ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అధినేత ముఖ్యమంత్రి కాగా, రాష్ట్ర పరిపాలన గవర్నరు పేరున జరుగుతుంది.
విషయ సూచిక
|
గవర్నర్
ఈ.ఎస్.ఎల్.నరసింహన్
ఈ.ఎస్.ఎల్.నరసింహన్ | |
ఆంధ్రప్రదేశ్ గవర్నర్
| |
పదవీ కాలము డిసెంబరు 28, 2009- | |
ముందు | నారాయణదత్ తివారీ |
---|---|
జననం | డిసెంబర్ 0 1946 |
నివాసము | హైదరాబాదు ఆంధ్రప్రదేశ్ |
మతం | హిందూ |
ఈ.ఎస్.ఎల్.నరసింహన్ (Ekkadu Srinivasan Lakshmi Narasimhan) (తమిళం: ஈக்காடு சீனிவாசன் லக்ஷ்மி நரசிம்மன்) (జననం1946) మద్రాసు విశ్వవిద్యాలయములో భౌతిక శాస్త్రంలో పట్టా పుచ్చుకున్నాడు. రాజకీయ శాస్త్రంలో ఉన్నత పట్టా చదివాడు. మద్రాసు న్యాయ విశ్వవిద్యాలయము నుండి ఎల్ఎల్బి పూర్తి చేశాడు. 1968లో భారత పోలీసు సేవలో చేరి,ఆంధ్రప్రదేశ్ విభాగానికి చేరాడు. ఇంటిలిజెన్స్ బ్యూరో ప్రధాన అధికారిగా పనిచేసి 2006 లో ఉద్యోగ విరమణ చేశాడు. ఆ తరువాత మాస్కో రాయబారిగా పనిచేసాడు. ఛత్తీస్ఘర్ కి మూడవ గవర్నర్ గా పనిచేసి డిసెంబర్ 28, 2009న అదనపు భాధ్యతగా 22 వ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేశాడు. జనవరి 22,2010న పూర్తి భాధ్యతలు స్వీకరించాడు.
ముఖ్యమంత్రి
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి 2010, నవంబర్ 25 న రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. ముఖ్యమంత్రి కార్యాలయము ముఖ్యమంత్రి కార్యాక్రమాలను సమన్వయంచేస్తుంది
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి | |
![]() | |
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి
| |
పదవీ కాలము 2010- | |
ముందు | కొణిజేటి రోశయ్య |
---|---|
నియోజకవర్గము | పీలేరు |
జననం | సెప్టెంబర్ 13 1960 |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెసు |
నివాసము | హైద్రాబాద్ |
మతం | హిందూ |
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి 1960, సెప్టెంబర్ 13న నల్లారి సరోజమ్మ, అమరనాథరెడ్డిలకు హైదరాబాదులోజన్మించాడు.నిజాం కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాలయాలలో బీకాం, ఎల్ఎల్‌బీ చదివాడు. నిజాం కళాశాల విద్యార్థి సంఘ నాయకునిగా పని చేశాడు. రాష్ట్రం తరఫున రంజీ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ లకు ప్రాతినిథ్యం వహించాడు. ఈయన కెప్టెన్ గా వున్నప్పుడు జట్టులోని ప్రముఖులలో అజారుద్దీన్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, హర్షా భోగ్లే - ప్రఖ్యాత క్రికెట్ వ్యాఖ్యాత వున్నారు. 2010-నవంబర్ 25 న 16 వ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టాడు.
విషయ సూచిక
|
No comments:
Post a Comment