్చి 14, 1946న మహ్మదాపూర్ చేరగా నిజాం సైనికులు అత్యంత పాశవికంగా గుండ్ల వర్షం కురిపించారు.[12] మంథనికిచెందిన రఘునాథరావు కాచే జిల్లాలో మొట్టమొదటి సత్యాగ్రహిగా నిజాం పాలనను వ్యతిరేకించి చరిత్ర సృష్టించాడు. దేశమంతటా ఆంగ్లేయుల పాలన నుంచి స్వేచ్ఛ పొందగా నిజాం సంస్థానం ప్రజలకు స్వాతంత్ర్యం లేకపోవడంతో నిజాం పాలనకు చరమగీతం పాడేందుకు మంథని సమరయోధులు ప్రాణాలు కూడా లెక్కచేయక ఉద్యమానికి ముందు ఉండి పోరాటాన్ని కొనసాగించారు. రావి నారాయణరెడ్డి పిలుపుతో పనకంటి కిషన్ రావు, సువర్ణ ప్రభాకర్, చొప్పకంట్ల చంటయ్య, డి.రాజన్న, రాంపెల్లి కిష్టయ్య, ఎలిశెట్టి సీతారాం తదితరులు సాయుధ సంగ్రామంలో దూకి బెబ్బులి వలె గర్జించారు. శ్రీరాములు నేతృత్వంలోని బృందం స్పూర్తితో మహదేవ్ పూర్ తాలుకాలోని ప్రజలు ఉద్యమంలోకి దూకారు. వేధింపులు అధికం కావడంతో శ్రీరాములు అజ్ఞాతంలోకి వెళ్ళి సెప్టెంబర్ 17, 1948న బయటకు వచ్చాడు. 1952 శాసనసభ ఎన్నికలలో శ్రీరాములు శాసనసభ్యుడిగా విజయం సాధించాడు.

ఖమ్మం జిల్లా

తెలంగాణా ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పిచేస్తూ భోగలాలసమైన, విలాసవంతమైన జీవితాలు గడిపే నిజాం నిరంకుశ పాలన రోజుల్లో ఖమ్మం జిల్లాలో సాయుధ పోరాటం ఉధృతంగా సాగించి. ఇల్లెందు, బూర్గంపాడు, భద్రాచలం పరిధిలో రజాకార్లతో సాగించిన పోరాటం చారిత్రాత్మకం. అనేక ప్రజాఉద్యమ దళాలకు తుమ్మ శేషయ్య, పాటి జగ్గయ్య, సుంకరి మల్లయ్య, దామినేని వేంకటేశ్వరరావు తదితరులు నాయకత్వం వహించారు.[13] జమలాపురం కేశవరావు కలెక్టరేట్ కార్యాలయంలోని ఉద్యోగాన్ని వదిలి నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడినాడు. బొమ్మకంటి సత్యనారాయణరావు స్వచ్ఛందదళాన్ని ఏర్పాటుచేసి మతదురహంకారులైన రజాకార్లపై దాడులు నిర్వహించి ప్రజల పక్షాన నిలిచాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన జలగం వెంగళరావు జాయిన్ ఇండియా ఉద్యమానికి ఖమ్మంలో నాయకత్వం వహించి రజాకార్లను ఎదుర్కొన్నాడు. మాజీ ఎమ్మెల్సీ కవి, నవలాకారుడైన హీరాలాల్ మోరియా జాయిన్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొని ప్రజలకు అండగా నిలబడ్డాడు.

మెదక్ జిల్లా

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, విముక్తి కోసం జరిగిన పోరాటంలో మెదక్ జిల్లాకు చెందిన పలువులు యోధులు పాలుపంచుకున్నారు. నైజామ్ పోలీసుల చిత్రహింసలు, నిర్భంధాలు, జైలుశిక్షలకు కూడా లెక్కచేయకుండా పోరాటం కొనసాగించారు. ఆయుధాలను చేతపట్టి మిలటరీలా దాడులు చేస్తూ రజాకార్లను గడగడలాడించారు. నిజాం నవాబు హిందూ దేవాలయాలలో భజనలు చేయవద్దని హుకుం జారీచేస్తే దాన్ని ధిక్కరించి భజనలు చేశారు. నైజాం సర్కారు ఆజ్ఞలను ధిక్కరించి ఆగస్టు 15న జాతీత జెండాలను రెపరెపలాడించారు. మెదక్ పట్టణానికి చెందిన చోళ లింగయ్య ఇండీయన్ నేషనల్ ఆర్మీలోని ఇంజనీర్ ఉద్యోగానికి రాజీనామా చేసి తనకున్న మిలటరీ పరిజ్ఞానంతో రజాకార్ల దాడులను తిప్పికొట్టడం కోసం రక్షణ దళాన్ని ఏర్పాటుచేశాడు.[14] వెల్దుర్తి మాణిక్యరావు తన రచనల ద్వారా అక్షరాయుధాలను సంధించి నిజాంపై గళమెత్తాడు. అనేక పత్రికలలో వ్యాసాలు, కవితలు రాసి ప్రజలలో చైతన్యం నింపినాడు. మాణిక్యరావు రాసిన "రైతు పుస్తకం" ను నిజామ్ సర్కారు నిషేధించింది. తొలి ఆంధ్రమహాసభలు జిల్లాలోని జోగిపేటలోనే నిర్వహించారు. 1946లో జిల్లాలోని కందిలో ఈ సభలు జరిగాయి

నల్గొండ జిల్లా

తెలంగాణ విమోచనోద్యమానికి బీజాలు పడింది నల్గొండ జిల్లాలోనే. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్యల స్పూర్తితో ఎందరో పోరాటయోధులు తయారై నిరంకుశ నిజాంకు, అతడి తొత్తులైన రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమించారు. సాయుధ పోరాటంలో మొట్టమొదటిసారిగా నిజాం తూటాలకు అమరుడైన వ్యక్తిగా దొడ్డి కొమురయ్య చరిత్రలో నిలిచాడు. [15]విసునూరు ప్రాంతంలో చాకలి ఐలమ్మ ప్రదర్శించిన ధీరత్వం పలువురికి మార్గదర్శకం చేసింది. నల్గొండ జిల్లాలో తెలంగాణా సాయుధ పోరాటానికి కేంద్రబిందువు మల్లారెడ్డి గూడెం. ఖాసింరజ్వీ నిరంకుశ విధానాలకు ఎదురొడ్డి పోరాడిన చరిత్ర మల్లారెడ్డి గూడెం పోరుబిడ్డలది. చిన్నపిల్లలు సైతం వరిసెలతో రాళ్ళు రువ్వి నైజాం నిరంకుశత్వాన్ని పారదోలేందుకు నడుం బిగించారు.[16] 1946 డిసెంబరు 1న నిజాం మిలటరీ అకస్మాత్తుగా గ్రామంపై దాడిచేయగా రజాకార్లకు ఎదురొడ్డి పోరాడిన అప్పిరెడ్డి, ముంగి వీరయ్య, నందిరెడ్డి నర్సిరెడ్డి, అలుగుల వీరమ్మలు కాల్పులకు గురయ్యారు.[17]. వీరి మరణానంతరం నిజాం ప్రభుత్వం 400మందిని అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేసింది. ఈ సంఘటన జిల్లా పోరాట చరిత్రలోనే ప్రధాన భూమిక వహించింది. ఆరుట్ల రాంచంద్రారెడ్డి, కమలాదేవి, రేణికుంట రామిరెడ్డి కదలనుపాక ప్రాంతములో ఉద్యమానికి ఊపిరిపోశారు. కరీంనగర్ నుంచి వచ్చిన రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డిలు ఉద్యమానికి దోహదపడ్డారు. కొండవీటి రాధాకృష్ణ, కొండవీటి సత్తిరెడ్డి, రామలింగారెడ్డి, మల్లుస్వరాజ్యం, కోదాటి నారాయణరావు తదితరులు నిరంకుశ నిజాంపాలనకు వ్యతిరేకంగా పోరాడినారు.

మహబూబ్ నగర్ జిల్లా


నిరంకుశ నిజాం పాలనకు, దాష్టీక రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా మహబూబ్ నగర్ పట్టణ ఉద్యమకారులకు వేదికగా నిలిచిన తూర్పుకమాన్
మహబూబ్ నగర్ జిల్లాలో నిజాంపై తిరగబడిన ప్రధాన సంఘటన అప్పంపల్లి సంఘటన. 1947 అక్టోబర్ 7న ఆత్మకూరు, అమరచింత సంస్థాన పరిధిలోని అప్పంపల్లి గ్రామంలో తెలంగాణ భారతదేశంలో విలీనం చేయాలని బెల్లం నాగన్న నాయకత్వంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించారు. అప్పంపల్లి పరిసర గ్రామాలైన నెల్లికొండ, వడ్డేమాన్, దాసరపల్లి, లంకాల, అమరచింత తదితర గ్రామాలకు చెందిన రెండువేల ఉద్యమకారులు తెలంగాణ విమోచన కొరకు సత్యాగ్రహం చేశారు. ఈ సత్యాగ్రహాన్ని అణచివేయడానికి నిజామ్ సైనికులకు చేతకాలేదు. మహబూబ్ నగర్ నుంచి రిజర్వ్‌డ్ దళాలను రప్పించి సైనిక చర్య జరిపారు. బెల్లం నాగన్నతో పాటు పలు ప్రముఖులను అరెస్టు చేయాలని నిజాం సైనికులు నిర్ణయించిననూ ప్రజలు ప్రతిఘటించడంతో తోకముడిచారు. ఆ సాయంత్రం ఉద్యమకారులపై కాల్పులు జరిపడంతో 11 మంది ఉద్యమకారులు మరణించగా, 25 మంది తీవ్రంగా గాయపడ్డారు.[18] అదే సమయంలో నెల్లికొండికి చెందిన కుక్కుల కిష్టన్న తన ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి తన ఘనకార్యాన్ని చాటి చెప్పాడు. అప్పటి తాలుకా గిర్దావర్ మరియు పోలీస్ ఇన్స్‌పెక్టర్ ఇతన్ని అరెస్టు చేసి తీసుకువెళ్తుండగా ప్రజల ప్రతిఘటనకు భయపడి కిష్టన్నను వదిలి పారిపోయారు. మహబూబ్ నగర్ పట్టణంలో నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా తూర్పుకమాన్‌పై జాతీయజెండాను ఎగురవేయాలని స్వాతంత్ర్యసమరయోధులు సంకల్పించారు. నిజాంపోలీసుల కళ్ళుగప్పి ఉద్యమకారులు తూర్పుకమాన్‌పై జెండాను ఎగురవేసి తమపంతం నెగ్గించుకున్నారు. తూర్పుకమాన్ ఉద్యమకారులకు వేదికగా నిలిచింది. నారాయణపేట ఆర్యసమాజ్ నాయకులు, సీతారామాంజనేయ గ్రంథాలయోద్యమ నాయకులు, జడ్చర్లలో ఖండేరావు, కోడంగల్‌లో గుండుమల్ గోపాలరావు. కల్వకుర్తిలో లింగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టణంలో పల్లర్ల హనుమంతరావు, అయిజలో దేశాయి నర్సింహారావు, గద్వాలలో పాగ పుల్లారెడ్డి, వనపర్తిలో శ్రీహరి తదితరులు నిజాం వ్యతిరేక ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు

నిజామాబాదు జిల్లా

జిల్లాలోని నీలకంఠేశ్వర ఆలయం ప్రాంగణంలో జరిగిన ఆంధ్రమహాసభ తెలంగాణ సాయుధ పోరాటానికి నాందిపలికింది. నిజాం వ్యతిరేక పోరాటంలో జిల్లాలో ఇందూరు మొదట నిలిచింది.[19] ఆర్యసమాజం స్పూర్తినిచ్చింది. ఇందూరులో రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టిన కిషన్ మోదానిని ముష్కరులు కాల్చిచంపారు. ఆయన మరణంతో ఉద్యమం తీవ్రమైంది. వందలాది తెలంగాణ విమోచన యోధులను నిజామాబాదు ఖిల్లా జైలులో బంధించి నిజాం అకృత్యాలకు పాల్బడ్డాడు. ఈ ఖిల్లా వందలాది యోధుల మరణానికి మూగసాక్షిగా నిలిచింది. ఇది రాజకీయ ఖైదీలకు బొందలగడ్డ అని నిజాం ప్రకటించాడు. ఈ అణచివేటలను నిరసిస్తూ అక్కడే ఉన్న ప్రముఖ కవి దాశరథి ఓ నిజాము పిశాచమాఅని గద్దించాడు. నిజామాబాదు జైలులో ఉన్నప్పుడే ప్రముఖ కవి దాశరథి కృష్ణమాచార్యులు నా తెలంగాణ కోటి రతనాల వీణ అనే గేయాన్ని ఖిల్లా జైలు గోడలపై రాశాడు.కామారెడ్డి ప్రాంతంలో రైతుల వద్ద నుంచి బలవంతంగా సేకరించిన ధాన్యాన్ని భిక్నూరు రైల్వేస్టేషన్ సమీపంలోని గిర్నీలో దాచేవారు. 1947లో సాయుధ యోధులు ధాన్యాగారంపై దాడిచేశారు. ఈ సంఘటనలో కీలకపాత్ర వహించిన కుర్రిబాల్ లింగం, వెంకటబాలయ్య తదితర ఐదుగురిని నిజామాబాదు ఖిల్లాజైలుకు పంపింవారు. తాడ్వాయి మండలానికి చెందిన రాఘవరెడ్డి ఆర్యసత్యాగ్రహంలోపాల్గొని 6 నెలలు జైలుకు వెళ్ళాడు. కామారెడ్డికి చెందిన ప్రముఖ చిత్రకారుడు ఫణిహారం రంగాచారి నిజామ్ దురాగతాలపై చిత్రాలు గీసి, ప్రదర్శించి ప్రజలలో చైతన్యం తెచ్చాడు. ఇతని చిత్రాలు ఇప్పటికీ హైదరాబాదులోని ముక్దుం భవన్‌లో ఉన్నాయి. బాన్సువాడకు చెందిన లక్క కిష్టయ్య 100 మంది యువకులతో ఆయుధాలు చేపట్టి నిరంకుశ నిజాంకు, దాష్టీక రజాకార్లకు వ్యతిరేకంగా సాయుధ ప్రదర్శనను విజయవంతంగా నిర్వహించాడు. రజాకర్ ఖాసింరజ్వీ తమ్ముడు అబ్బాస్ రజ్వీ కామారెడ్డి సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన కాలంలో అతను పెట్టిన బాధలను అనుభవించిన వారిలో కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే బి.బాలయ్య ఒకరు.[20] దేశభక్తి గీతాలు పాడినందుకు చావుదెబ్బలు తినవలసి వచ్చింది. ఎల్లారెడ్డి మండలం కళ్యాణి గ్రామంలో సుంకి కిష్టయ్య నిజామ్ వ్యతిరేక ఉద్యమాన్ని ముందుండి నడిపించాడు.[21] 1947 గాంధీజయంతి రోజున కళ్యాణిలో జరిగిన పోరాటంలో ఏడుగురిని అరెస్టు చేసి బీదర్ జైల్లో ఉంచారు. మారుమూల పల్లె మానాల రజాకార్ల గుండెల్లో రైళ్ళు నడిపించింది. తెలంగాణ విముక్తి కోసం రజాకార్లకు వ్యతిరేకంగా తుపాకులు, మందుగుండులు స్వతంగా తయారుచేసుకున్నారు. ఆర్మూర్, కామారెడ్డి, సిర్పూర్ ప్రాంతాలకు మానాల కేంద్రంగా పనిచేసింది. బద్దం ఎల్లారెడ్డి తదుతరులు ఇక్కడే పోరాటయోధులకు గెరిల్లా శిక్షణ ఇచ్చేవారు.

వరంగల్ జిల్లా

కాకతీయులు ఏలిన గడ్డపై రజాకార్లను ఎదిరించిన వ్యక్తిగా బత్తిన మొగలయ్య గౌడ్ చరిత్రలో నిలిచిపోయారు.[22] స్టేట్ కాంగ్రెస్ పిలుపు మేరకు ప్రాణాలకు తెగించి ఊరూరా త్రివర్ణ పతాకాలు ఎగురవేస్తూ దేశభక్తిని చాటుతున్న సమయంలో వరంగల్ తూర్పు కోటలో బత్తిన మొగులయ్య గౌడ్ ఆగస్టు 11, 1946న రజాకార్ల దాష్టీకాలకు గురై బలయ్యాడు. దీనితోవరంగల్లులో రజాకార్ల ఉద్యమం ఊపందుకుంది. బైరాన్‌పల్లి గ్రామంపై పడి ఊరును వల్లకాడు చేసి దొరికినవన్నీ నేలరాల్చి కౄరత్వాన్ని ప్రదర్శించిన రజాకార్లు కూటిగల్లు మీద అదే ప్రతాపాన్ని చూపారు. 18మందిని నిలబెట్టి రాక్షసంగా కాల్చిచంపారు. ఆ తర్వాత విమోచనకారులు నిజాంపై, రజాకార్లపై ఎదురుదాడులకు తిరిగారు. చాకలి ఐలమ్మ ధీరత్వం పలువురికి మార్గదర్శకం చేసింది. పోరాటయోధులు తొర్రూరులో పోలీసు క్యాంపుపై దాడిచేసి దాన్ని లేవనెత్తించారు. అమ్మాపురంకు చెందిన అనేకమంది పోరులో పాల్గొన్నారు.

హైదరాబాదు

హైదరాబాదులో మరియు ఇప్పటి రంగారెడ్డి జిల్లా ప్రాంతాలలో కూడా నిజాం మరియు రజాకార్ల బాధలను పడలేక ప్రజలు ఎదురు తిరిగారు. నారాయణరావు పవార్గంగారాం ఆర్య, జగదీష్ ఆర్య, కొక్కుడాల జంగారెడ్డి, వెదిరె రమణారెడ్డి, ఆర్.కేశవులు, తొండుపల్లి వెంకటరావు, మందుముల నర్సింగరావు, షోయబుల్లాఖాన్కాటం లక్ష్మీనారాయణ తదితరులు నిజాంకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేశారు. నారాయణరావు పవార్ ఏకంగా నిజాంపై బాంబులు విసిరి సంచలనం సృష్టించాడు. షోయబుల్లాఖాన్ తన ఇమ్రోజ్ పత్రికలో నిజాంకు వ్యతిరేకంగా వ్యాసాలు రచించినందుకు నడిరోడ్డుపైనే గుండాల చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. రజాకారుల నిరంకుశత్వానికి విసిగిపోయి శంషాబాద్ ప్రాంతానికి చెందిన గంగారం నారాయణరావు పవార్‌తో కలిసి నిజాంపై బాంబుదాడిలో పాల్గొన్నాడు. శంషాబాదుకే చెందిన గండయ్య హిందువులను నీచంగా చూడడం భరించలేక పోరాటాన్ని ఉధృతం చేశాడు. అతన్ని అరెస్టు చేసి జైల్లోవేసిన పిదప క్షమాపణలు చెబితే వదిలివేస్తామని నచ్చజెప్పిననూ ఆయన అందుకు నిరాకరించాడు.[23] ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాలు పోరాటయోధులకు పెట్టనికోటలాంటివి. ఇప్పటి రంగారెడ్డి-నల్గొండ జిల్లా సరిహద్దులో ఉన్న రాచకొండ గుట్టలను పోరాటయోధులు సమర్థంగా వినియోగించుకున్నారు. వీరిలోమద్దికాయల ఓంకార్ ప్రముఖుడు. యాచారం ప్రాంతంలో బర్ల శివయ్య విమోచనఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. పరిగి మండలానికి చెందిన అల్కిచర్ల అంతయ్య, ధరూరు మండలమునకు చెందిన రుమ్మ కిష్టప్పలు కూడా పోరాటంలో పాల్గొన్నారు. రాజాకార్ సైన్యంలోని ఒక శాఖ ఉన్న షాబాద్‌లో రజాకార్లను ఒంటిచేతితో ఎదుర్కొన్న ఘనత కిష్టయ్య జోషికి దక్కుతుంది. రజాకార్లు తుపాకులు, బల్లేలు పట్టుకొని గ్రామంలో తిరుగుతూ బలవంతపు వసూళ్ళూ, అరాచకాలతో ప్రజలను భయభ్రాంతులను చేస్తున్న సమయంలో కిష్టయ్య జోషి ఇంటిలో మర్రిచెన్నారెడ్డి (మాజీ ముఖ్యమంత్రి), సత్యనారాయణ రెడ్డి (మాజీ గవర్నరు) తదితరులు సమావేశమై పోరాటమార్గం చేశారు.

విమోచనోద్యమ కాలంలో స్పూర్తినిచ్చిన గేయాలు

నిజామనగ ఎంతరా ... వాడి తహతెంతరా...
అంతగలసి తంతె మల్ల వాడి అంతులేదురా.......

నవయుగంబున నాజీ నగ్ననృత్యమింకెన్నాళ్ళు ......
హింసపాపమని యెంచు దేశమున హిట్లరిత్వమింకెన్నాళ్ళు. (కాళోజి)
మన కొంపలార్చిన , మన స్త్రీల చెరిచిన ........
కండకండలుగా కోసి కాకులకు వేయాలె, కాలంబు రాగానె కాటేసి తీరాలె (కాళోజి)

నైజాము సర్కరోడా, నాజీలను మించినోడా.......
గోల్కొండ ఖిల్లా కింద నీ ఘోరి కడతాం కొడుకా నైజాము సర్కరోడా (దాశరథి)
ఓ నిజాము పిశాచమా కానరాడు నినుబోలిన రాజు మాకెన్నెడేని .......
నా తెలంగాణ కోటి రతనాల వీణ (దాశరథి)

నిన్ను గెలవాలేక రైతన్నా......
నిజాం కూలింది కూలన్న (దాశరథి)
ఈ భూమి నీదిరా, ఈ నిజాం ఎవడురా!
ఈ జులుమీ జబర్ దస్తీ, వెగురదన్నీ వేయరా! (సుద్దాల హనుమంతు)

ఖాసింరజ్వీ ఎంతరా, వాడి బిసాదెంతరా?
అందరం కలిసి తంతే, అంతు దొరక కుందురా! (కొండేపూడి లక్ష్మీనారాయణ)
పాలన పేరుతో పల్లెపల్లెలో జరిగిన పాపము చాలింక
రక్షణ కై ఏర్పడిన బలగమే చేసే భక్షణ చాలింక (కాళోజి)

కాలరేఖ

  • 1930మెదక్ జిల్లా జోగిపేటలో మొదటి నిజాం రాష్ట్ర ఆంధ్రమహాసభ జరిగింది.
  • 1938: హైదరాబాదు స్టేట్ కాంగ్రెస్ ఆవిర్భావం. (జూలై)
  • 1938: హైదరాబాదు స్టేట్ కాంగ్రెస్ పై నిషేధం (సెప్టెంబర్).
  • 1938: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందేమాతరం గీతాలాపన.
  • 1944: దొడ్డి కొమరయ్య హత్యతో సాయుధ పోరాటం ప్రారంభం.
  • 1946నల్గొండ జిల్లాలో నిజాం మిలటరీ దాడి ప్రారంభం.
  • 1946 ఆగష్టు 11: వరంగల్లులో రజాకార్ల దాష్టీకాలతో బత్తిని మొగులయ్య గౌడ్ హత్య.
  • 1948 ఆగష్టు 21: పత్రికా కార్యాలయం నుంచి ఇంటికి వెళుతున్న షోయబుల్లాఖాన్‌ను రజాకార్లు దారుణంగా కాల్చిచంపారు.[24]
  • 1948 సెప్టెంబర్ 13 భారత యూనియన్ సైన్యం నిజాం సంస్థానంలో ప్రవేశించింది.
  • 1948 సెప్టెంబర్ 17: నిజాం లొంగుబాటు.
  • 1948 సెప్టెంబర్ 18: నిజాం సంస్థానం అధికారికంగా భారత యూనియన్‌లో విలీనం.

తెలంగాణ విలీనదినం

సెప్టెంబర్ 17ను తెలంగాణ విలీనదినం'గా జరపాలని జేఏసీ నిర్ణయించింది. ఆరోజు తెలంగాణ వ్యాప్తంగా జాతీయజెండాలతో పాటు తెలంగాణ జెండాలను ఎగరేయాలి. జాతీయగీతాన్ని, తెలంగాణ గీతాన్ని ఆలపించాలి. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారిని సంస్మరించుకోవాలి' అని జేఏసీ చైర్మన్ కోదండరాం పిలుపునిచ్చారు

సంగిశెట్టి శ్రీనివాస్ చెప్పిన కొన్ని విశేషాలు
  • 1950 ఏప్రిల్ 1న నిజాంకు, భారత ప్రభుత్వానికి కుదిరిన ఒప్పందం ప్రకారం నిజాంకు ఏడాదికి (ఎలాంటి పన్నులు లేకుండా) యాభై లక్షల రూపాయల భరణం చెల్లించడానికి నిర్ణయం జరిగింది. అలాగే నిజాం ప్రపంచంలో ఎక్కడ పర్యటించినా ఆయనకు హైదరాబాద్ రాజుగా పూర్వపు బిరుదులు యథాతథంగా కొనసాగించేందుకు భారత ప్రభుత్వం అంగీకరించింది. 1950 జనవరి 26వరకు ప్రభుత్వాధినేతగా,1956 అక్టోబర్ 31 వరకు రాజ్ ప్రముఖ్‌గా నిజాం ఉన్నారు.
  • ఏకు మేకై తన మాటని కూడా ఖాతరు చేయని కాసిం రజ్వీ నాయకత్వంలోని రజాకార్లను అణచివేయడానికి తప్పనిసరి పరిస్థితుల్లో నిజాం కూడా భారత ప్రభుత్వానికి సహకరించాడు. రజాకార్లు తీవ్రం గా వ్యతిరేకించినా హైదరాబాద్ న్యాయ సలహాదారుగా సర్ వాల్టర్ మాంక్‌టన్‌ని కొనసాగించడం ఇందుకు నిదర్శనం.
  • రజాకార్లలో ముస్లింలతో బాటుగా శ్యామ్ సుందర్, బి.ఎస్.వెంకటరావు, పీసరి వీరన్న లాంటి దళిత నాయకులు ప్రభావంతో ముస్లింలుగా మారిన దళితులు, దొరలు, భూస్వాములు వారి అనుచరగణం కూడా ఉన్నారు.
  • కమ్యూనిస్టులు ఆనాడు 'ఆజాద్ హైదరాబాద్' అనే నినాదమిచ్చారు.

ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ

1953 లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు పై వత్తిడి పెరిగింది. కాంగ్రెసు, కమ్యూనిస్టుల తో సహా అన్ని ప్రముఖ రాజకీయ పార్టీలూ దీనిని సమర్ధించడంతో విశాలాంధ్ర స్వప్నం నిజమయే రోజు దగ్గరపడింది. 1953 డిసెంబర్‌ లో సయ్యద్‌ ఫజల్‌ ఆలీ నేతృత్వంలో రాష్ట్రాల పునర్విభజన కమిషను ఏర్పాటయింది. 1955 సెప్టెంబర్ 30 న తన నివేదిక సమర్పించింది. విశాలాంధ్ర ఏర్పాటు లోని ప్రయోజనాలను అది గుర్తించినా, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును అది సమర్ధించింది. మరాఠీ మాట్లాడే ప్రాంతాలను మహారాష్ట్రలోను, కన్నడం మాట్లాడే ప్రాంతాలనుకర్ణాటకలోను కలిపి తెలుగు మాట్లాడే ప్రాంతాలను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చెయ్యాలని సూచించింది. అయితే ఐదు సంవత్సరాల తరువాత రాష్ట్రశాసనసభలో మూడింట రెండు వంతులు సభ్యులు ఒప్పుకుంటే, ఆంధ్రతో విలీనం చెయ్యవచ్చని కూడా సూచించింది. కమిషను సూచనలను ఆహ్వానించి, ప్రత్యేక రాష్ట్రవాదనను సమర్ధించిన వారిలో కె.వి.రంగారెడ్డిమర్రి చెన్నారెడ్డి ప్రముఖులు. హైదరాబాదు శాసనసభలో అధిక శాతం సభ్యులు విశాలాంధ్రను సమర్ధించారు. శాసనసభలో ఈ విషయంపై చర్చ జరిగినపుడు, 103 మంది సభ్యులు విశాలంధ్రకు మద్దతు తెలుపగా, 29 మంది మాత్రమే వ్యతిరేకించారు. 15 మంది తటస్థంగా ఉండిపోయారు. విశాలాంధ్రను సమర్ధించిన ప్రముఖ నాయకులలో అప్పటి ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణా రావుమాడపాటి హనుమంతరావుస్వామి రామానంద తీర్థ మొదలైనవారు ఉన్నారు. దీని నివేదికపై తెలంగాణా, విశాలాంధ్ర వాదులు తమతమ వాదనలను తీవ్రతరం చేసారు. కమ్యూనిస్టులు తీవ్రంగా ప్రతిస్పందిస్తూ, హైదరాబాదు శాసనసభకు రాజీనామా చేసి, ఈ విషయంపై ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. కాంగ్రెసు అధిష్ఠానం కూడా విశాలాంధ్రనే సమర్ధించి, ఆంధ్ర, తెలంగాణా నాయకులను తమ విభేదాలను పరిష్కరించుకొమ్మని ఒత్తిడి చేసింది. 1956 ఫిబ్రవరి 20 న ఢిల్లీలో రెండు ప్రాంతాల నాయకులు సమావేశమయ్యారు. తెలంగాణా తరపునబూరుగుల రామకృష్ణా రావుకె.వి.రంగారెడ్డి (మర్రి చెన్నారెడ్డికి మామ. ఈయన పేరిటే 1978 లో చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రంగారెడ్డి జిల్లా ఏర్పాటయింది.),మర్రి చెన్నారెడ్డిజె.వి.నర్సింగ్ రావు పాల్గొనగా, ఆంధ్ర తరపున బెజవాడ గోపాలరెడ్డినీలం సంజీవరెడ్డిగౌతు లచ్చన్నఅల్లూరి సత్యనారాయణ రాజు సమావేశాల్లో పాల్గొన్నారు. ఆ విధంగా అనేక చర్చలు, సంప్రదింపుల అనంతరం 1956 జూలై 19 న వారిమధ్య పెద్దమనుషుల ఒప్పందం కుదిరింది; ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైంది.1956నవంబర్ 1న అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ చేతుల మీదుగా ఆంధ్ర ప్రదేశ్‌ ఆవిర్భవించింది. నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. అప్పటి వరకు హైదరాబాదు ముఖ్యమంత్రిగా ఉన్న బూరుగుల రామకృష్ణా రావుకు కేరళ గవర్నరు పదవి లభించింది. ఆంధ్ర రాష్ట్ర గవర్నరు అయిన సి.ఎం.త్రివేది, ఆంధ్ర ప్రదేశ్‌ తొలి గవర్నరుగా కొనసాగాడు.


ఉపముఖ్యమంత్రి

పెద్దమనుషుల ఒప్పందంలోని చాలా ముఖ్యమైన అంశం:రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమంత్రి కోస్తా, రాయలసీమ నుండి ఉంటే ఉపముఖ్యమంత్రి తెలంగాణా నుండి, ముఖ్యమంత్రి తెలంగాణా వ్యక్తి అయితే ఉపముఖ్యమంత్రి కోస్తా,రాయలసీమ ప్రాంతాల నుండి ఉండాలి.కాబినెట్ మంత్రులలో 40 శాతం తెలంగాణా ప్రాంతానికి చెందిన వారే ఉండాలి.

కొత్తజిల్లాలు

తరువాతి కాలంలో మరో మూడు జిల్లాలు ఏర్పడ్డాయి. ఆవి: 1970 లో ప్రకాశం జిల్లా, 1978లో రంగారెడ్డి జిల్లా, 1979 లో విజయనగరం జిల్లా. వీటితో కలిపి మొతం 23 జిల్లాలయ్యాయి.ఇంకా విజయవాడ,రాజమండ్రి,తిరుపతి,నంద్యాల,మంచిర్యాల,అమలాపురం మొదలైనకొత్తజిల్లాలకోసం ఆయా ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ ఇటీవలి చరిత్


తొలి ప్రభుత్వాలు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి ప్రమాణ స్వీకారం చేసాడు. కానీ ఆయన అఖిల భారత కాంగ్రెసు కమిటీ కి అధ్యక్షుడవడంతో 1960 జూన్ 10న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసాడు. తరువాత రాయలసీమకు చెందిన నేత దామోదరం సంజీవయ్యముఖ్యమంత్రి అయ్యాడు. 1962 సార్వత్రిక ఎన్నికల తరువాత సంజీవరెడ్డి మళ్ళీ 1962 మార్చి 12న ముఖ్యమంత్రి అయ్యాడు. కర్నూలు రవాణా వ్యవస్థ జాతీయీకరణ వివాదంలో సుప్రీం కోర్టు తీర్పు వ్యతిరేకంగా రావడంతో, నైతిక బాధ్యత వహిస్తూ 1964 లో ఆయన రాజీనామా చేసాడు.

ఉద్యమాల కాలం
నీలం సంజీవరెడ్డి

ఆయన తరువాత కాసు బ్రహ్మానందరెడ్డి 1964 ఫిబ్రవరి 29న ముఖ్యమంత్రి అయ్యాడు. ఏడున్నరేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాడాయన. ఆయన కాలంలోనే విశాఖ ఉక్కు ఉద్యమం, మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమాలు జరిగాయి.

1965 లో ఆంగ్లో-అమెరికను నిపుణుల సంఘం ఒకటి విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారం నెలకొల్పాలని కేంద్రప్రభుత్వానికి సలహా ఇచ్చింది. అయితే ఒరిస్సాతమిళనాడుకర్ణాటకప్రభుత్వాలు కూడా ఈ కర్మాగారం కొరకు కేంద్రాన్ని వత్తిడి చేసాయి. ఆందోళన చెందిన ప్రజలు తెన్నేటి విశ్వనాధం నాయకత్వంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో ఉద్యమం మొదలు పెట్టారు. 1965లో రాష్ట్ర శాసనసభ ఉక్కు కర్మాగారం కొరకు ఒక తీర్మానం కూడా చేసింది. 1966 అక్టోబర్‌, నవంబర్‌ లలో ఉద్యమం హింసాత్మక రూపు దాల్చింది. 32 మంది ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయారు. కర్మాగార స్థాపనను కేంద్రం ప్రకటించడంతో ఉద్యమం ఆగింది. 1971 లో ప్రధానమంత్రి ఇందిరా గాంధి కర్మాగారానికి శంకుస్థాపన చేసారు.

విద్యార్ధులతో మొదలైన మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమం రాజకీయ నాయయకుల చేతుల్లో పడి, రూపు కోల్పోయి చివరికి చల్లారిపోయింది. ఆంధ్ర ప్రదేశ్‌ ఏర్పాటు సమయంలో జరిగిన పెద్దమనుషుల ఒప్పందం లోని అంశాలు సరిగా అమలు జరగడం లేదన్న వాదన ఈ ఉద్యమానికి మూల కారణం. ఈ ఒప్పందానికి తగినట్లుగా, తమకు విద్యా, ఉద్యోగావకాశాలు రావడం లేదన్న అసంతృప్తితో విద్యార్ధులు ఒప్పందాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని కోరుతూ ఉద్యమం ప్రారంభించారు. రాజకీయావకాశాలు కోల్పోతున్నామన్న అసంతృప్తితో ఉన్న కొందరు రాజకీయ నాయకులు విద్యార్ధుల కోరికను ప్రత్యేక తెలంగాణా దిశగా మళ్ళించారు.

1971 సెప్టెంబర్ లో ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకులు కాంగ్రెసుకు తిరిగి చేరుకోవడంతో, ఉవ్వెత్తున లేచి పడే తరంగం లాగా ఉద్యమం ఎగసిపడి చల్లారిపోయింది. కాంగ్రెసు అధిష్టానంతో కుదిరిన ఒప్పందంలో భాగంగా ముఖ్యమంత్రి గా బ్రహ్మానంద రెడ్డి స్థానంలో, 1971 సెప్టెంబర్ 30 న పి.వి.నరసింహారావు అయ్యాడు. తెలంగాణా ప్రాంతానికి చెందిన మొదటి ముఖ్యమంత్రి ఆయన. 1972లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెసు తిరిగి అధికారంలోకి రావడంతో మళ్ళీ నరసింహారావు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ సంవత్సరం అక్టోబర్‌ లో సుప్రీం కోర్టు ఇచ్చిన ఒక తీర్పు మరో ఉద్యమానికి దారితీసింది.

హైదరాబాదు సంస్థానంలో 1915 లో నిజాము జారీ చేసిన ఒక ఫర్మానా ప్రకారం ముల్కీ నిబంధనలు అమలు లోకి వచ్చాయి. వీటి ప్రకారం హైదరాబాదు సంస్థానంలో పుట్టిన వారు కాని, హైదరాబాదులో కనీసం 15 ఏళ్ళుగా నివసిస్తూ, తమ ప్రాంతానికి తిరిగి వెళ్ళమని అఫిడవిట్టు ఇచ్చిన వారు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు. స్వాతంత్ర్యానికి పూర్వమే అమల్లో ఉన్న ఈ నియమాలు రాజ్యాంగబద్ధమే అని 1971 అక్టోబర్ లో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.

తమ రాష్ట్ర రాజధానిలోనే తాము నిరాదరణకు గురయ్యామన్న ఆవేదన కలిగిన ఆంధ్ర ప్రాంత ప్రజలు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని కోరుతూ జై ఆంధ్ర ఉద్యమాన్ని లేవదీసారు. ఉద్యమం తీవ్ర రూపం ధరించిన తరుణంలో రాష్ట్రప్రభుత్వం నుండి, తొమ్మిది మంది మంత్రులు రాజీనామా చేసారు. 1973 జనవరి 10 న, సరిగ్గా నరసింహారావు మంత్రివర్గ విస్తరణ చేసిన రెండు రోజులకు, కేంద్రప్రభుత్వం ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించింది. రాష్ట్రపతి పాలన సమయంలో కేంద్ర హోం మంత్రి కె సి పంత్‌ కుదిర్చిన ఒక ఆరు సూత్రాల ఒప్పందంతో రెండు ప్రాంతాల నాయకుల మధ్య సయోధ్య కుదిరింది.

ఒప్పందంలో భాగంగా 1973 డిసెంబర్ 10 న జలగం వెంగళరావు ముఖ్యమంత్రి అయ్యాడు. నక్సలైటు ఉద్యమాన్ని కఠినంగా అణచివేసిన నేతగా జలగం ప్రసిద్ధి చెందాడు. 1975లో ప్రపంచ తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించి పేరు తెచ్చుకున్నాడు. ఆంధ్ర ప్రదేశ్‌ లో సినిమా పరిశ్రమ నిలదొక్కుకోడానికి అవసరమైన చర్యలు తీసుకున్నాడు

కాంగ్రెసులో కలహాలు

1978 జనవరిలో కాంగ్రెసు చీలి ఇందిరా కాంగ్రెసు ఏర్పడినప్పుడు, రాష్ట్రంలో అధిక కాంగ్రెసు నాయకులు రెడ్డి కాంగ్రెసు లో చేరారు. మర్రి చెన్నారెడ్డి మాత్రం ఇందిరా కాంగ్రెసులో ఉన్నాడు. 1978 ఫిబ్రవరిలో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఇందిరా కాంగ్రెసు 175 స్థానాలు సాధించి అధికారం కైవసం చేసుకుంది. చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు.

1978 - 1983 మధ్య కాలంలో రాష్ట్ర కాంగ్రెసులోని అంతర్గత కలహాల కారణంగా నలుగురు ముఖ్యమంత్రులను మార్చి, పార్టీ అప్రదిష్ట పాలయింది. 1978 మార్చి 6 నుండి 1980అక్టోబర్ 11 వరకు చెన్నా రెడ్డి, తరువాత 1982 ఫిబ్రవరి 24 వరకు టంగుటూరి అంజయ్య, తదుపరి కేవలం ఏడు నెలల పాటు భవనం వెంకట్రామ్ ముఖ్యమంత్రులు కాగా 1983జనవరి 9 వరకు కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు

తెలుగుదేశం ప్రాభవం

నందమూరి తారక రామారావు
1982 లో రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే సంఘటన జరిగింది. సినిమాల్లో తన నటన ద్వారా ప్రజల మన్ననలు పొందిన నందమూరి తారక రామారావు మార్చి 29 న తెలుగుదేశం పేరుతో రాజకీయ పార్టీ స్థాపించారు. కాంగ్రెసు అసంతృప్త నాయకుడు, నాదెండ్ల భాస్కరరావు ఆయనతో చేతులు కలిపాడు. పదే పదే ముఖ్యమంత్రుల్ని మార్చి కాంగ్రెసు పార్టీ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసిందని ఆరోపిస్తూ, ఆత్మగౌరవ పునరుద్ధరణ నినాదంతో నందమూరి తారక రామారావు ప్రజల్లోకి వెళ్ళారు. 1983 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం 198 స్థానాలు గెలుచుకొని అధికారానికి రాగా, 60 స్థానాలతో కాంగ్రెసు ప్రతిపక్షంగా నిలిచింది. ఆంధ్ర ప్రదేశ్‌ లో మొట్ట మొదటి సారిగా కాంగ్రెసు ప్రతిపక్షం స్థానానికి చేరింది.

కమ్యూనిస్టు పార్టీలైన సి.పి.ఐ మరియు సి.పి.ఎం లు పరస్పర అవగాహనతో పోటీ చేసినా, 4, 9 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. కోస్తా,రాయలసీమ ప్రాంతాల్లో రామారావు ప్రభంజనం ఎంత బలంగా ఉందంటే - ఈ రెండు ప్రాంతాల్లో కలిపి కాంగ్రెసుకు కేవలం 8 శాతం స్థానాలు మాత్రమే దక్కాయి.

రామారావు చేతిలో ఓటమి కాంగ్రెసుకు భరించరానిదయింది. రెండు పార్టీల మధ్య ఉన్న వైరం కాంగ్రెసు పాలిత కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య సంబంధాలకు పాకింది. 1984 ఆగష్టు 16 న రామారావు శస్త్రచికిత్సకై అమెరికా వెళ్ళిన సమయంలో, గవర్నరు రాంలాల్‌, రామారావును ముఖ్యమంత్రిగా తొలగించి, నాదెండ్ల భాస్కరరావు చేత ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించాడు. రామారావును పైలట్‌ గా, తనను కో పైలట్‌ గా చెప్పుకున్న భాస్కరరావు కాంగ్రెసు పార్టీ పరోక్ష అండదండలతో, తగినంత మంది శాసనసభ్యుల మద్దతు లేకున్నా గద్దెనెక్కగలిగాడు.

ప్రతిపక్ష పార్టీలన్నిటినీ కలుపుకుని రామారావు దీనిని చాలా సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. సంయుక్త ప్రతిపక్షం రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, ప్రజల మద్దతును కూడగట్టింది. రామారావు తొలగింపు పట్ల ప్రజల్లో వ్యతిరేకతను గమనించిన కేంద్రం గవర్నరును మార్చి, సెప్టెంబర్ 16 న రామారావును తిరిగి ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి మార్గం సుగమం చేసింది. ధర్మయుద్ధం గా రామారావు వర్ణించుకున్న ఈ నెల రోజుల ప్రజాస్వామిక సమరంలో సమైక్య ప్రతిపక్షం గెలిచింది. తొలగించబడిన ఒక ముఖ్యమంత్రి తిరిగి ప్రతిష్ఠితుడవ్వడం భారత దేశ రాజకీయాల్లో అదే తొలి, అదే తుది.

ఆ తరువాత తెలుగుదేశం, కమ్యూనిస్టు, భాజపాజనతా పార్టీలు కలిసి మిత్రపక్షాలుగా ఏర్పడి ఎన్నికలలో సమైక్యంగా పోటీ చేసాయి. రామారావు 1985లో శాసనసభకు మధ్యంతర ఎన్నికలు జరిపించి, మరింత మెరుగైన ఫలితాలు సాధించాడు. ఈ ఎన్నికలలో నాదెండ్ల భాస్కరరావు ప్రజాస్వామ్య తెలుగుదేశం పేరుతో పార్టీ పెట్టి, 220 స్థానాల్లో పోటీ చేయగా, కేవలం రెండు స్థానాల్లో మాత్రమే డిపాజిట్లు దక్కించుకోగలిగాడు.

1985 - 1989 మధ్యకాలంలో రామారావు కొన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నాడు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుండి, 55 సంవత్సరాలకు తగ్గించడం, గ్రామసేవకుల వ్యవస్థ రద్దు, పూజారి వ్యవస్థ రద్దు మొదలైనవి వీటిలో కొన్ని. 1989 ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ 182 స్థానాల్లో గెలిచి మళ్ళీ అధికారానికి వచ్చింది. మర్రి చెన్నారెడ్డి 1989డిసెంబర్ 3 న రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాడు.

అయితే కాంగ్రెసులోని ముఠా తగాదాలు యధావిధిగా కొనసాగాయి. కాంగ్రెసు అంతర్గత కలహాలు ఏ స్థాయిలో ఉనాయంటే, హైదరాబాదులో జరిగిన మతకలహాలు కాంగ్రెసు నాయకుడు నేదురుమల్లి జనార్ధనరెడ్డి జరిపించినవేనని ముఖ్యమంత్రి ఆరోపించాడు. 1990 డిసెంబర్ 17న చెన్నారెడ్డి స్థానంలో జనార్ధన రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చెయ్యగానే మతకలహాలు ఆగిపోవడం విశేషం. కాపిటేషను కళాశాలల కుంభకోణంలో చిక్కుకున్న జనార్ధనరెడ్డి స్థానంలో 1992 అక్టోబర్ 9 న కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన హయాంలో చారిత్రాత్మకమైన సారా వ్యతిరేక ఉద్యమం జరిగింది. ప్రతిపక్ష పార్టీలు ఈ ఉద్యమానికి మద్దతునిచ్చాయి.

1994 ఎన్నికలలో చరిత్ర పునరావృతమై, తెలుగుదేశం, మిత్రపక్షాలు కలిసి 253 స్థానాలు గెలుచుకున్నాయి. కాంగ్రెసు కేవలం 26 స్థానాలు గెలిచింది. రామారావు ముఖ్యమంత్రిగా1994 డిసెంబర్ 12 న ప్రమాణస్వీకారం చేసాడు. కానీ పార్టీలోని అంతర్గత అధికార పోరాటాల కారణంగా 1995 సెప్టెంబర్‌ 1 న రామారావు అల్లుడు, మంత్రీ అయిన నారా చంద్రబాబు నాయుడు అత్యధిక శాసనసభ్యుల మద్దతుతో రామారావును తొలగించి, ముఖ్యమంత్రి పదవిని అధిష్టించాడు. దాదాపు పదిసంవత్సరాలు, హైదరాబాదును దేశంలో ప్రధానమైన పట్టణాన్ని తీర్చిదిద్దాడు. అయితే గ్రామీణ రైతుల అవసరాలపై దృష్టిపెట్టలేదన్న అపవాదంతో 2004ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోయింది.


మరల కాంగ్రెస్ చేతిలో అధికారం


వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ 2004 లో తిరిగి అధికారంలోకి వచ్చింది. తరువాత 2009లో కూడా విజయంసాధించింది. ఈ దశలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వుద్యమం పుంజుకుంది. వైఎస్ఆర్ అకాలమరణంతో కాంగ్రెస్ రాజకీయాలలో కేంద్రం పాత్ర ఎక్కువైంది.

సుప్రసిద్ధ ఆంధ్రులు-జాబితా



ఆధ్యాత్మిక రంగ ప్రముఖులు, తత్త్వవేత్తలు, వేదాంతులు, పండితులు



స్వాతంత్ర్య సమరయోధులు, ప్రజా నాయకులు, ఉద్యమకారులు




కవులు, రచయితలు, పాత్రికేయులు, విమర్శకులు


ప్రధాన వ్యాసము: తెలుగు సాహితీకారులు
ప్రధాన వ్యాసము: ఉర్దూ సాహితీకారులు


వాగ్గేయకారులు

సంగీతజ్ఞులు, సంగీత దర్శకులు, గాయకులు

సంఘ సంస్కర్తలు, సంఘ సేవకులు/సేవికలు

శాస్త్రజ్ఞులు, సాంకేతిక నిపుణులు, అధ్యాపకులు, వైద్యరంగ ప్రముఖులు

చిత్రకారులు, శిల్పకారులు, నాట్యకారులు, ఇతర కళాకారులు

పాతతరం నటులు, నటీమణులు


మధ్యతరం నటులు, నటీమణులు


కొత్తతరం నటులు, నటీమణులు


సినిమా సాంకేతిక నిపుణులు, సినిమా వ్యాపారవేత్తలు


పాత్రికేయులు

వ్యాపార రంగ ప్రముఖులు

ప్రఖ్యాత క్రీడాకారులు

ప్రధాన వ్యాసము: ప్రఖ్యాత క్రీడాకారులు

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు

ఆంధ్ర రాష్ట్రం
ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ లో భాగమైన కోస్తారాయలసీమ ప్రాంతాలు బ్రిటిషు వారి కాలంలో మద్రాసు ప్రెసిడెన్సీ లో భాగంగా ఉండేవి. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, 1950జనవరి 26 న భారత రాజ్యాంగం అమలౌలోకి వచ్చిన రోజున మద్రాసు ప్రెసిడెన్సీ మద్రాసు రాష్ట్రంగా మారింది. 1953అక్టోబర్ 1 న కోస్తా, రాయలసీమ ప్రాంతాలను మద్రాసు రాష్ట్రం నుండి విడదీసి, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పరచారు. మద్రాసు ప్రెసిడెన్సీ,మద్రాసు రాష్ట్రాల ముఖ్యమంత్రుల జాబితా కొరకు తమిళనాడు ముఖ్యమంత్రులు చూడండి
సంఖ్యపేరుఆరంభముఅంతము
1టంగుటూరి ప్రకాశం పంతులు1953 అక్టోబర్ 11954 నవంబర్ 15
2రాష్ట్రపతి పాలన1954 నవంబర్ 151955 మార్చి 28
3బెజవాడ గోపాలరెడ్డి1955 మార్చి 281956 నవంబర్ 1

హైదరాబాదు రాష్ట్రం

ప్రస్తుత తెలంగాణ ప్రాంతం, కర్ణాటక, మహారాష్ట్రలలోని కొన్ని ప్రాంతాలతో పాటు ఒకప్పుడు నిజాము సంస్థానంలో భాగంగా ఉండేది. స్వాతంత్ర్యం తరువాత, భారత ప్రభుత్వం నిజాము సంస్థానంపై జరిపిన పోలీసు చర్య తరువాత, ఈ ప్రాంతాలు హైదరాబాదు రాష్ట్రంగా ఏర్పడ్డాయి1956 నవంబర్ 1 న హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలాను విడదీసి, ఆంధ్ర రాష్ట్రం తో కలిపి ఆంధ్ర ప్రదేశ్ ను ఏర్పాటు చేసారు.
సంఖ్యపేరుఆరంభముఅంతము
1జనరల్‌ జె ఎన్‌ చౌదరి1948 సెప్టెంబర్ 171950 జనవరి 26
2ఎం కె వెల్లోడి1950 జనవరి 261952 మార్చి 6
3బూర్గుల రామకృష్ణారావు1952 మార్చి 61956 అక్టోబర్ 31

ఆంధ్ర ప్రదేశ్

సంఖ్యపేరుఆరంభముఅంతమురాజకీయ పార్టీ
1నీలం సంజీవరెడ్డి1956 నవంబర్ 11960 జనవరి 11కాంగ్రెసు
2దామోదరం సంజీవయ్య1960 జనవరి 111962 మార్చి 29కాంగ్రెసు
3నీలం సంజీవరెడ్డి1962 మార్చి 291964 ఫిబ్రవరి 29కాంగ్రెసు
4కాసు బ్రహ్మానంద రెడ్డి1964 ఫిబ్రవరి 291971 సెప్టెంబర్ 30కాంగ్రెసు
5పి.వి.నరసింహారావు1971 సెప్టెంబర్ 301973 జనవరి 10కాంగ్రెసు
6రాష్ట్రపతి పాలన1973 జనవరి 101973 డిసెంబర్ 10
7జలగం వెంగళరావు1973 డిసెంబర్ 101978 మార్చి 6కాంగ్రెసు
8డా.మర్రి చెన్నారెడ్డి1978 మార్చి 61980 అక్టోబర్ 11కాంగ్రెసు-ఐ
9టంగుటూరి అంజయ్య1980 అక్టోబర్ 111982 ఫిబ్రవరి 24కాంగ్రెసు-ఐ
10భవనం వెంకట్రామ్1982 ఫిబ్రవరి 241982 సెప్టెంబర్ 20కాంగ్రెసు-ఐ
11కోట్ల విజయభాస్కరరెడ్డి1982 సెప్టెంబరు 201983 జనవరి 9కాంగ్రెసు-ఐ
12నందమూరి తారక రామారావు1983 జనవరి 91984 ఆగష్టు 16తెలుగుదేశం
13నాదెండ్ల భాస్కరరావు1984 ఆగష్టు 161984 సెప్టెంబర్ 16కాంగ్రేసు
14నందమూరి తారక రామారావు1984 సెప్టెంబర్ 161985 మార్చి 9తెలుగుదేశం
15నందమూరి తారక రామారావు1985 మార్చి 91989 డిసెంబర్ 3తెలుగుదేశం
16డా.మర్రి చెన్నారెడ్డి1989 డిసెంబర్ 31990 డిసెంబర్ 17కాంగ్రేసు
17నేదురుమిల్లి జనార్ధనరెడ్డి1990 డిసెంబర్ 171992 అక్టోబర్ 9కాంగ్రేసు
18కోట్ల విజయభాస్కరరెడ్డి1992 అక్టోబర్ 91994 డిసెంబర్ 12కాంగ్రేసు
19నందమూరి తారక రామారావు1994 డిసెంబర్ 121995 సెప్టెంబర్ 1తెలుగుదేశం
20నారా చంద్రబాబునాయుడు1995 సెప్టెంబర్‌ 12004 మే 14తెలుగుదేశం
21వై.యస్.రాజశేఖరరెడ్డి2004 మే 142009 సెప్టెంబర్ 2కాంగ్రేసు
22కొణిజేటి రోశయ్య2009 సెప్టెంబర్ 32010 నవంబర్ 24కాంగ్రేసు
23నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి2010 నవంబర్ 25
కాంగ్రేసు

ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్లు


సంఖ్యపేరుఆరంభముఅంతము
1సి.ఎం.త్రివేది01/11/195331/07/1957
2భీమసేన్ సచార్01/08/195707/09/1962
3జనరల్. ఎస్.ఎం.శ్రీనగేష్08/09/196203/05/1964
4పీ.ఏ.థాను పిల్లై04/05/196410/04/1968
5ఖాండూభాయి కసాంజీ దేశాయి11/04/196825/01/1975
6జస్టిస్ ఎస్.ఓబులరెడ్డి25/01/197509/01/1976
7మెహనలాల్ సుఖాడియా10/01/197615/06/1976
8ఆర్.డీ.భండారీ16/06/197616/02/1977
9జస్టిస్ బీ.జె.దివాన్17/02/197704/05/1977
10శారద ముఖర్జీ05/05/197714/08/1978
11కె.సి.ఆబ్రహాం15/08/197814/08/1983
12రామ్ లాల్15/08/198329/08/1984
13డా. శంకర్ దయాళ్ శర్మ29/08/198426/11/1985
14కుముద్ బెన్ జోషి26/11/198507/02/1990
15కృష్ణకాంత్07/02/199021/08/1997
16జి.రామానుజం22/08/199723/11/1997
17డా. సి.రంగరాజన్24/11/199702/01/2003
18సుర్జీత్‌ సింగ్‌ బర్నాలా03/01/200303/11/2004
19సుషీల్‌ కుమార్‌ షిండే04/11/200429/01/2006
20రామేశ్వర్ ఠాకూర్29/01/200619/08/2007
21నారాయణదత్ తివారీ19/08/200726/12/2009
22ఈ.ఎస్.ఎల్.నరసింహన్28/12/2009

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్లు

ఆంధ్ర రాష్ట్రం

హైదరాబాదు రాష్ట్రం

సంఖ్యపేరుఆరంభముఅంతము
1.కాశీనాథరావు వైద్యా1952
1956

ఆంధ్ర ప్రదేశ్

సంఖ్యపేరుఆరంభముఅంతము
1.అయ్యదేవర కాళేశ్వరరావు19561962
2.బి.వి.సుబ్బారెడ్డి19621970
3.బి.వి.సుబ్బారెడ్డి19701971
4.కె.వి.వేమారెడ్డి19711972
5.పిడతల రంగారెడ్డి19721974
6.ఆర్.దశరథరామిరెడ్డి19751978
7.దివికొండయ్య చౌదరి19781981
8.కోన ప్రభాకరరావు19811981
9.ఏ.ఈశ్వరరెడ్డి19811983
10.తంగి సత్యనారాయణ19831984
11.ఎన్.వెంకటరత్నం19841985
12.జి.నారాయణరావు19851989
13.పి.రామచంద్రారెడ్డి19901990
14.డి.శ్రీపాదరావు19911994
15.యనమల రామకృష్ణుడు19941999
16.కె.ప్రతిభాభారతి19992004
17.కె.ఆర్.సురేష్‌రెడ్డి20042009
18.ఎన్‌.కిరణ్‌ కుమార్‌ రెడ్డి20092011
18.నాదెళ్ల manohar2011












No comments:

Post a Comment